Healthy Meal Plans for Kids in Telugu : ఎదిగే పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలని పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే పిల్లల ఎదుగుదల అంతా వారికి అందించే ఫుడ్​పైనే ఆధారపడి ఉంటుంది. సరైన పోషకాలు సరైన మోతాదులో అందించడం వల్ల పిల్లల ఎదుగుదల హర్షనీయంగా ఉంటుంది. పోషకాలు లేని ఆహారం ఇస్తే పిల్లలు వీక్​గా అయిపోతారు. అందుకే వారికి పెట్టే ఫుడ్స్​పై తల్లిదండ్రులు కచ్చితంగా అవగాహనతో ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే ఈ పోషకాలను వారి డైట్​లో ఎలా చేర్చాలో.. ఎలాంటి ఫుడ్స్ ఇస్తే పిల్లల్లో ఎదుగుదల బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


కిడ్స్ ఫుడ్ విషయమొస్తే.. కచ్చితంగా జంక్​ ఫుడ్​ గురించి మాట్లాడుకోవాలి. పిల్లలు జింక్ ఫుడ్, చాక్లెట్స్, స్వీట్స్​కి ఎక్కువ ఇష్టపడతారు. హెల్తీ ఫుడ్​ని కాస్త దూరం పెడతారు. అలాంటి సమయంలో వారికి జంక్​ ఫుడ్​ని దూరం పెట్టిస్తూ.. హెల్తీ ఫుడ్​ని తినేలా చేయాల్సి ఉంటుంది. స్వీట్ నట్స్, ప్రాసెస్ చేసిన పుడ్, క్యాండీలు, ప్యాక్డ్ ఫుడ్​ను పిల్లలకు దూరం చేయాలి. సోడాలు, జ్యూస్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్స్​ను కూడా పిల్లలకు ఇవ్వకూడదు. వారు తినే ఫుడ్​ అదే.. అలాంటప్పుడు వారి ఏ ఫుడ్ అందించాలి? ఎలా తినిపించాలనే దానిపై పేరెంట్స్​కి కచ్చితంగా అవగాహన ఉండాలి. 


రోజుకు ఎన్ని కేలరీలు ఇవ్వాలంటే.. 


ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజుకు దాదాపు రెండు వేల కేలరీలు అవసరమయితే.. 3 నుంచి 8 ఏళ్ల పిల్లలకు వెయ్యి నుంచి పద్నాలుగు వందల కేలరీలు అవసరం. 9 నుంచి 13 సంవత్సరాల ఉన్నపిల్లలకు.. వారి పెరుగుదలను బట్టి పద్నాలుగు వందల నుంచి 2,200 కేలరీలు ఫుడ్ అందివ్వాలి. అయితే వీరికి అందించే ఫుడ్​లో ప్రోటీన్, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, మిల్క్ పొడెక్ట్స్ ఉండేలా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. పిల్లలకు పాలతో అలెర్జీ ఉంటే వాటిని పెట్టకపోయినా.. వాటికి ప్రత్యామ్నాయ ఫుడ్​ని అందించవచ్చు. ఎందుకంటే డెయిరీ ప్రొడెక్ట్స్ ద్వారా పిల్లలకు విటమిన్ డి, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం అందుతాయి. ఇవి వారి ఎదుగుదలకు మంచివి. 


శాఖాహారి అయితే..


మాంసాహారం అందించలేనివారు కూడా వాటికి ప్రత్యామ్నాయం చూడాలి. ఎందుకంటే వాటిలోనూ కొన్ని పోషకాలు ఉంటాయి. ఒకవేళ మీరు శాకాహారి అయితే.. ఆ పోషకాలను పిల్లలకు ఏ విధంగా అందించాలో వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా మాంసాహారంతో లభించే విటమిన్ బి-12 సప్లిమెంట్స్ ఇవ్వాలి. అయితే ఆరేళ్ల పిల్లల నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలో.. నిపుణులు ఎలాంటి ఆహారం పిల్లలకు సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆరేళ్ల పిల్లలకు..


తృణధాన్యాలు, శుద్ధి చేసిన ధాన్యాలు వారి డైట్​లో ఉండేలా చూసుకోవాలి. జ్యూస్​ల కంటే.. ఫ్రూట్స్​ నేరుగా తినేలా శ్రద్ధ తీసుకోవాలి. చాక్లెట్స్ వంటి వాటిని తక్కువ మోతాదులో ఇవ్వాలనుకుంటే డార్క్ చాక్లెట్​తో రిప్లేస్ చేయవచ్చు. లేదంటే ఇంట్లోనే చేసే స్వీట్స్​ను వారికి అందించవచ్చు. బ్రేక్​ఫాస్ట్​గా సౌత్ ఇండియన్ బ్రేక్​ఫాస్ట్ ఇడ్లీ, దోశ, ఉతప్పం, అటుకులతో చేసే రెసిపీలు అందించవచ్చు. పాలు ఇవ్వవచ్చు. స్నాక్స్​గా అరటిపండు లేదా నట్స్, వోట్స్ ఇవ్వవచ్చు. ప్రోటీన్​ కోసం చికెన్ పెట్టవచ్చు. చేపలను కూడా వారి డైట్​లో చేర్చాలి. కర్రీలను వారికి ఆలివ్​ నూనెతో చేసి పెడితే మంచిది. రైస్​తో పాటు కూరగాయలు, ఎగ్ వైట్స్ అందిస్తే మంచిది. రాత్రి భోజనం త్వరగా కంప్లీట్ చేసేలా చూడండి.


టీనేజ్ పిల్లలకు 


సౌత్ ఇండియన్ బ్రేక్​ఫాస్ట్​లతో పాటు పాలు ఇవ్వొచ్చు. వోట్​మీల్ లేదా ఓట్స్ ట్రై చేయవచ్చు. ప్రోటీన్ కోసం బాదం, ఆరోగ్య ప్రయోజనాల కోసం యాపిల్స్ అందించవచ్చు. స్నాక్స్​గా ఫ్రూట్స్ లేదా నట్స్ ఇవ్వొచ్చు. లంచ్​లో చపాతీ, తక్కువ మోతాదులో రైస్.. ఎక్కువ మోతాదులో వెజిటెబుల్స్, చికెన్ ఉండేలా చూడొచ్చు. మసాలాలు ఎక్కువ ఇవ్వకపోవడమే మంచిది. కీరదోస, తోటకూర వంటివి వారి స్కిన్, హెయిర్​ హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అవకాడో, అరటి పండ్లను స్నాక్స్​గా ఇవ్వొచ్చు. యోగర్ట్​ కూడా వారికి మంచి కాల్షియం ఇస్తుంది. హెల్తీగా తినడం అంటే.. అవసరమైన పోషకాలు వారి డైట్​లో ఉండేలా చూసుకోవడమే అంటున్నారు డైటీషియన్లు. మరి మీరు కూడా ఈ తరహా ఫుడ్స్​ని పిల్లలకు తినిపించేయండి. 


Also Read : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్