Food Suggestions for Kids : ఎగ్జామ్స్ సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని, మెంటల్ హెల్త్​ని ఇబ్బంది కలిగించని ఫుడ్స్ పెట్టాలని తల్లిదండ్రు చూస్తారు. ఈ సమయంలో పిల్లలకు సమతుల్య ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. సరైన పోషకాహారం అందిస్తే.. వారి అభిజ్ఞా ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అందుకే వారికి తగినంత విశ్రాంతి, పోషకాలు కలిగిన ఫుడ్​ అందించాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి.. మానసికంగా చురుగ్గా ఉంటారు. 


చేపలు, సీడ్స్, ఆకుకూరలు, ఓట్స్, మినుములు, చిక్కుళ్లు, బ్రౌన్ రైస్, సిట్రస్ పండ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్​లు, విటమిన్​లు, మినరల్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్​లు వారి డైట్​లో ఉండేలా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే తల్లిదండ్రులు ఎగ్జామ్స్ సమయంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలో.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


నట్స్, సీడ్స్


వాల్​నట్స్, అవిసెగింజలు, బాదం, పొద్దితిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి జింక్​ను కూడా అందిస్తాయి. ఇవి పిల్లలు మానసికంగా చురుగ్గా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా అభిజ్ఞా పనితీరుకు దోహదం చేస్తాయి. 


ఆకు కూరలు


బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, చురుగ్గా ఉండడంలో సహాయం చేస్తాయి. 


ఓట్స్ 


ఓట్స్​లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి పిల్లలు రోజంతా చురుకుగా ఉంటారు. అందుకే వీటిని బ్రేక్​ఫాస్ట్​గా ఇస్తే మంచిది. అంతేకాకుండా ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. 


మిల్లెట్స్ 


ఫింగర్ మిల్లెట్, బజ్రా వంటి మిల్లెట్స్ కార్బోహైడ్రేట్​లతో నిండి ఉంటాయి. ఈ తృణధాన్యాలు అధిక ఫైబర్​తో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని వివిధ వంటకాల్లో చేర్చవచ్చు. ఇవి చదువుపై పిల్లలు దృష్టి పెట్టేలా ఏకాగ్రతను ప్రోత్సాహిస్తాయి. 


చిక్కుళ్లు


చిక్​పీస్, నల్లని శనగలు, మొలకలు శరీరానికి శక్తిని అందించడంతో పాటు.. రోజంతా యాక్టివ్​గా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా పిల్లలు ఫోకస్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. వారి జ్ఞాపకశక్తిని పెంచడం కోసం.. పిల్లల ఆహారంలో వీటిని చేర్చాలి. 


బ్రౌన్ రైస్, గోధుమలు వంటి ఫైబర్ కలిగిన ఫుడ్స్ మంచివి. సిట్రస్ కలిగిన పండ్లు.. అంటే నారింజ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతే కాకుండా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆహారాలను పిల్లలకు అందించి.. పరీక్షల నుంచి దృష్టి మరల్చకుండా చేయవచ్చు. ఈ పోషకమైన ఆహారాలను పిల్లలు తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకునేలా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. 


Also Read : నీతా అంబానీ ఫిట్​నెస్ సీక్రెట్స్ ఇవే.. రోజూ ఉదయాన్నే అది కచ్చితంగా తాగుతారట





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.