Importance of Jaggery in Vinayaka Chavithi Sweets : వినాయకచవితి వచ్చేసింది. ఈ సమయంలో గణపతికి వివిధ రకాల ఫుడ్స్ చేసి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పలు రకాల స్వీట్స్ చేసి నైవేద్యంగా పెడతారు. అయితే వీటిని స్వీట్స్‌తో కాకుండా బెల్లంతో చేస్తే వినాయకుడు ప్రసన్నమవుతాడని.. గణపతి బొప్పాకి బెల్లం అంటే ఇష్టమని చెప్తారు. అయితే బెల్లంతో వంటలు చేయడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. ఇంతకీ ఆ రీజన్ ఏంటి? వినాయకుడికి బెల్లంతో ఎలాంటి ప్రసాదాలు చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం.
బెల్లంతో చేసుకోగలిగే వంటలు ఇవే..
చవితి సమయంలో బెల్లంతో పాయసం, బొబ్బట్లు, పొంగల్, బెల్లం తాళికలు వంటి పలు రకాల ప్రసాదాలు చేయొచ్చు. అయితే ఈ వంటల వంటలను బెల్లంతో చేయడానికి ఉన్న రీజన్ ఏంటంటే.. హెల్త్ బెనిఫిట్స్. అవును వినాయక చవితి సమయంలో దాదాపు వర్షాలు వస్తుంటాయి. ఆ సమయంలో వచ్చే పలు రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో బెల్లం మంచి ప్రయోజనాలు అందిస్తుంది అంటారు. అంతేకాకుండా పలు రకాల దీర్ఘకాలిక సమస్యలను కూడా ఇది దూరం చేస్తుందట. బెల్లంతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే..
ముందు రోజే సిద్ధం చేసుకుంటే..
చాలామంది స్వీట్స్‌ని చక్కెరతో చేస్తారు. సమయం లేదనో.. త్వరగా అయిపోతుందనో.. ఇలా వివిధ కారణాలతో షుగర్‌తో స్వీట్స్ చేస్తారు. అయితే ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి బెల్లాన్ని మీరు వాటికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పండుగరోజు బెల్లం కోరడం, బెల్లంతో వంటలు చేయడం కష్టమనుకుంటే.. ముందు రోజే బెల్లాన్ని తురిమి పెట్టుకుని.. పండుగరోజు ఈజీగా వంటలు చేయొచ్చు. ఇవి మీకు మంచి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యానికి పలు ప్రయోజనాలు అందిస్తాయి.
సీజనల్ వ్యాధులు మాయం..
వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలను బెల్లం దూరంచేస్తుంది. మెరుగైన జీర్ణక్రియను అందించి.. ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే మీరు భోజనం చేసిన తర్వాత ఈ బెల్లాన్ని కాస్త నేరుగా తినొచ్చు. అలాగే మలబద్ధకం సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే.. మీ డైట్లో బెల్లం చేర్చుకోవచ్చు. ఇది పేగు కదలికలను వేగవంతం చేసి.. సమస్యనుంచి ఉపశమనం అందిస్తుంది. ఇమ్యూనిటీని పెంచి సీజనల్ వ్యాధులను కూడా దూరం చేసే లక్షణాలను బెల్లం కలిగి ఉంటుంది.
మహిళలకు చాలా మంచిది..
రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి బెల్లం మంచి ఆప్షన్. ఇది సమస్యను దూరం చేసి.. ఐరన్ శాతాన్ని పెంచుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. అలాంటివారు బెల్లం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా దూరం చేయగలిగే సత్తా దీనికి ఉంది. అలాగే గొంతు నొప్పిని కూడా ఇది దూరం చేసి మెరుగైన ఫలితాలు అందిస్తుంది. శరీరాన్ని డిటాక్స్ చేసి.. లోపలి నుంచి శుభ్రం చేసి.. ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా కాలేయ సమస్యలతో ఇబ్బంది పడేవారు నిపుణుల సూచనలతో బెల్లాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్..?
బెల్లాన్ని తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే.. లేవనే చెప్పాలి. కానీ.. దీనిని లిమిట్‌గా తీసుకుంటే మంచిది. బరువు తగ్గేందుకు లేదా షుగర్ సమస్యతో ఇబ్బంది పడేవారు కేలరీలు, స్వీట్ విషయంలో కాస్త అవగాహనతో ఉండాలి. లేదంటే ఇది బరువు పెరగడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్‌లో మార్పులు తీసుకువస్తుంది. కాబట్టి వీటిని తీసుకునే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహాలు తీసుకోండి. హాయిగా వినాయకచవితికి బెల్లం ప్రసాదాలు చేసుకుని లాగించేయండి.
Also Read : వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు.. గారెలు, పెరుగువడలను ఇలా టేస్టీగా చేసి పెట్టేయండి