Benefits of Being Organized : మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని ప్రదేశాలకు లేదా.. కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుకన్న ఓ మెయిన్ రీజన్ ఏంటంటే.. ఆర్గనైజింగ్‌గా ఇల్లు ఉండడమే. కొందరు ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకుంటారు. దానివల్ల శారీరకమైన, మానసికమైన ప్రయోజనాలు కూడా వారు పొందుతారు. దానిని మీరు అభువించాలంటే.. గజిబిజిగా ఉండే మీ రూమ్‌ని మంచిగా క్లీన్ చేసుకోండి. మీకే అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో.
ఇంటిని క్లీన్‌గా ఆరోగ్యంగా పెట్టుకునేందుకు కాస్త శ్రద్ధ చూపిస్తే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు హాయిగా మీ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇది మీకు మంచి వ్యాయామంగా కూడా పని చేస్తుంది. మీరు సంతోషంగా, రిలాక్స్‌గా ఉండడంలో రూమ్ క్లీనింగ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. నెగిటివిటీ లేకుండా పాజిటివ్‌గా ఉండేందుకు ఇది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి తగ్గుతుంది..
గజిబిజిగా ఉండే గదులు మీపై మరింత ఒత్తిడిని పెంచుతాయి. ఒత్తిడి వల్ల శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఇది మిమ్మల్ని తెలియకుండానే అయోమయానికి గురిచేస్తుంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో అనే ఒత్తిడిని బాగా పెంచుతుంది. కాబట్టి వాటిని క్రమద్ధీకరించడం కోసం మీరు మీ సమయాన్ని కేటాయించండి. ఏది ఎక్కడ ఉండాలనుకుంటారో.. అక్కడే వాటిని ప్లేస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో మీ పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. తీసిన వస్తువు తీసిన ప్లేస్‌లో పెట్టే అలవాటు చేసుకోండి. ఇది చూసేందుకు చాదస్తంగా ఉన్నా కూడా ఇది మీలో స్ట్రెస్‌ని తగ్గిస్తుంది.
నిద్రపోయేందుకు..
మీ రూమ్ చిందవందరగా ఉంటే మీకు నిద్ర సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాబట్టి వీలైనంత క్లీన్‌గా మీ రూమ్, బెడ్ ఉండేలా చూసుకోండి. మీ గదిలో వస్తువులు కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తాయని మీరు గుర్తించుకోవాలి. చిందరవందరమైన గది మిమ్మల్ని నిద్రపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులకు గురిచేస్తుంది. రూమ్ సర్దుకోవాలి అనే ఆలోచన కూడా మీకు నిద్ర రాకుండా చేస్తుంది. కాబట్టి మీ రూమ్‌ని నీట్‌గా సర్దుకోవడంలో అస్సలు వెనకాడకండి.
ఫుడ్ విషయంలో..
మీరు ఆర్గనైజింగ్ అంటే ఓన్లీ రూమ్ మాత్రమే అనుకోకండి. ఫుడ్ విషయంలో కూడా మీరు దీనిని ఫాలో అవ్వొచ్చు. ఏ సమయానికి ఏది తినాలి.. ఏ రోజు ఏది వండుకోవాలి అనేది మీరు ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ఏమి తింటున్నారు? ఏమి ప్రిపేర్ చేసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేదానిపై అవగాహన పెరుగుతుంది. హెల్తీ ఫుడ్ తినడంలో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ఎక్కువ తినకుండా.. హెల్తీగా మీ డైట్లో ఏమి చేర్చుకోవచ్చు అనే విషయాలపై మీకు క్లారిటీ వస్తుంది. కిచెన్ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మీకు వంట చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. కొందరు కిచెన్ శుభ్రం చేయలేక బయట ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
క్రియేటివిటీ పెరుగుతుంది..
మీరు క్లీన్, ఆర్గనైజ్డ్ వర్క్ స్పేస్‌లో ఉన్నప్పుడు మీ పనిపై మీరు మరింత దృష్టి పెట్టవచ్చు. ఇది మీ ఏకాగ్రతకు ఇబ్బంది కలుగకుండా చేస్తుంది. దీనివల్ల మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఉత్పాదకత కూడా పెరుగుతుంది. అదే మీరు చిందవందరమైన పని ప్రాంతంలో ఉంటే మీకు చిరాకు పెరుగుతుంది. అది కాస్త వర్క్‌పై ప్రభావం చూపిస్తుంది.
రిలేషన్స్‌పై ప్రభావం..
చూసేందుకు సిల్లీగా ఉంటుంది కానీ.. పరిశుభ్రత అనేది మీ రిలేషన్స్‌పై ప్రభావం చూపిస్తుందనేది వాస్తవం. ఇది శారీరక, జీవనశైలి రెండింటిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పని చేసే ప్రాంతంలోనే కాదు.. ఇంట్లో కూడా ఆర్గనైంజింగ్గా లేకుంటే అది మీ రిలేషన్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
కాబట్టి కుదిరనప్పుడల్లా మీరు రూమ్‌ని క్లీన్ చేసుకుని ఆర్గనైజింగ్ పెట్టుకోండి. రూమ్ శుభ్రంగా పెట్టుకోవడం అంటే ఎవరికోసమో కాదు.. మన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది మీ రోజూవారీ జీవితాన్ని కాస్త సులభతరం చేస్తుంది.
Also Read : పిల్లల మెదడును యాక్టివ్ ఉంచేందుకు ఇలాంటి క్రియేటివ్ పనులు చేయించండి