Valentine's Week 2025 Dates and Celebrations : వాలెంటైన్స్ డే అనేది పాశ్చాత్య కల్చర్ అయినా.. ఇండియాలో కూడా దానిని సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. అయితే ఈ వాలెంటైన్డేని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. అయితే దీనికి ముందు వారంరోజుల నుంచే దీని హడావుడి ఉంటుంది. దీనినే వాలెంటైన్స్ వీక్ అంటారు. మరి ఈ వాలెంటైన్ వీక్‌లో స్పెషల్స్ ఏమేమి ఉంటాయి? ప్రేమను ఎన్ని రూపాల్లో వ్యక్తం చేయవచ్చు వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
వాలెంటైన్స్ వీక్‌ని ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వరకు జరుపుకుంటారు. తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్తం చేయడానికి ఈ వీక్ హెల్ప్ చేస్తుంది. ఈ వాలెంటైన్ వీక్‌లో ప్రతి రోజుకు ఓ సెలబ్రేషన్ ఉంటుంది. వాలెంటైన్స్ వీక్ 2025లో భాగంగా ఫిబ్రవరి 7, శుక్రవారంతో రోజ్ డేతో ప్రారంభమవుతుంది. మిగిలిన రోజుల స్పెషల్స్ ఏంటో చూసేద్దాం.
ఫిబ్రవరి 7 (Rose Day 2025)
ఫిబ్రవరి 7వ తేదీని రోజ్డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. గులాబీలను ప్రేమకు ప్రతీకగా చెప్తూ.. వాలెంటైన్స్ వీక్‌ని దీనితో ప్రారంభిస్తారు. తమ ప్రేయసికి గులాబీలను ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. మరికొందరు జంటలు తమ ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటారు.
ఫిబ్రవరి 8 (Propose Day 2025)
వాలెంటైన్ వీక్‌లో రెండో రోజు అంటే ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. లవ్‌ని యాక్సెప్ట్ చేయడానికి, రిలేషన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్లాలనుకునేవారు ఈ ప్రపోజ్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి ఈరోజు మీరు పెళ్లి ప్రపోజ్ కూడా చేయొచ్చు. లేదా లవర్స్ ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ప్రపోజ్ డే చేసుకుంటారు.
ఫిబ్రవరి 9 (Chocolate Day 2025)
వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 9వ తేదీని చాక్లెట్ డేతో జరుపుకుంటారు. చాక్లెట్‌లోని స్వీట్నెస్ తమ రిలేషన్లో ఉండాలని గుర్తుగా చాక్లెట్‌ని ఇస్తూ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇది కేవలం లవర్సే కాదు.. ఇష్టమైన వారితో రిలేషన్ బాగుండాలనే గుర్తుగా చాక్లెట్స్ ఇచ్చి.. రిలేషన్స్‌ని పెంచుకోవచ్చు.
ఫిబ్రవరి 10 (Teddy Day 2025)
టెడ్డీ డేని ఫిబ్రవరి 10వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటారు. టెడ్డీలు వార్మ్‌గా, కంఫర్ట్బుల్ ఫీల్‌ని ఇస్తాయి. అందుకే వాటిని గిఫ్ట్‌గా ఇచ్చి.. తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. వాటిని హగ్ చేసుకున్నప్పుడు, చూసినప్పుడు.. తమ ప్రియమైన వారి స్పర్శ, ప్రేమ, ఆప్యాయతను ఇది పెంచుతుంది.
ఫిబ్రవరి 11 (Promise Day 2025)
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికులకు నమ్మకాన్ని, ప్రేమపై నిబద్ధతను తెలిపే డే ప్రామిస్ డే. దీనిని ఫిబ్రవరి 11వ తేదీన సెలబ్రేట్ చేసుకుంటారు. తాము ప్రేమించిన వ్యక్తికి జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్రామిస్ చేస్తూ.. హార్ట్‌ఫుల్‌గా ప్రపోజ్ చేయడమే ఈ ప్రామిస్ డే స్పెషాలిటీ. ఇది కపుల్స్ మధ్య బంధాన్ని పెంచుతుంది.
ఫిబ్రవరి 12 (Hug Day 2025)
హాగ్ అనేది Purest Form of Love అంటారు. అందుకే దీనిని కూడా ప్రేమికుల వీక్‌లో భాగం చేశారు. ఈ హగ్ డేను ఫిబ్రవరి 12వ తేదీన జరుపుకుంటారు. తమ ప్రియమైన వారికి ఒక వార్మ్ హగ్ ఇచ్చి.. తమను వారు ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్తూ.. ప్రపోజ్ చేస్తారు. ప్రేమించిన వ్యక్తికి భరోసాను ఇచ్చే ఈ హాగ్నిచ్చి మీరు కూడా ప్రేమను హగ్ డేను సెలబ్రేట్ చేసుకోండి.
ఫిబ్రవరి 13 (Kiss Day 2025)
కిస్ డేను ఫిబ్రవరి 13వ తేదిన జరుపుకుంటారు. కపుల్స్ మధ్య ఉన్న డీప్ రిలేషన్‌ని ఇది సూచిస్తుంది. ముద్దు అనేది ప్రేమను వ్యక్తం చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది.
ఫిబ్రవరి 14 (Valentines Day 2025)
వాలెంటైన్స్ వీక్ వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ప్రేమికుల దినోత్సవాన్ని చాలామంది కపుల్స్, పెళ్లి అయినవారు, లవర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు.
వాలెంటైన్స్ వీక్ 2025ను మీరు కూడా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే.. ఇప్పటినుంచే వాటికి తగ్గ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేయండి.
Also Read : వాలెంటైన్స్ డే విషెష్‌ను ఇలా ప్రేమగా చెప్పండి.. వాట్సాప్‌లో ఇలాంటి కోట్స్ పెట్టేయండి