Mothers Day 2025 : ప్రపంచంలో దొరికే ప్రతి ప్రేమ వెనుక ఏదొక స్వార్థం ఉంటుంది కానీ.. అమ్మ ప్రేమలో అలాంటి స్వార్థం ఉండదు. తల్లిని మించి నిస్వార్థంగా ప్రేమించే వారు ఎవరికి దొరకరు. అందుకే ఆమె ప్రేమ ముందు నాన్న ప్రేమ కూడా తేలిపోతుంది. ఎన్నిసార్లు చిరాకు పడినా.. ఎంతగా ఆమెకు ఎదురు చెప్పినా.. ఆమె తన ప్రేమను చూపించడంలో ఏ మాత్రం లోటు చేయదు. కొన్నిసార్లు చిన్నబుచ్చుకున్నా.. ప్రేమగా పిలిస్తే.. కోపాన్నంతా కర్పూరంలా కరిగించేసుకుంటుంది. ఎంత కోపంగా తిడుతుందో అంత ప్రేమగా తినిపిస్తుంది. బుజ్జగిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. అలాంటి అమ్మ ప్రేమను ఒక్కరోజులో కుదించి పొగడలేము. అలాగే ఆమె చూపించే ప్రేమను కొనియాడడానికి ఓ జన్మ సరిపోదు.

అందుకే అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేసేందుకే మదర్స్ డేని తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం రోజున మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది మే 11వ తేదీన మదర్స్​ డే వచ్చింది. ఆమెపై మీరు రోజూ ప్రేమ చూపించవచ్చు. అయితే ఆమె చూపించే ప్రేమను పండుగలా సెలబ్రేట్ చేసుకోవడానికి మదర్స్​ డేని సెలబ్రేట్ చేయవచ్చు. మీ బంగారు తల్లికి ఓ బుజ్జి హగ్ ఇచ్చి విషెష్ చెప్పొచ్చు. దూరంగా ఉంటే సోషల్ మీడియాలో విష్ చేయవచ్చు. లేదంటే కోట్స్ రూపంలో వాట్సాప్, ఫేస్ బుక్ వంటి వాటిలో ఫోటోలు షేర్ చేస్తూ ఏ విధంగా మదర్స్ డే విషెష్ చెప్పవచ్చో చూసేద్దాం. 

మదర్స్ డే విషెష్.. 

హ్యాపీ మదర్స్ డే అమ్మ.. ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అమ్మవి. 

హ్యాపీ మదర్స్ డే అమ్మ. నీవల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. నువ్వంటూ లేకుంటే నాకంటూ అర్థమే లేదు. 

ప్రపంచానికి నువ్వు నా అమ్మవి కావొచ్చు. కానీ మొదటి గురువు, ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్​ నువ్వే అమ్మ. లవ్​ యూ మమ్మీ.

నీపై ప్రేమను ఒక్క మెసేజ్​లో ఎలా చెప్పాలో తెలియట్లేదు అమ్మ. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వే నా ప్రపంచం. హ్యాపీ మదర్స్ డే అమ్మ. 

జీవితంలో నేను కృంగిపోయి.. ఆశలు వదిలేసుకున్న ప్రతీసారి నువ్వే నన్ను తిరిగి పైకి లేపావు. నువ్వు లేకుంటే నాకు ఈ స్థాయి, పేరు వచ్చేది కాదమ్మా. ప్రతి జన్మకు నేను నీకే పుట్టాలి. నువ్వే నా అమ్మగా రావాలి. హ్యాపీ మదర్స్ డే బుజ్జమ్మ. 

ధైర్యంగా ఇంటి బాధ్యత భుజాలపై వేసుకుని.. ఎలాంటి లోటు లేకుండా, రాకుండా మమ్మల్ని కంటికి రెప్పగా కాపాడావు. నువ్వే మా ధైర్యం, నువ్వే మా స్ఫూర్తి అమ్మ. హ్యాపీ మదర్స్ డే మై డియర్ అమ్మ. 

మాకోసం నీ పర్సనల్ లైఫ్​ని, ప్రొఫెషనల్​ లైఫ్​ని త్యాగం చేశావు. నీ ఇష్టాలని మాకోసం వదిలేశావు. ఏ స్వార్థం లేకుండా మాకు ప్రేమను పంచావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం? థాంక్యూ అమ్మ. లవ్​ యూ. 

అమ్మపై మీకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చు. మీ అమ్మతో దిగిన ఫోటోలను ఇన్​స్టా, వాట్సాప్​లలో స్టేటస్​లుగా పెడుతూ విషెష్ చెప్పవచ్చు. అయితే మీరు పోస్ట్ చేసే ప్రతి విషెష్ ఆర్టిఫీషియల్​గా కాకుండా అమ్మపై మీకున్న ప్రేమను తెలియజేసేలా రాస్తే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. విషెష్ ఎలా ఉన్నా దానిలో మీ ప్రేమను జోడిస్తే అది అద్భుతంగా ఉంటుందని గుర్తించుకోండి.