Heart Attack Prevention Tips : కొవిడ్ తర్వాత గుండె సమస్యలు ఎక్కువ అవుతున్నాయనేందుకు చాలా రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. NCRB కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. కొవిడ్​కు ముందు ఉన్న గుండెపోటు మృతుల సంఖ్య కంటే.. కరోనా తర్వాత హార్ట్ ఎటాక్స్​తో మృతి చెందిన వారి సంఖ్యే అందుకు నిదర్శనం. వైరస్ ఎఫెక్ట్ గుండెపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడం వల్లే ఇలా జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యంగా లైఫ్​స్టైల్ లీడ్ చేసే వారిలో కూడా ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. 

సెలబ్రెటీలు సైతం.. 

రీసెంట్​గా రెగ్యులర్​గా జిమ్, యోగా చేసే కాంటాలగా గర్ల్ షిఫాలీ గుండెపోటుతోనే మరణించింది. ఆమెకు ముందు కూడా హెల్తీ లైఫ్​స్టైల్​ని లీడ్ చేసే కొందరు సెలబ్రెటీలు మృత్యుబారిన పడ్డారు. సిద్దార్త్ శుక్లా కూడా 2021లో హార్ట్​ ఎటాక్​తో చనిపోయారు. పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్​లో వ్యాయామం చేస్తూ.. గుండె దగ్గర ఇబ్బందిగా ఉందంటూ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సింగర్ కెకె కూడా కార్డియాక్ అరెస్ట్​తోనే చనిపోయారు. 

ఆరోగ్యంగా ఉంటూ.. జిమ్ చేస్తూ.. హెల్తీ ఫుడ్ తీసుకునే వారిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. అసలు ఎలాంటి హెల్తీ లైఫ్​స్టైల్​ని ఫాలో అవ్వనివారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో చిన్నవయసువారు కూడా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందుతున్నారు. కాబట్టి పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 

హార్ట్ ఎటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

డైట్​ : గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్​ హెల్తీ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. హెల్తీ ఫుడ్ డైట్​లో తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, విత్తనాలు, హెల్తీ ఫ్యాట్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ ఉప్పు, షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకూడదు. 

వ్యాయామం :  రోజులో కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేసేందుకు టైమ్ తీసుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు కార్డియో చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. 

బరువు : బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గితే దీర్ఘకాలిక సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. లేదంటే దరిచేరవు. కాబట్టి వీలైనంత వరకు మంచి ఫుడ్, నిద్ర, వ్యాయామ నియమాలు పాటిస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలి. 

స్మోకింగ్ : మీకు సిగరెట్, పొగాకు వంటివి తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకుంటే ఇది గుండె సమస్యలు రెట్టింపు చేస్తుంది. బీపీని, కొలెస్ట్రాల్​ని పెంచి గుండె సమస్యలకు ప్రధాన కారణమవుతుంది. 

ఒత్తిడి : ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. యోగా, డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. ఆల్కహాల్ : ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే లివర్​తో పాటు గుండె కూడా డ్యామేజ్ అవుతుంది. ఇది గుండె సమస్యలకు కారణమవుతుంది. 

నిద్ర : నిద్ర గుండె సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి రాత్రి నిద్ర కనీసం 8 గంటలు ఉండేలా చూసుకోండి. నిద్ర నాణ్యతను మెరుగుపరిచే టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. 

మధుమేహం : మధుమేహం ఉన్నవారికి కూడా గుండె సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. దానిని కంట్రోల్ చేసేందుకు తగిన మార్పులు చేసుకోవాలి. 

వీటితో పాటు హైడ్రేషన్ కూడా ముఖ్యమే. ఇవన్నీ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. ఏమి చేసినా గుండె సమస్యలు వస్తాయి అని ఊరుకుంటే పరిస్థితి ఇంకా దిగజారుతుంది కాబట్టి.. హెల్తీగా, ఫిట్​గా ఉండేందుకు మీ శరీరాన్ని ప్రిపేర్ చేస్తే మంచి ఫలితాలు చూడొచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.