గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? మనదేశంలో మోస్ట్ వాంటెడ్ స్వీట్ అది. కానీ దీని తయారీలో మైదాను ఉపయోగిస్తారు చాలామంది. రవ్వ, పాలపొడితో చేసిన వారు కూడా ఉన్నారు. మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలతో ఎప్పుడైనా ప్రయత్నించారా? ఈసారి బ్రెడ్ మిగిలిపోతే  ఇలా ట్రై చేయండి. మీకు తక్కువ ఖర్చులోనే రుచిగా గులాబ్ జామ్ తయారవుతుంది. చేయడం కూడా చాలా సులువు. ో


కావాల్సిన పదార్థాలు
బ్రెడ్ స్లైసులు - ఎనిమిది
పంచదార - రుచికి సరిపడా
పాల పొడి - రెండు స్పూనులు
గోరువెచ్చని పాలు - నాలుగైదు స్పూనులు
యాలకులు - రెండు


తయారీ విధానం
1. బ్రెడ్ స్లైసులు అంచులు కత్తిరించి మధ్యలో వాటినే గులాబ్ జామూన్ తయారీకి వాడాలి.  
2. ఆ బ్రెడ్ స్లైసులను మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. 
3. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి పాలపొడి, గోరువెచ్చని పాలు వేసి మెత్తగా పిండిలా కలుపుకోవాలి. ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండలుగా చుట్టుకుని పెట్టుకోవాలి.
4. ఈ మధ్యలోనే స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఒక కప్పు పంచదార, ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి మరిగించాలి. 
5. మరో కళాయిని స్టవ్ పై పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక చుట్టుకున్న ఉండలను నూనెలో వేయించాలి. అవి రంగు మారాక మరగబెట్టుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. అంతే బ్రెడ్ గులాబ్ జామూన్ సిద్ధమైనట్టే. 





Also read: తెల్లదొరల పాలిట సింహస్వప్నం ఉయ్యాలవాడ, ఆ రేనాటి వీరుణ్ని ఉరితీసింది సరిగ్గా ఇదే రోజు


Also read: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?