లికాలంలో సరైనా ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బ్యాక్టీరియా, జేమ్స్‌తో పోరాడే రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. పిల్లలైనా, పెద్దలైనా చలికాలంలో సరైన డైట్‌ను పాటించడం చాలా ముఖ్యం. చలికాలంలో జలుబు, దగ్గు వంటి రోగాలతో పోరాడటానికి పిల్లల పోషకాహారాల విషయంలో తల్లితండ్రులు మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలు తీసుకునే ఆహారంలో తగినన్ని పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి.


పిల్లల ఆరోగ్యం కోసం ఈ ఆహార పదార్థాలను వారి భోజనంలో చేర్చండి


ఆకు కూరలు: శీతాకాలంలో ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీటిలో అధిక మొత్తంలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. పాలకూర, మెంతికూర, ఉల్లి కాడలు, తాజా వెల్లులిని పిల్లల ఆహారంలో చేర్చడం వల్ల వారికీ ఎక్కువ మొత్తంలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్లు, మినరాల్స్‌ను అందించవచ్చు. పరాటాలు, సూప్స్ ద్వారా పిల్లలకు ఆహారాన్ని వేడి వేడిగా అందిస్తే ఇష్టంగా తింటారు. ఆకు కూరలతోపాటు పప్పు కూడా తినిపించండి. దానివల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. 


పండ్లు: శీతాకాలం రావడంతో పిల్లలు పండ్లను ఎక్కువగా తినరు. దీనివల్ల పిల్లల్లో విటమిన్ల లోపం తలెత్తే అవకాశం ఉంది. చలికాలంలో దొరికే పండ్లు ఎక్కువ పోషకాలను కలిగి వుంటాయి. నారింజ, దానిమ్మ, ఉసిరి.. విటమిన్ -C, ఫైబర్‌ను కలిగి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని బూస్ట్ చేయడంతో పాటు శరీరంలో యాంటీఆక్సిడెంట్ల సంఖ్యను పెంచుతాయి. పిల్లలు చలికాలంలో పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం కాబట్టి.. కలర్ ఫుల్  బౌల్‌లో వివిధ రకాల పండ్లను, కట్ చేసి పిల్లలకు స్నాక్స్ గా ఇచ్చేయండి.


డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్, విటమిన్, మినరల్, ఫైబర్ వంటి పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి పిల్లలకు శక్తిని అందిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మీ పిల్లలు ఖర్జురాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు తినేలా జాగ్రత్త వహించండి. అలాగే, పాలు కూడా ఇవ్వండి. ఎందుకంటే పాలు చలికాలంలో పిల్లలను వెచ్చగా వుంచడంలో సహాయపడతాయి. పాలల్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ను కలిపి మీ పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో రోగనిరోధక శక్తిని పెంచవచ్చు.  


స్వీట్ పొటాటోస్: చలి కాలంలో ఎక్కువగా తీపి లేదా శరీరాన్ని వెచ్చబరిచే ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటాం. స్వీట్ పొటాటోస్ విటమిన్ A, పొటాషియం, బీటా కారోటీన్, కార్బోహైడ్రేట్లను అధికంగా కలిగి ఉంటాయి. వీటిని ఉడికించి.. తొక్క తీసి చాట్ మసాలాతో అందించిన లేదా ఫ్రై చేసి పిల్లలకు అందించినా మంచిదే. దీనివల్ల పిల్లల్లో మెటబాలిజంతో పాటు రోగ నిరోధాకత పెరుగుతుంది.


తేనె: తేనె చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సహజంగానే తీపిని కలిగి ఉండటం వల్ల చక్కెరకు బదులుగా తేనేను వాడుతుంటారు. తేనె ఫైటోకెమికల్స్ ను ఫ్లేవనాయిడ్లును ఎక్కువగా కలిగి ఉంటుంది. తేనెతో దగ్గు, గొంతునొప్పిని తగ్గించవచ్చు. చాక్లెట్ సిరప్‌లకు బదులు పిల్లలకు తేనేతో చేసిన కేకు లేదా మఫిన్లను అందిస్తే ఇష్టంగా తింటారు. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 


Also read: చక్కెరతో జర భద్రం - ఈ భయానక వ్యాధి ప్రాణాలు తీయొచ్చు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త!