Dussehra 2024 wishes : దేవి నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఈ సంవత్సరం అక్టోబర్​ 3న మొదలైన ఈ నవరాత్రులు అక్టోబర్ 12వ తేదీవరకు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిదిరోజులు అమ్మవారిని తొమ్మిది రకాలుగా ముస్తాబు చేసి.. రోజుకొక నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమయంలో మీ బంధువులకు, ఫ్రెండ్స్​కు దూరంగా ఉంటే వారికి వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ద్వారా విషెష్ చెప్పేయొచ్చు. వారికి, వారి కుటుంబ సభ్యులకు దసరా 2024 శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు చూసేద్దాం. 



  • మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దీవెనలు మీ ఫ్యామిలీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. 

  • మీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలిగే శక్తి, ధైర్యాన్ని ఆ అమ్మవారు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ నవరాత్రి.

  • ఈ నవరాత్రులు మీ జీవితంలో పూర్తి ఆనందాన్ని, శ్రేయస్సును, సక్సెస్​ను అందించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.

  • ఆ అమ్మవారు మీకు మంచి జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని అందించి.. మీరు సంతోషంగా ఉంచేలా చేస్తుందని నమ్ముతూ.. నవరాత్రి శుభాకాంక్షలు.

  • హ్యాపీ దసరా. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని విష్ చేస్తున్నాను.

  • ఆ దుర్గామాత మీ జీవితంలో సంతోషాన్ని, మీ కుటుంబంలో ప్రేమ, అనురాగ ఆప్యాయతల్ని పెంపొందించాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రి.

  • చెడుపై మంచి విజయాన్ని సాధించడంలో అమ్మవారిని ఇన్​స్పిరేషన్​గా తీసుకుని.. మీ కష్టాలను అధిగమించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.

  • మీరు చేయబోయే పనిలో ఆ అమ్మవారు మీకు బలాన్ని, శక్తిని ప్రసాదించి.. సక్సెస్​ అయ్యేలా మిమ్మల్ని ముందుకు నడిపించాలని విష్ చేస్తున్నాను.

  • ఈ నవరాత్రి మిమ్మల్ని మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్​, మీ గోల్స్​ రీచ్​ అయ్యేలా ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ హ్యాపీ విజయ దశమి.

  • ఆ దుర్గామాత మీ బాధల్ని దూరం చేసి.. మీకు మనశ్శాంతి, ఓదార్పును అందించాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రి.

  • మీరు వెళ్లే ప్రతి మార్గంలో, మీరు చేసే ప్రతి పనిలో ఆ అమ్మవారు మీకు అన్నిరూపాల్లో సహకరించాలని ఆ దుర్గామాతను కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు.

  • అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబసభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని.. ఆమె శక్తి మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు. 

  • అమ్మవారు మీ ఇంటిల్లీపాదికి మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ హ్యపీ నవరాత్రి.

  • దుర్గమ్మ కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ.. హ్యపీ దసరా.

  • ఈ నవరాత్రులు మన జీవితాల్లో కొత్త ప్రారంభాలను, అంతులేని ఆశీర్వాదాలను అందించాలి కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.

  • మిత్రులు, శ్రేయోభిలాషూలు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీ అందరిపై ఆ అమ్మవారి దయ, కరుణ ఉండాలని కోరుకుంటున్నాను. 



ఈ దసరా విషెష్​ను మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్​బుక్​, ఇన్​స్టా వంటి మధ్యామాల్లో పోస్ట్ చేసి దసరా శుభాకాంక్షలు చెప్పి.. ఆ అమ్మవారి దయతో అందరూ హ్యాపీగా దసరాను జరుపుకోవాలని కోరుకుంటూ.. హ్యాపి దసరా. 


Also Read : అమ్మవారికి రెండో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ కొబ్బరి అన్నం రెసిపీ