Kashmiri Saffron : కశ్మీర్‌ను భూతల స్వరంగా పిలుస్తారు. మనోహరమైన లోయలు, సహజమైన సరస్సులు, జలపాతాలకు మాత్రమే కాకుండా, విలువైన ఎర్ర బంగారంగా చెప్పుకునే కుంకమ పువ్వునకు కూడా ప్రసిద్ధి చెందింది. కశ్మీరీ కుంకుమ పువ్వు, ఇరాన్‌తో దాని సంబంధం గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Continues below advertisement

కశ్మీరీ కుంకుమ పువ్వు క్రోకస్ సాటివస్ పువ్వుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ప్రతి పువ్వు మూడు ఎరుపు-నారింజ రంగు స్టిగ్మాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని జాగ్రత్తగా చేతితో కోసి ఎండబెట్టి కుంకుమ పువ్వును ఉత్పత్తి చేస్తారు. 1 కిలోగ్రాము కుంకుమ పువ్వును ఉత్పత్తి చేయడానికి సుమారు 150,000 పువ్వులు అవసరం.

Continues below advertisement

కశ్మీరీ కుంకుమ పువ్వు దాని ముదురు ఎరుపు రంగు, ఘాటైన వాసన, గొప్ప రుచికి ప్రసిద్ధి చెందింది. ఇరాన్, స్పెయిన్ లేదా గ్రీస్‌లో పండించే కుంకుమ పువ్వుతో పోలిస్తే, కశ్మీరీ కుంకుమ పువ్వు అత్యంత తియ్యగా, అందంగా పరిగణిస్తారు. 

పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతం కశ్మీర్‌లో కుంకుమపువ్వు సాగుకు ప్రధాన కేంద్రం. 4,500 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం ఏటా 4-5 టన్నుల కుంకుమపువ్వును ఉత్పత్తి చేస్తుంది.

కశ్మీర్‌లో కుంకుమ సాగు అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పు, తక్కువ వర్షపాతం ప్రభావం చూపుతుంది. భారత ప్రభుత్వం 2020లో కాశ్మీరీ కుంకుమపువ్వుకు భౌగోళిక సూచిక ట్యాగ్‌ను మంజూరు చేసింది.

ప్రపంచంలోని 80% కుంకుమపువ్వు ఇరాన్ నుంచి వస్తుంది. అయితే, కశ్మీరీ కుంకుమపువ్వుకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా, యూరప్, కెనడా, గల్ఫ్ దేశాలలో, దీని ధర పౌండ్‌కు $5,000 వరకు ఉంటుంది.

కశ్మీరీ కుంకుమ పువ్వుకు ఇరాన్‌తో ప్రత్యక్ష చారిత్రక సంబంధం ఉంది. ఇరానియన్ సూఫీ సాధువులు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో కుంకుమ పువ్వు సాగును ప్రవేశపెట్టారు. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా కొనసాగుతోంది, ఏటా 300 టన్నుల కుంకుమ పువ్వును పండిస్తోంది. అయితే, కశ్మీరీ కుంకుమ పువ్వు దాని స్వచ్ఛత, ఇతర అంశాల కారణంగా ఇరానియన్ కుంకుమ పువ్వు కంటే 60% నుంచి 75% ఖరీదైనది.