Rose Day 2025 Wishes and History : రోజ్ డే 2025తో ఈ సంవత్సరం వాలెంటైన్స్ వీక్ (Valentines Week 2025) స్టార్ట్ అవుతుంది. ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూసే ఈ స్పెషల్ వీక్‌లో ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రోజ్ డేతో ఈ స్పెషల్ వీక్కి వెల్కమ్ చెప్తారు ప్రేమికులు. ఈ ఏడాది రోజ్ డే (07-02-2025) శుక్రవారం వచ్చింది. మరి ఈ రోజ్ డేని ఎందుకు జరపుకుంటారు? ఈ స్పెషల్ డే రోజు ఏమి చేస్తారు? రోజ్ డే చరిత్ర ఏంటి? రోజ్ డే విషెష్ ఎలా చెప్పొచ్చు (Rose Day Wishes) వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ డే
ప్రేమికలు వారోత్సవాలను రోజ్ డేతో ప్రారంభిస్తారు. ఈ స్పెషల్ డే రోజు ప్రేమికులంతా.. తమకు ఇష్టమైన వ్యక్తులకు, అభిమానించేవారికి ప్రేమను వ్యక్తం చేస్తూ.. వారిపై ఉన్న గౌరవానికి గుర్తుగా గులాబీలు ఇస్తారు. ఒక్కో రంగు గులాబీని ఒక్కో రిలేషన్‌ను తెలుపుతుంది కాబట్టి.. కేవలం ప్రేమికులే కాకుండా ఫ్రెండ్స్, ఇతరులకు కూడా ఈ గులాబీలు ఇచ్చి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేయవచ్చు.
ప్రేమ, ఆప్యాయత, అభిమానం, ప్రశంసించడానికి గుర్తుగా.. ఈ గులాబీలను రోజ్ డే రోజు ఇస్తారు. ముఖ్యంగా ఈ స్పెషల్ డే రోజు ఎరుపు గులాబీలు ఎక్కువగా సేల్ అవుతాయి. ఎందుకంటే ప్రేమించే వ్యక్తులకు రెడ్ రోజ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పూలను తమ ప్రేమకు గుర్తుగా ప్రేయసికి లేదా ప్రియుడికి అందజేస్తారు.
ప్రాముఖ్యత ఇదే
వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా చేసుకునే రోజ్ డేకు ఓ ప్రాముఖ్యత కూడా ఉంది. వాలెంటైన్ డే వచ్చేలోపు వివిధ రూపాల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ రోజ్ డేతోనే ప్రారంభమవుతుంది. అందుకే ఈ స్పెషల్ డే రోజు.. రోజ్ ఇచ్చి చాలామంది ప్రపోజ్ చేస్తూ, ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు.
రోజ్ డే చరిత్ర ఇదే..
ప్రేమ, స్నేహానికి, అభిమానానికి గుర్తుగా గులాబీలను ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. చరిత్రతో పోల్చి చూసినా.. గులాబీలు ప్రేమ, ఇష్టానికి, అభిమానానికి గుర్తుగా సూచిస్తారు. గులాబీలో ప్రతి రంగు ప్రత్యేకతను కలిగి ఉంటుంది. దాని ప్రకారం గులాబీలు ఇస్తూ ఉంటారు. రోమన్ కాలం నుంచి.. ప్రేమను వ్యక్తం చేయడం కోసం పూలు ఇవ్వడం ప్రారంభించారు. విక్టోరియన్లు దీనిని ఇన్స్ప్రేషన్గా తీసుకుని ఫిబ్రవరి 7వ తేదీని రోజ్ డేగా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలతో పాటు.. ఇండియాలో కూడా దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
రోజ్ డే విషెష్ చెప్పేయండిలా..
మీ ప్రేయసికి లేదా ప్రియుడికి ఈ స్పెషల్ డే రోజు దూరంగా ఉంటే.. వారికి రోజ్ డే విషెష్ని సోషల్ మీడియాలో చెప్పేయొచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో మీ ప్రియమైన వారికి రోజ్ డే విషెష్ ఇలా చెప్పండి.
- నీ ప్రేమతో నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసిన నీకు.. హ్యాపీ రోజ్ డే డియర్.
- ఈ గులాబీపూలలాగా మన ప్రేమ జీవితం కూడా బ్యూటీఫుల్‌గా, కలర్ఫుల్గా ఉండాలని విష్ చేస్తూ.. ప్రేమ, ఆనందంతో గుబాళించాలని హ్యాపీ రోజ్ డే.
- నా ప్రేమ, ఆప్యాయతకు గుర్తుగా.. నీకు ఎంతో ఇష్టమైన ఈ గులాబీలు పంపిస్తున్నాను. హ్యాపీ రోజ్ డే 2025.
- నా జీవితంలో అత్యంత అందమైన గులాబీకి ఈ పూలు పంపిస్తూ.. అవి నా గులాబీ అందాన్ని మరింత రెట్టింపు చేయాలని కోరుకుంటూ.. హ్యాపీ రోజ్ డే.
- మన ప్రేమ ఈ అందమైన గులాబీలా వికసించాలని విష్ చేస్తూ.. నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావని ఎదురు చూస్తూ.. హ్యాపీ రోజ్ డే మై క్రష్.
- హ్యాపీ రోజ్ డే. లవ్ యూ ఫర్ ఎవర్. ఎండ్ నేవర్ మై డియర్.
ఇలా రోజ్ డే రోజు మీరు ప్రేమించే వ్యక్తికి విష్ చేసేయండి. వాట్సాప్, ఇన్స్టాలలో ఫోటోలు పంపి.. వీటిని క్యాప్షన్‌గా రాసి పంపించొచ్చు.
Also Read : వాలెంటైన్స్ వీక్ 2025 స్పెషల్.. రోజ్ డే నుంచి వాలెంటైన్స్ డే వరకు స్పెషల్స్ ఇవే