Valentine Week 2024 : హగ్ అనేది నీకు నేను ఉన్నాననే నమ్మకం ఇస్తుంది. బాధలో ఉంటే ఓదార్పునిస్తుంది. సంతోషంలో ఉంటే దానిని రెట్టింపు చేస్తుంది. సెలబ్రేషన్​ని పీక్​ స్టేజ్​కి తీసుకెళ్తుంది. అలాంటి హగ్ (Hug Day 2024)​ని కేవలం ప్రేమించిన వ్యక్తికే కాదు. మనలోని భావాన్ని చెప్పలేని స్థితిలో ఒక్క హగ్​ ఇచ్చే వైబ్​ అవతలి వ్యక్తికి ఇతని ట్రూ ఫీలింగ్ చెప్పేస్తుంది. అందుకే హగ్ అంతటి పవర్​ ఫుల్. అంతేందుకు రామాయణంలో సీత జాడను కనిపెట్టిన ఆంజనేయుడికి రాముడు థ్యాంక్స్ చెప్పకుండా కేవలం ఓ హగ్ ఇస్తాడు. రామాయణం అంతటిలో రాముడు హగ్ చేసుకున్న ఏకైక వ్యక్తి ఆంజనేయుడు. అందుకే హగ్​కి అంత వాల్యూ ఇస్తారు. 


అలాంటి హగ్ ప్రాముఖ్యతను తెలుపుతూ.. వాలెంటైన్స్​ వీక్​లో దానికోసం ఓ ప్రత్యేకమైన డేను క్రియేట్ చేశారు. తాము ప్రేమించిన వ్యక్తికి ఓ హగ్ ఇచ్చి ఈ స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్​లో ఉన్నవారికి దీనిని సెలబ్రేట్ చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అయితే మీరు కూడా దీనిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. మీరు వీటిని ఫాలో అయిపోయి.. మీ లాంగ్​ డిస్టెన్స్ ప్రేయసి లేదా ప్రేమికుడితో సెలబ్రేట్ చేసుకోండి. 


పిల్లో గిఫ్ట్..


మీరు లేని, మీరు హగ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ ప్లేస్​ని రిప్లేస్ చేసేలా మీరు ఓ పిల్లోని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. మిమ్మల్ని హగ్ చేసుకోవాలనిపించినప్పుడు ఆమె లేదా అతడు దానిని హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేకాకుండా ఆ పిల్లోపై మీరు మీ ఇద్దరి లేదా మీ ఫోటోను ప్రింట్ చేయించి ఇవ్వవచ్చు. ఇవి మీకు ఆన్​లైన్, ఆఫ్​లైన్​లలో కూడా కొనవచ్చు.


ఫుడ్​


అవును కొన్నిసార్లు ఫేవరెట్ ఫుడ్ అనేది ఒక వెచ్చని కౌగిలి అనుభూతిని ఇస్తుంది. వారికి ఇష్టమైన ఫుడ్​ని.. వారుంటున్న ప్రాంతంలో వారికి నచ్చిన ప్లేస్​ నుంచి బుక్​ చేయవచ్చు. మీ ప్రాంతంలో వారికి ఇష్టమైన, నిల్వ ఉండగలిగే ఫుడ్​ని వారికి హగ్​ డే రోజుకి సర్​ప్రైజ్​గా పంపించవచ్చు. మీరు ఇద్దరూ కలిసి మొదటిసారి తిన్న ఫుడ్​ని కూడా వారికి పంపించవచ్చు. ఫుడ్​ కూడా ఓ లవ్​ లాంగ్వేజ్​ అని మీరు గుర్తించాలి.


బాడీ ర్యాప్


మీరు పిల్లోకి బదులు బాడీ ర్యాప్ దుప్పటిని గిఫ్ట్​గా ఇవ్వవచ్చు. ఈ ట్రెండ్ ఎప్పటినుంచో వాడుకలో ఉంది. మీరు దీనిని కస్టమైజ్ చేసుకోవచ్చు. విభిన్న పరిమాణాలు, రంగులు, డిజైన్లలో బాడీ ర్యాప్​ను డిజైన్ చేయించి వారికి గిఫ్ట్​గా పంపించవచ్చు. 


లెటర్స్​ టూ లవ్


హగ్​ డే రోజున మీ లవర్​ లేదా ప్రేమించిన, ఆరాధించే వ్యక్తికి మీ స్వదస్తూరితో ఒక లెటర్ రాయొచ్చు. ఇది మీరు లేని లోటుని తీర్చి.. మీరు ఉన్నారనే భావనను కలిగిస్తుంది. అంతేకాకుండా దానిని చదివిన ప్రతిసారి వారు భావోద్వేగాలకు గురవుతారు. 


స్క్రాప్ బుక్ 


మీ ఇద్దరి ఫోటోలను మంచి స్క్రాప్​ బుక్​గా తయారు చేయవచ్చు. మీరు ఇద్దరు కలిసి తిరిగిన ప్రాంతాలు.. వెళ్లాలనుకునే ప్రాంతాలు, ప్లాన్​తో మీరు ఓ స్క్రాప్ బుక్​ తయారు చేసుకోవచ్చు. ఇది వారికి మీరు ఇచ్చే అతి పెద్ద హగ్ అవుతుంది. మిమ్మల్ని మిస్​ అయినప్పుడు వారు స్క్రాప్ బుక్​ని హగ్ చేసుకుని మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. 


Also Read : మీ లవర్​కి ఇలాంటి ప్రామిస్ చేస్తే చాలు.. మీరు హ్యాపీగా ఉంటారు..