Easter 2025 Wishes in Telugu : క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈస్టర్​. గుడ్ ఫ్రైడే రోజు ఎలాగో విష్ చేసే ఆప్షన్ ఉండదు. కానీ ఈస్టర్ సమయంలో క్రైస్తవులు సంతోషంగా ఒకరికొకరు హ్యాపీ ఈస్టర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. గుడ్ ఫ్రైడే రోజు ఏసును శిలువ వేస్తారు కాబట్టి ఇలా విష్ చేసుకోరు. కానీ ఈస్టర్​ ఏసు పునరుత్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి అందరూ సంతోషంగా ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. 

Continues below advertisement


ఈస్టర్ కొత్త ఆశలు, పునరుద్ధరణ, మరణంపై జీవితం సాధించిన విజయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈస్టర్ సందర్భంగా మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి హృదయపూర్వకంగా విషెష్ చెప్పవచ్చు. అయితే తెలుగులో శుభాకాంక్షలు చెప్పడానికి.. వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టా వంటి సోషల్ మీడియాలో విషెష్​ చెప్పడానికి, స్టోరీలకు క్యాప్షన్​గా పోస్ట్​ చేయడానికి ఇక్కడ కొన్ని అందమైన ఈస్టర్ ఫోటోలు, ఈస్టర్ శుభాకాంక్షలు ఉన్నాయి. మీరు కూడా వీటిని షేర్ చేసి ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పేయవచ్చు. 


ఈస్టర్ 2025 శుభాకాంక్షలు తెలుగులో..



  • ఈస్టర్ సందర్భంగా మీకు శాంతి, సంతోషం, ఆనందంతో కూడిన జీవితం అందాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్. 

  • మీ జీవితంలో కొత్త ఆరంభాలు, ఆశాజనకమైన క్షణాలు రావాలని కోరుకుంటూ.. ఈస్టర్ శుభాకాంక్షలు.





  • ఈస్టర్ పునర్జన్మని సూచిస్తుంది. కాబట్టి మీరు కోల్పోయిన ప్రేమ, సంతోషం అన్ని మీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటూ.. ఈస్టర్ శుభాకాంక్షలు. 

  • మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈస్టర శుభాకాంక్షలు. ఆ జీసస్ కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. 





  • ఈ ఏడాది ఈస్టర్ మీ జీవితంలో పూర్తి ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్. 

  • ఈస్టర్ మీ జీవితంలో పూర్తి సంతోషాన్ని, నవ్వులను అందించాలని.. కుటుంబంలో సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్ 2025.





  • శాంతి, సంతోషాన్ని ఈ జీసస్ మీకు అందించాలని.. ఎన్నో బ్లెస్సింగ్స్ మీ సొంతం కావాలని కోరుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు. 

  • మనం అందరం ఈస్టర్ వేడుకల్లో పాల్గొని.. పరిశుద్ధుడైన ఏసు సేవలో ఆనందించాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. 





  • మీకు, మీ కుటుంబానికి జీసస్ ఎన్నో మేళ్లు చేయాలని కోరుకుంటూ.. మీరు చేసే ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండాలని విష్ చేస్తూ హ్యాపీ ఈస్టర్. 

  • ఈ ఈస్టర్ మీకు మరచిపోలేని జ్ఞాపకాలను.. ఎన్నో మధురమైన క్షణాలను అందించాలని కోరుకుంటూ ఈస్టర్ శుభాకాంక్షలు. 





  • ఏసు క్రీస్తుతో మీ బంధం మరింత బలపడాలని.. మీరు దేవునిలో మరింత ఎదగాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్ 2025. 

  • ఈరోజు మనం దేవుడిపై నమ్మకం, ఆశను ఉంచి.. కలిసి ఈస్టర్​ను సెలబ్రేట్ చేసుకుంటాదు. హ్యాపీ ఈస్టర్ 2025. 




ఇలా మీరు మీ బంధువులు, స్నేహితులకు విష్ చేయవచ్చు. ఈస్టర్ ఫోటోలను వాట్సాప్, ఫేస్​ బుక్, ఇన్​స్టా వంటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కోట్స్​గా వీటిని పోస్ట్ చేసేయవచ్చు. మీకు తెలిసిన క్రైస్తవ సోదరులకు మీరు కూడా ఇలా విష్ చేసేయండి. చివరిగా అందరికీ హ్యాపీ ఈస్టర్ 2025.