స్నేహితులన్న వారే నిజమైన ధనవంతులు. ఏ కష్టమొచ్చిన వారికి చెప్పుకుంటే కాస్త రిలీఫ్. వీలైతే ఆ కష్టాన్ని వారు తీర్చేస్తారు కూడా. మనదేశంలో ఫ్రెండ్షిప్ డేను ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారం నిర్వహించుకుంటారు. మీ ప్రియస్నేహితుడికి తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. కింద ఇచ్చిన కోట్స్‌లో మీకు నచ్చినదాన్ని ఎంచుకుని కాపీ చేసి మీ స్నేహితుడికి వాట్సాప్ చేయండి.
1. స్నేహం చేయడమే మీ బలహీనత అయితే
ప్రపంచంలో మీ అంత బలవంతులు లేరు - జార్జ్ బెర్నార్డ్ షా
2. తాను ఓడిపోయినా సరే...
తన నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన స్నేహం నాది...
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
3. తల్లిదండులకు, తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు
స్నేహితులకు మాత్రమే చెప్పుకోగలం.
అలాంటి నాకు నీ రూపంలో దొరికింది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
4. డబ్బు లేని పేదవాడు కాదు, స్నేహితుడు లేని వాడే పేదవాడు.
అందుకే నేనెంతో ధనవంతుడిలా ఫీలవుతారు.
నాకు నువ్వున్నావు కదా.
హ్యీపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
5. స్నేహితులు లేని జీవితం ఎడారిలాంటిది,
నలుగురు స్నేహితులు పక్కన ఉంటే తెలుస్తుంది...
జీవితం ఎంత అందంగా ఉంటుందో.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
6. రక్తసంబంధం లేకున్నా..
అంతకన్నా ఎక్కువగా పెనవేసుకునే బంధం మనది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
7. నా నవ్వుని రెట్టింపు చేసేందుకు,
బాధని పంచుకునేందుకు దేవుడు
నా కోసం పుట్టించిన స్నేహితుడివి నువ్వు...
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా.
8. నువ్వు నోరు విప్పి ఒక్క మాట చెప్పకపోయినా...
మనసులోని బాధను అర్థం చేసుకునేవాడే నిజమైన స్నేహితుడు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా
9. మీకు ఎంతమంది స్నేహితులుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది.
వీలైనంతమందిని స్నేహితులుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా
10. నలుగురిలో నువ్వు ఉన్నా
నీలో నిన్ను లేకుండా చేసేది ప్రేమ
నీలో నువ్వు లేకున్నా
నీకంటూ ఒక నలుగురు ఉన్నారూ అని చెప్పే ధైర్యం స్నేహం
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నేస్తమా
11. నీకు తెలియని నిన్ను, నీకు పరిచయం చేసేందుకే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు.
12. ప్రపంచమంతా మిమ్మల్ని దూరం పెట్టినా...
మీ పక్కన నిల్చునే వాడే స్నేహితుడు.
అలాంటి స్నేహితులు ఉన్న ప్రతిఒక్కరు అదృష్టవంతులే.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
13. వెలుగుజిలుగులలో ఒంటరిగా నడిచే కన్నా...
చీకటిలో స్నేహితుడితో కలిసి నడవడం ఎంతో ఉత్తమం - హెలెన్ కెల్లర్
14. నా కష్టసమయాల్లో నువ్వెప్పుడూ నా పక్కనున్నావ్,
నీలాంటి నిజమైన స్నేహితుడిని నాకు ఇచ్చినందుకు
ప్రతి రోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
Also read: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
Also read: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్