Nita Ambani Fitness Secrets : జిమ్​కెళ్లే వయసా మాది.. డైట్​ ఫాలో అయితే ఏమి వస్తాది అనే ఆలోచనల్లో ఉండే మహిళలు ఎందరికో నీతా అంబానీ (Nita Ambani) ఆదర్శమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆరు పదుల వయసులో కూడా ఈమె తన ఫిట్​నెస్​ విషయంలో ఎలాంటి రాజీ పడడంలేదు. హెల్తీ లైఫ్​ని మెయింటైన్​ చేయడంతో పాటు.. ప్రోపర్ డైట్ తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అందుకే తన కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ (Anant Ambani Prewedding) వేడుకల్లో కూడా డ్యాన్స్ పర్​ఫార్మెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 


చాలామంది అమ్మాయిలు కూడా జిమ్​కి వెళ్లేందుకు, ఫిట్​నెస్​ గురించి శ్రద్ధ తీసుకోవడంపై అస్సలు ఆసక్తి చూపరు. కానీ ఫిట్​నెస్​కు సరైన ప్రాధాన్యతనిస్తే.. 60 ఏళ్లు వచ్చినా.. అందంగా కనిపిస్తారు అనే దానికి నీతా నిలువెత్తు నిదర్శనం. బరువు తగ్గడంలో, ఫిట్​గా ఉండడంలో, డైట్​ విషయంలో నీతా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. 


బరువు తగ్గాలన్నా.. హెల్తీగా ఉండాలన్నా.. శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా అవసరం. అప్పుడే ఎఫెక్టివ్​గా బరువు తగ్గుతారు. అందుకే నీతా రోజూ నిమ్మరసం, పుదీనా కలిపిన డిటాక్స్ డ్రింక్​ను తీసుకుంటారు. ఇది ఆమె స్కిన్​ను కూడా రక్షిస్తుంది. అంతేకాకుండా భోజనాలకు మధ్యలో స్నాక్స్​గా పండ్లు తీసుకుంటూ ఉంటారు. అలా అనీ పూర్తిగా ఫుడ్​ విషయంలో కాంప్రిమైజ్​ అవ్వడానికి నీతా ఇష్టపడరు. ఇడ్లీ సాంబార్ వంటి సౌత్ ఇండియా ఫుడ్​ను ఆస్వాదిస్తారు. బిజీ షెడ్యూల్​లో ఉన్నప్పటికీ.. వ్యాయామం చేయడంలో ఎప్పుడూ వెనుకాడరు. బరువు తగ్గడంలో, ఫిటెనెస్​ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 


తాజా కూరగాయలు, పండ్లు


నీతా అంబానీ తన బరువు తగ్గించే ప్రాసెస్ ప్రారంభించినప్పుడు ఆమె తన జీవన శైలిలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. భోజనంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చడమే కీలకమైన మార్పు అని చెప్పవచ్చు. 


హెల్తీ బ్రేక్​ఫాస్ట్​


రోజును హెల్తీ బ్రేక్​ఫాస్ట్​తో ప్రారంభిస్తుంది నీతా. ఆరోగ్యకరమైన దినచర్యను ఫాలో అవుతారు. తాజా పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్​తో నిండిన పోషకాహారం తీసుకుంటారు. కేలరీలు తక్కువ ఉండే హెల్తీ బ్రేక్​ఫాస్ట్​ను తీసుకుంటారు. ఇది కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా.. స్కిన్​ కేర్​ను రక్షించడంలోనూ.. హెల్ప్ చేస్తుంది. 


వెజ్​ ఫుడ్


షెడ్యూల్ తప్పకుండా.. ఇంటి భోజనాన్ని.. సమయానికి తగ్గట్లు తీసుకుంటుంది నీతా. ఆహారంలో ఎక్కువ సూప్​లు, ఆకు కూరలతో చేసిన డిష్​లు తీసుకుంటారు. దాల్, రోటీ, పప్పులతో కూడిన సాధారణ లంచ్​ను తీసుకుంటారు. 


బీట్​రూట్​ జ్యూస్


డిటాక్స్ గుణాలు కలిగిన బీట్​రూట్​ జ్యూస్​ను నీతా ప్రతి రోజూ తాగుతారు. రోజుకు రెండు గ్లాసుల బీట్​రూట్​ జ్యూస్​ను తీసుకుంటారు. అయితే మీరు ఇది ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు వైద్యుని సలహా కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరిచే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి దీని మోతాదులో జాగ్రత్తలు తీసుకోవాలి. 


యోగా


నీతా భరతనాట్యంలో శిక్షణ పొందిన నృత్యకారిణి. ఖాళీ సమయాల్లో ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చేస్తారు. అంతేకాకుండా శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి ఇతర శారీరక కార్యకలాపాలు చేస్తారు. 


ఆల్కహాల్


ఆల్కహాల్, జంక్​ఫుడ్​కి నీతా పూర్తిగా దూరంగా ఉంటారు. పార్టీలకు వెళ్లినా.. హెల్తీ ఫుడ్​ను తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ నీతా అంబానీ బరువు తగ్గారు. ఇప్పటికీ ఇదే రోటీన్​ను ఫాలో అవుతూ.. తన ఫిట్​నెస్​, అందాన్ని కాపాడుకుంటున్నారు. 


Also Read : బెల్లీఫ్యాట్​ని కరిగించే కశ్మీరీ టీ.. ఈ రెసిపీలో ఉపయోగించే పదార్థాలు ఏవంటే






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.