Happy Valentine's Day 2025 : ప్రేమికుల దినోత్సవం రానే వచ్చేసింది. ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మూడు మ్యాజికల్ వర్డ్స్ చెప్పి.. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా చెప్పేయండి. కానీ మీ ప్రేమను అంతా ఈ మూడు పదాల్లో చెప్పగలరా? నిజం చెప్పాలంటే ప్రేమను వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవు. మీరు ఎంత ట్రై చేసినా.. మీ లోపలున్న ఫీలింగ్స్‌ని సగం మాత్రమే చెప్పగలగుతారేమో.
మాకున్న ధైర్యానికి ఇవి చెప్పడమే ఎక్కువ కనీసం ఇది అయినా చెప్పగలిగితే సంతోషం అనుకుంటున్నారా? అయితే అస్సలు భయపడకండి. మరీ సింపుల్‌గా కాకపోయినా.. కాస్త ఎఫెక్టివ్‌గా మీరు ప్రేమించిన వ్యక్తికి నేరుగా కాకపోయినా.. కాస్త ధైర్యం తెచ్చుకుని వాట్సాప్, ఇన్స్టావంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వారికి వాలెంటైన్స్ డే విషెష్ చెప్పేయండి. మరీ ఆర్టిఫియల్‌గా కాకుండా.. మీ మెసేజ్‌లో కాస్త ఎమోషన్ని నింపేసి.. ఇలా వాలెంటైన్స్‌డే విషెష్ చెప్పేయండి.
వాలెంటైన్స్ డే విషెష్..
- నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నన్ను Selfish అనుకున్నా పర్లేదు కానీ.. నా Futureలో నువ్వు ఉండాలని.. నాతో ఇప్పుడు ఉన్నట్టే జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. Happy Valentine's Day My Love.
- నీతో కలిసి ఉండే ప్రతి సెకను నాకో డ్రీమ్‌లాగా ఉంటుంది. నా జీవితానికి లవ్ లైఫ్‌ని పరిచయం చేసిన నీకు.. I Love You మాత్రమే చెప్పగలను.
- నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉందా అంటే.. అది నిన్ను ప్రేమించడమే. Happy Valentine's Day Baby.
- Happy Valentine's Day My Love. You Are My Favourite. గుర్తుపెట్టుకో నేను నిన్ను లవ్ చేసినట్లు ఇంకెవరు లవ్ చేయలేరు. I Love You.
- ప్రేమ మీద నమ్మకంలేని నాకు.. నీ ప్రేమలో మునిగి తేలేలా చేశావు. ఇప్పుడు నన్ను చూసుకుంటే నాకే కొత్తగా ఉంటుంది. అసలైన ప్రేమను రుచిచూపించినందుకు చాలా థ్యాంక్స్ బేబి. ఐ లవ్ యూ.
- నా లైఫ్‌ని నీ ప్రేమతో కలర్ఫుల్గా మార్చేశావు. నీతో కలిసి నా మిగిలిన జీవితాన్ని కలర్ఫుల్గా, బ్రైట్‌గా గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వాలెంటైన్స్ డే.
- ప్రేమంటే తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా అని నేర్పించావు. నాకోసం జీవితంలో ఎన్నో Sacrifice చేశావు. నాకు ఇది కావాలంటూ ఏది అడగకుండా నిస్వార్థంగా ప్రేమించావు. నీ ప్రేమ నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని.. దానికి వెయ్యిరెట్లు ప్రేమను నేను నీకు ఇవ్వాలని విష్ చేస్తూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే.
ప్రేమించిన వ్యక్తికి వాలెంటైన్స్ డే విషెష్ చెప్పడమంటే కేవలం ఐలవ్యూ చెప్పడం కాదు. వారు మీ జీవితంలో ఎందుకు ఉండాలనుకుంటున్నారో వివరించి చెప్పడం. వారి గురించి మీ ఫీలింగ్స్‌ని కరెక్ట్‌గా కన్వే చేయడం. త్రివిక్రమ్ ఓ సినిమాలో రాసినట్టు చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే హక్కు లేదు. నిజమే ప్రేమను వ్యక్తం చేసే ధైర్యం లేనప్పుడు ప్రేమించి మాత్రం ఏమి చేస్తారు. కాబట్టి సైలెంట్‌గా ఉండిపోకుండా.. ప్రేమను వ్యక్తం చేయగలిగే ధైర్యం తెచ్చుకుని ఈ వాలెంటైన్స్ డేకి మీ లవ్ లైఫ్‌కి గ్రాండ్ వెల్కమ్ చెప్పండి.
Also Read : వాలెంటైన్స్ వీక్ 2025 స్పెషల్.. రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు స్పెషల్స్ ఇవే