పులావ్ అంటే పడే చచ్చేవాళ్లు ఎంతో మంది. అలాంటి వారికి ఈ పచ్చిమిర్చి పులావ్ తెగ నచ్చేస్తుంది. స్పైసీగా నోరూరించేలా ఉంటుంది. దీనికి జతగా పనీర్ కర్రీ, లేదా చికెన్ కర్రీ తింటే ఆ రుచే వారు. దీన్ని పెరుగు చట్నీతో ఉత్తినే తిన్నా టేస్టు అదిరిపోతుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీకూ నచ్చడం ఖాయం. చేయడం కూడా చాలా సింపుల్.

కావాల్సిన పదార్థాలుబాస్మతి బియ్యం - ముప్పావు కిలోపచ్చిమిర్చి - ఎనిమిదిఉల్లిపాయలు - రెండుకొత్తిమీర తరుగు - అరకప్పుపుదీనా తరుగు - అరకప్పుఅల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లుగరం మసాలా పొడి - అర స్పూనునూనె - అవసరమైనంతయాలకులు - రెండులవంగాలు - అయిదుదాల్చిన చెక్క - చిన్న ముక్కపసుపు - చిటికెడుధనియాల పొడి - ఒక టీస్పూనుఉప్పు - రుచికి సరిపడాగ్రీన్ పీస్ - అర కప్పుక్యారెట్ ముక్కలు - పావు కప్పు

తయారీ ఇలా1. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 2. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ చేసే మందపాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేయాలి. 3. నూనె వేడెక్కాక ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి వేయాలి.  తరువాత క్యారెట్, పచ్చి బఠాణీలను కలపాలి.4. ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ రంగులోకి మారాక ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి కలుపుకోవాలి. 5. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు కూడా వేసి కలపాలి. 6. గరం మసాలా పొడి కూడా వేసి కలపాలి. 7. ఇప్పుడు అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు వేయాలి. 8. తరువాత బాస్మతి బియ్యం కూడా కడిగి అందులో వేయాలి. 9. మూత పెట్టేసి, అన్నం ఉడికాక ఆపేయాలి. 10. అంతే పచ్చిమిర్చి పులావ్ రెడీ అయినట్టే. 

పచ్చిమిర్చి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా కారానికి బదులు పచ్చిమిర్చి వాడడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో క్యాప్సైకిన్ అనే రసాయనం ఉంది. ఇది స్పైసీ రుచిని ఇవ్వడమే కాదు, ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి ఉంటుంది. చాలా మంది పచ్చి మిర్చి తీసి పక్కన పెడతారు. కానీ దాన్ని కూడా కలిపి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చిమిర్చి ముక్కలుగా కాకుండా మెత్తగా రుబ్బి కూరల్లో వేసుకుంటే బయట తీసి పడేయకుండా తినేస్తాము. దీని వల్ల జీర్ణశక్తి మెరగవుతుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. పచ్చిమిర్చిలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్ పొటాషియం అధికంగా ఉంటాయి. పచ్చిమిరపకాయ తినడం వల్ల వల్ల శరీరంలోని చెడు బ్యాక్టిరియా నాశనం అవుతుంది.  ఎండుమిర్చి కన్నా కూడా పచ్చిమిర్చిని వాడడం వల్లే ఎక్కువ లాభాలు.

Also read: పుట్టగొడుగులు శాకాహారమా లేక మాంసాహారమా? శాకాహారులు వాటిని ఎందుకు తినరు?

Also read: బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారంటే