Habits Affecting Fertility in Couples : నేటి వేగవంతమైన లైఫ్​స్టైల్లో చాలామంది దంపతులు సంతానం పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వయస్సు లేదా ఆరోగ్య సమస్యలే కారణమని అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే.. మన రోజువారీ అలవాట్లలో కొన్ని.. సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు నిపుణులు. చిన్న చిన్న పొరపాట్లు కూడా శరీరంలోని హార్మోన్లను, ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని బలహీనం చేస్తాయని అంటున్నారు. 

Continues below advertisement

నిద్ర, ఒత్తిడి, మరెన్నో..

ప్రెగ్నెన్సీ రాకపోవడానికి లైఫ్​స్టైల్లోని కొన్ని అలవాట్లే ప్రధాన కారణం అని చెప్తున్నారు. రాత్రి నిద్ర లేకపోవడం, గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, ఒత్తిడి, ఫుడ్స్ వంటివన్నీ శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు. ఇవన్నీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి.. మహిళల్లో క్రమరహిత రుతుక్రమానికి దారితీయవచ్చు. అలాగే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత, పరిమాణం తగ్గిపోవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో గర్భధారణకు ఆటంకం కలిగించే మార్పులను కూడా కలిగిస్తుందంటున్నారు.

స్మోకింగ్, డ్రింకింగ్..

ధూమపానం, మద్యపానం కూడా సంతానోత్పత్తిపై చాలా ప్రభావం చూపిస్తున్నాయి. మహిళలు సిగరెట్లు తాగితే అండాల నాణ్యతను దెబ్బతింటుంది. అలాగే ముందస్తు మెనోపాజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. పురుషుల్లో అయితే స్పెర్మ్​ను ప్రభావితం చేస్తుంది. అధికంగా మద్యం సేవించడం హార్మోన్లను అస్తవ్యస్తం చేసి శరీరాన్ని బలహీనపరుస్తుంది. వైద్యుల ప్రకారం.. ఈ అలవాట్లను మానేసిన కొన్ని నెలల్లోనే మెరుగుదల కనిపిస్తుంది.

Continues below advertisement

బరువు కూడా శత్రువే..

చెడు ఆహారపు అలవాట్లు కూడా సంతానాన్ని దూరం చేస్తాయి. ఎందుకంటే జంక్ ఫుడ్, నూనె, మసాలా, స్వీట్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతుంది. ఊబకాయం వల్ల మహిళల్లో PMOS వంటి సమస్యలు వస్తాయి. ఇవి గర్భధారణను క్లిష్టతరం చేస్తాయి. మరీ సన్నగా ఉండటం కూడా హానికరమే. సమతుల్యమైన ఆహారం, పండ్లు, ఆకుకూరలు, మంచి నిద్ర.. శరీరాన్ని బలపరిచి, సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయని వైద్యులు చెబుతున్నారు.

లేట్ వయసు?

సంతానోత్పత్తిలో వయస్సు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొందరు వృత్తి, ఇతర బాధ్యతల కారణంగా కుటుంబాన్ని ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తారు. అయితే మహిళల్లో వయసు పెరిగే కొద్దీ.. అండాల సంఖ్య, స్పెర్మ్ నాణ్యత తగ్గుతాయి. ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు క్రమంగా తగ్గుతాయి. అయినప్పటికీ.. సరైన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో.. గర్భం ధరించగలరు.

మొబైల్ వినియోగం..

మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాను మితిమీరి వాడటం కూడా ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు తమ ఫోన్లపై ఎక్కువ సమయం గడుపుతున్నారని.. నిజ జీవిత సంబంధాలకు క్రమంగా దూరమవుతున్నారని పరిశోధనలో తేలింది. దీనివల్ల సంబంధాలలో ఒత్తిడి, ఒంటరితనం, దూరం పెరుగుతున్నాయి. డిజిటల్ జీవనశైలి కుటుంబ నియంత్రణపై కూడా ప్రభావం చూపుతోందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వైద్యుల సూచనలు.. 

వైద్యుల ప్రకారం.. జంట చాలా కాలంగా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ.. సక్సెస్ కాకపోతే.. వారు ముందుగానే టెస్ట్​లు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించుకుంటే అనేక చిన్న సమస్యలను నయం చేసుకోవచ్చు. వ్యాయామం చేయడం, హెల్తీ ఫుడ్, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నిద్రపోవడం వంటివి సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తల్లిదండ్రులు కావాలనే కలను కూడా సులభతరం చేస్తాయి.

ఇలాంటి హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.