పొద్దున 10 గంటలకే మొహం మాడిపోయే ఎండ వచ్చేస్తుంది. ఎండ వేడి నుంచి తట్టుకోవడం కోసం చల్లటి పదార్థాల వెంట పడతారు. సమ్మర్ సీజన్ లో దొరికే చలువ చేసే వాటిలో పుచ్చకాయ, కీరదోస ముందుంటుంది. ఇవి మిమ్మల్ని చల్లగా ఉండేలా ఉంచుతుంది. వేసవిలో తప్పనిసరిగా తినాల్సిన పదార్థం ఇది. చర్మాన్ని ఆరోగ్యంగా, రీఫ్రెష్ గా ఉంచుతుంది. 96 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురి కాకుండా కాపాడుతుంది. సలాడ్, శాండ్ విచ్, సైడ్ డిష్, గార్నిషింగ్ గా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వేసవిలో దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. శక్తిని ఇస్తుంది.


కీరదోస వల్ల ప్రయోజనాలు


☀ కీరదోసలో అధికంగా నీరు ఉంటుంది. ఇవి టాక్సిన్స్ ని తొలగించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. పోషణ అందిస్తాయి. నీరు ఉండటం వల్ల శరీరాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపిస్తుంది.


☀ కుకుర్బిటాసిన్ బి అనేది కీరదోస ఉంటుంది. క్యాన్సర్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ రకాల క్యాన్సర్ కణాలని నాశనం చేస్తుంది. దోసకాయ తొక్కలో డైటరీ ఫైబర్ ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పొత్తి కడుపు నుంచి విషపూరితమైన వ్యర్థాలను తొలగిస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.


☀ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు రక్తపోటుని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. అధిక పొటాషియం, నీరు ఉండటం వల్ల రక్తపోటుని అదుపులో ఉంచుతుంది.


☀ ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు అందాన్ని కూడా ఇస్తాయి. టోనర్ గా చర్మానికి మేలు చేస్తుంది. వాపు, నొప్పి, నల్లటి వలయాలను తగ్గిస్తుంది. చికాకు, మంటని తగ్గిస్తుంది. దోసకాయలో సిలికా ఉంటుంది. ఇది జుట్టు, గోళ్ళ సంరక్షణకు అద్భుతంగా పని చేస్తుంది.


☀ కీరదోస తినడం వల్ల పేగు కదలికలకు తోడ్పడుతుంది. డీహైడ్రేట్ మలబద్ధకానికి ప్రధాన కారణం. అందుకే కీరదోస తింటే ఆ సమస్య నుంచి బయటపడేస్తుంది.


☀ విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఎండ వేడి వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది. చికాకుని తగ్గిస్తుంది. ఇందులోని ఆస్ట్రింజెంట్ చర్మం మీద పేరుకుపోయిన మురికిని తగ్గించడంలో సహాయపడతాయి.


☀ కాలిన గాయాలు, మొటిమలు, దద్దుర్లకి చికిత్స చేస్తుంది. ఏదైనా ఆహార పదార్థాల వల్ల వచ్చే అలర్జీలను ఇది తగ్గిస్తుంది.


అతిగా వద్దు


కీరదోస తింటే ఆరోగ్యానికి మంచిదే. కానీ కొన్ని రకాల కీరదోస కాయలు చేదుగా ఉంటాయి. వాటిలో విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి తింటే సైనేడ్ గా మారే ప్రమాదం ఉంది. ఇదే కాదు పొటాషియం ఇందులో ఎక్కువ. శరీరంలోకి అధికంగా పొటాషియం చేరితే హైపర్ కలేమియా వంటి ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. పొట్ట ఉబ్బరం, తిమ్మిరి, గ్యాస్ సమస్యలు, మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మితంగా మాత్రమే తీసుకోవాలి. కీరదోస తొక్క తీయకుండా తింటేనే మంచిది.   


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: ఉద్యోగులకి బంపర్ ఆఫర్, నిద్రపోవడానికి 'హాలిడే' - ఎక్కడ, ఎందుకు ఇచ్చారో తెలుసా?