Sri Satya Sai District News: పెనుగొండలో కొంత మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీకెండ్ కావడంతో బెంగళూరు నుంచి పెనుగొండ సమీపంలోని లక్ష్మీ నరసింహ స్వామి కొండ దారిలో యువకులు పెద్ద ఎత్తున బైక్ రేసింగ్ కు పాల్పడుతున్నారు. పలుమార్లు బైక్ రేసింగ్ జరుగుతూ ఉండడంతో ప్రమాదాలు కూడా సంభవించాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి స్పోర్ట్స్ బైకులతో యువకులు సత్యసాయి జిల్లాకు వచ్చి పెద్ద ఎత్తున రేసింగ్ లో పాల్గొని బెట్టింగ్ లకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈ ఘటనపై స్పందించలేదని స్థానికులు చెబుతుండడంతో ఈరోజు వీకెండ్ కావడంతో కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున బైక్ రేసర్లు పెనుగొండ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి కొండ దారిలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 


ఇక్కడ బైక్ రేసింగ్ లకు పర్మిషన్ లేదని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని పోలీసులు రేసర్లు ను హెచ్చరించారు. దీంతో చేసేదిలేక బైక్ రేసర్లు అక్కడ నుంచి వేనుదిరిగారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా నగరంలో అర్ధరాత్రి సమయాల్లో కూడా గతంలో యువకులు బైక్ రేసింగ్ చేసేవారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో అనంతపురం నగరంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు ఏర్పాటు చేశారు. అలా నగరంలో బైక్ రేసర్లను అడ్డుకట్ట వేశారు.