'Kobali' Team Success Meet: ప్రముఖ నటుడు రవిప్రకాశ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన తాజా వెబ్ సిరీస్ 'కోబలి' (Kobali). రేవంత్ లేవాక దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 4న 'హాట్ స్టార్' (Hot Star) వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రాకీసింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగిఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాళీ భాషల్లో అలరిస్తోంది. ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. అన్ని రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు నార్త్ నుంచి కూడా ఈ సిరీస్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ తెలిపారు. 'నింబస్ ఫిలిమ్స్', 'యు1  ప్రొడక్షన్స్' 'టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్' సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా సిరీస్ నిర్మించారు. సిరీస్ సూపర్ సక్సెస్‌పై మేకర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

'కాఫీ షాప్‌లో కథ విన్నా'

ఓ కాఫీ షాపులో 'కోబలి' కథ విన్నట్లు నటుడు రవిప్రకాశ్ తెలిపారు. 'నేను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లైంది. కొత్తగా ఏదో ఒకటి చేయాలనే నమ్మకంతో 'కోబలి' మొదలుపెట్టాను. కథ బాగున్నా ఇంత సక్సెస్ ఊహించలేదు. ఎందుకంటే అంతా కొత్తవాళ్లే. ఈ కంటెంట్‌లో అమ్ముడు పోయే ముఖం ఒక్కటి కూడా ఇందులో లేదు. అయినప్పటికీ దీనిపై నమ్మకం పెట్టింది హాట్ స్టార్. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లింది మీడియా. ఆదరించి పెద్ద విజయాన్ని అందించింది ప్రేక్షకులు. హానెస్ట్‌గా పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుందని నిరూపించింది మా 'కోబలి'. దర్శకుడు రేవంత్ నమ్మకం కూడా నిజమైంది. నిర్మాతలు జ్యోతి, రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఈ కథని ఎంతో నమ్మారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. 

Also Read: 'రానా నాయుడు 2'పై రానా కీలక అప్ డేట్ - ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్స్‌పై కీలక వ్యాఖ్యలు

కథ బాగుంటే ఆదరించడానికి ఎప్పుడూ ప్రేక్షకులు ముందుంటారనేది మరోసారి 'కోబలి' సక్సెస్‌తో నిరూపితమైందని మరో నటుడు రాకీసింగ్ అన్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. తనకు ఇలాంటి హిట్ సిరీస్‌లో భాగమయ్యే అవకాశం ఇచ్చిన జ్యోతి, రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అటు.. స్టార్లు ఉంటేనే కంటెంట్‌ని ప్రేక్షకులు ఆదరిస్తారనేది పాత మాట అని.. ఇప్పుడు కాలం మారిందని కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేదని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారని సీనియర్ నటుడు వెంకట్ అన్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు, ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు.

'కోబలి 2' అంతకు మించి..

'కోబలి' సిరీస్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని.. ఇదే జోష్‌లో పార్ట్ 2 తీస్తామని నిర్మాతలు జ్యోతి, రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు తెలిపారు. సిరీస్ 2 పార్ట్ 1ను మించి ఉంటుందని చెప్పారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు కథ పార్ట్ 2లో ఉంటుందని పేర్కొన్నారు. ఇంతటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు.

Also Read: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?