Friendship Day Wishes in Telugu: స్నేహితుల దినోత్సవం రానే వచ్చేసింది. ఈ ఆదివారం (ఆగస్టు 4న) ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఫ్రెండ్‌షిప్ డేకు సుమారు 89 ఏళ్ల చరిత్ర ఉంది. ఎందుకంటే.. స్నేహితుల దినోత్సవం మొట్టమొదట పుట్టింది అమెరికాలో. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ 1935లో ఫ్రెండ్‌షిప్ డేను ప్రారంభించింది. అదే.. కాలక్రమేనా ప్రపంచం మొత్తం పాకింది. పాశ్యాత్య సంస్కృతి ఫాలో అయ్యే కార్పొరేట్ సంస్థలు.. స్నేహితుల దినోత్సవాన్ని ఇండియాకు కూడా దిగుమతి చేసుకున్నారు. గ్రీటింగ్స్ కార్డులతో మొదలైన ఈ వేడుక ఇప్పుడు సింపుల్‌గా మెసేజ్‌లు, కోట్స్‌తో సాగిపోతోంది. అన్నట్టు మీరు మీ స్నేహితులను విష్ చేయడానికి కోట్స్ రెడీ చేసుకున్నారా? లేకపోతే ఇదిగో మీ కోసమే ఈ విషెస్. వెంటనే కాపీ పేస్ట్ చేసుకుని విష్ చేసేయండి. మనం తెలుగువాళ్లం కాబట్టి.. మన కమ్మని మాతృ భాషలోనే స్నేహితులకు చక్కగా విషెస్ చెబుదాం. 

❤ మిత్రమా నువ్వు లేని జీవితం నాకు థార్ ఎడారి. నువ్వు పక్కనుంటే.. ఎప్పుడూ ఆనంద రహదారే.నా జీవితంలో ఎనలేని ఆనందం నువ్వు.ఎల్లకాలం.. ఇలాగే నాకు తోడుగా ఉంటానని మాటివ్వు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

❤ డియర్ ఫ్రెండ్.. మనం తోబుట్టువులం కాదు..కానీ, అంతకంటే గొప్ప బంధం మనది.. రక్త సంబంధం కాకున్నా.. ఎప్పుడూ నాతోనే ఉంటావు.నేను కష్టాల్లో ఉంటే.. ఎదురుగా నిలబడి ధైర్యం ఇస్తావు.నీ రుణం తీర్చలేనిది.. మన బంధం తెంచలేనిది.హ్యాపీహ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా

❤ నా కోసం దేవుడు ఓ జీవిని పుట్టించాడు.ఆ జీవి నవ్వి్స్తాది.. ఏడిపిస్తాది..నా కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటాది..ఆ జీవి మరెవ్వరో కాదు.. నువ్వే మిత్రమా!హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

❤ అరే ఫ్రెండ్.. నా మనసులో మాట నీకెలా తెలుసు?అరే ఫ్రెండ్.. నాకు ఏది కావాలో నీకెలా తెలుసు?నేను ఊహించేలోపే.. అన్నీ నా కళ్ల ముందు ఉంచుతావ్.నువ్వు నా ఫ్రెండ్ కాదు.. దేవుడిచ్చిన వరానివి.హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే రా... ❤ నలుగురిలో నువ్వు ఉన్నా..నీలో నిన్ను లేకుండా చేసేది ప్రేమ..నీలో నువ్వు లేకున్నా..నీకంటూ ఒకరు ఉన్నారూ అని చెప్పే ధైర్యం స్నేహం..హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే నేస్తమా

❤ వెలుగుజిలుగుల్లో ఒంటరిగా నడవడం కన్నా.. చిమ్మ చీకట్లో మిత్రుడితో కలిసి నడవడమే ఉత్తమం - హెలెన్ కెల్లర్

❤ స్నేహం చేయడమే మీ బలహీనత అయితే..ఈ ప్రపంచంలో మీ అంత బలవంతులు ఎవరూ లేరు - జార్జ్ బెర్నార్డ్ షా

❤ నా కోసం ఎల్లప్పుడూ నా వెంట ఉండే ఫ్రెండ్‌వి నువ్వు..నా కష్టాల్లో సాయానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తివి నువ్వు..నువ్వు నేను.. వేర్వేరు కాదు మిత్రమా.. ఒకటే ప్రాణం.. ఒకటే జీవితం..హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

❤ నువ్వు ఓడిపోయినా సరే... నన్ను గెలిపించాలని చూసే స్వచ్ఛమైన స్నేహం నీది..కానీ, నీ గెలుపు కూడా నాకు ఆనందమేనని మరవకు మిత్రమా.హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే ❤ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..నీ స్నేహమనే తీరం నాకు దొరికిందిఆ తీరం నన్ను కాల్చే కొలిమి కాకుండా..మనసుకు ఆహ్లాదాన్ని అందించే పర్యాటక క్షేత్రం కావాలన్నదే..నా కోరిక మిత్రమా.హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 

Also Read : క్రిస్పీ పెసర పునుగులు.. చాలా సింపుల్​గా ఈవెనింగ్ స్నాక్స్​ని చేసేయండిలా