Home Remedies to Remove Color Stains : హోలీ (Holi 2026) ఆడినప్పుడు చర్మం, జుట్టుపై రంగులు పడతాయి. కాస్త కష్టం అయినా కొన్ని చిట్కాలు ఫాలో అయితే వాటిని సులభంగా వదిలించుకోవచ్చు. కానీ బట్టలు అలా కాదు. కొన్ని సందర్భాల్లో అవి మొండిమరకలుగా తయారువుతాయి. కాసేపు హోలీ ఆడి.. మరికాసేపు డ్రై అవ్వడం, వాటర్ కలర్స్ వంటివి డ్రెస్స్​లపై ఎక్కువసేపు ఉండిపోతాయి. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవుతూ ఈజీగా రంగులను దుస్తుల నుంచి దూరం చేసుకోవచ్చు. 

హోలీ సమయంలో పిల్లలు, పెద్దలు రంగులతో తడిసి ముద్దవుతారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఆనందంగా రంగులు చల్లుకుంటూ డ్యాన్స్​లు వేస్తారు. అయితే ఈ సమయంలో చాలామందికి స్కిన్, హెయిర్​తో పాటు డ్రెస్స్​లపై పడే కలర్స్ ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తారు. 

రంగులను తొలగించే సులభమైన ఇంటి చిట్కాలు

రంగు అంటుకున్న చోట ఉప్పు చల్లి.. నిమ్మరసం పిండి 15 నిమిషాలు ఉంచండి. అలాగే వాటిని చల్లటి నీటితో కడగండి. లైట్ కలర్స్‌ అయితే వెనిగర్ కప్పు తీసుకుని.. దానిలో రెండు కప్పుల నీరు వేసి.. 20 నిమిషాలు బట్టలను నానబెట్టండి. తర్వాత కడిగితే రంగులు పోతాయి. ఇది కాటన్ దుస్తులకు బాగా పనిచేస్తుంది.

బేకింగ్ సోడాలో నీరు కలిపి పేస్ట్ చేయండి. రంగు ఉన్న చోట రాసి 30 నిమిషాలు ఉంచండి.  తర్వాత బ్రష్‌తో మెల్లగా రుద్ది కడగండి. అలాగే తాజా పాలను రంగు ఉన్న చోట రాసి అరగంట తర్వాత కడగండి. సిల్క్, డెలికేట్ ఫ్యాబ్రిక్స్‌కి ఇది బెస్ట్ టిప్. 

మొండి మరకలు ఉంటే..

డ్రెస్​లపై పడినవి మొండి మరకలుగా మారితే.. డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ అప్లై చేయాలి. డిటర్జెంట్‌లో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి.. స్టెయిన్‌పై అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి తర్వాత వాష్ చేయాలి. తెల్ల బట్టలకు ఇది బెస్ట్ టిప్. వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీటిలో నానబెడితే.. మొండి మరకలు సులభంగా వదులుతాయి.

చేయకూడని పనులు ఇవే

రంగు ఉన్న బట్టలను ఎండలో వేయకూడదు. బ్లీచ్‌ను కలర్ దుస్తులపై వాడటం మంచిది కాదు. అలాగే హార్ష్ బ్రష్‌తో రుద్దకూడదు. రంగులు డ్రెస్స్​లపై అంటుకుంటే.. వాటిని వేడి నీటిలో వేయకండి. ముందుగా వాటిని చల్లటి నీటితో కడగాల్సి ఉంటుంది. అలాగే రంగు ఎండిపోయేలోపే క్లీనింగ్ చేస్తే ఫలితం బాగా ఉంటుంది.