అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహార పదార్థాల్లో పసుపుది తొలి స్థానం. వంటకాలకి నోరూరించే రంగు, రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా గుణాలు పసుపులో పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించి డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. భారతీయ గృహాల్లో తప్పనిసరిగా పసుపు ఉంటుంది. వచ్చేది ఇన్ఫెక్షన్ల కాలం కాబట్టి వాటి నుంచి రక్షణ పొందేందుకు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఇవఈ రోగాలని నయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
పసుపుని సూపర్ ఫుడ్ గా మార్చే ప్రధాన మూలకం కర్కుమిన్. రోగాలని నయం చెయ్యడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది ఉపయోగపడుతుంది. అంటు వ్యాధులు, చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, కాలిన గాయాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షణాలు, అలర్జీలు, కాలేయ వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. మధుమేహులకి ఇది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కర్కుమిన్ ప్రభావవంతంగా పని చేస్తుంది. కర్కుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి.
కాలేయ వ్యాధులని తగ్గిస్తుంది
మధుమేహంతో బాధపడే వారికి ఫ్యాటీ లివర్ వ్యాధి, ఇతర రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది. కాలేయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పసుపులోని క్యాన్సర్ నిరోధక గుణాలు కాలేయానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
కంటి శుక్లం తగ్గిస్తుంది
మధుమేహంతో బాధపడే వాళ్ళు కాలక్రమేణా న్యూరోపతి బారిన పడతారు. ఈ పరిస్థితి వల్ల నరాలు ప్రభావితమవుతాయి. కర్కుమిన్ మధుమేహ సంబంధిత కంటిశుక్లాలను అణిచివేస్తుండి. హైపరాల్జీసియాను మెరుగుపరుస్తుందని నిపుణులు వెల్లడించారు.
వాస్కులర్ పరిస్థితులను మెరుగుపరుస్తుంది
మధుమేహం రక్తనాళాలపై దాడి చేస్తుంది. కాలక్రమేణా వాటిని అధ్వానంగా మారుస్తుంది. డయాబెటిస్ తో సంబంధం ఉన్న వాస్కులర్ పరిస్థితులను మెరుగుపరచడంలో కర్కుమిన్ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.
పురుషుల్లో లైంగిక సామర్థ్యం మెరుగు
డయాబెటిక్ పరిస్థితి వల్ల కండరాలు, ఎముకల బలహీనత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇందులో ఉండే కర్కుమిన్ పురుషుల్లో లైంగిక సామర్థ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుందని నిరూపించబడింది.
బరువు తగ్గేందుకు
బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు పసుపు నీళ్ళు తరచుగా తీసుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు పొందుతారు. పసుపు నూలలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నీటితో కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మానికి మేలు
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ చేసే డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. క్రమం తప్పకుండా రోజూ పసుపు నీళ్ళు తాగడం వల్ల మీరిసే చర్మం మీ సొంతం అవుతుంది. అంతే కాదు పసుపు, శెనగపిండి కలిపి ఫేస్ ప్యాక్ గా కూడా వేసుకోవచ్చు. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రోగనిరోధక శక్తి పెంచుకోవాలా? విటమిన్ సి నిండిన ఈ ఆహారాలు తినాల్సిందే