Student Suiside :     మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో ఏాది  చదువుతున్న శ్రావణి(20) అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో మరణించింది. శ్రావణి స్వస్థలం నిజామాబాద్. హాస్టల్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండగా తోటి విద్యార్థులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలానికి  చేరుకొని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. ప్రాథమికంగా ఆత్మహత్య అని భావిస్తున్నప్పటికీ.. పోలీసులు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి ఫోన్‌తో పాటు ఇతర ఆధారాలు సేకరించి విశ్లేషిస్తున్నారు.  కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.  


విద్యార్థిని మృతిపై పోలీసుల విచారణ 


విద్యార్థిని ఆత్మహత్య విషయాన్ని యాజమాన్యం, పోలీసులు గోప్యంగా ఉంచింది. ఇతర విద్యార్థులు ఆందోళన చేస్తారన్న కారణంగా కాలేజీ వద్ద పోలీసుల భద్రతను పెంచారు. శ్రావణి మృతదేహానికి పోస్టు మార్టం కోసం వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరణానికి కారణాలేమిటో పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. శ్రావణి తల్లిదండ్రుల దగ్గర నుంచి అదనపు సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే..దానికి కారణాలేమైనా ఉంటాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారాలు లేదా చదువుల ఒత్తిడి ఏమైనా ఉందా అని .. స్నేహితుల వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 


తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కాలేజీ కావడంతో పోలీసుల జాగ్రత్లలు


మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందినది కావడంతో  విద్యార్థిని అనుమానాస్పద మరణం అంశం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. మీడియాను కూడా దూరంగా ఉంచారు. విద్యార్థులతోనూ మాట్లాడనీయలేదు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడంతో అదే కాలేజీలో చదివే విద్యార్థుల్లో భయాందోళనలు వ్యక్తమయ్ాయయి. దీంతో క్లాసులు ఆపేసి అందర్నీ ఇళ్లకు పంపించారు. 


గతంలోనూ మల్లారెడ్డి కాలేజీపై పలు వివాదాలు


మల్లారెడ్డి కాలేజీల్లో గతంలో కూడా కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల పరీక్షలకు హాజరయ్యే విషయంలో హాల్ టిక్కెట్లు ఇవ్వలేదని..  విద్యార్థఉలు   ఆగ్రహంతో బస్సులు, కళాశాల బిల్డింగ్ పై రాళ్లు రువ్వారు విద్యార్థులు. విద్యార్థుల దాడిలో పలు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. విద్యార్థులు విధ్వంసానికి దిగడంతో మల్లారెడ్డి కాలేజీ క్యాంపస్ లో ఉద్రిక్తత తలెత్తింది. చాలా సేపటి వరకు విద్యార్థులు ఆందోళన చేశారు. కొందరు విద్యార్థులు కాలేజీకి లోపలికి వెళ్లి.. కార్యాలయ అద్దాలపై రాళ్లు విసిరారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో స్పాట్ కు వచ్చిన పోలీసులు.. విద్యార్థులను చెదరగొట్టారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది.  ఆ తర్వాత పలు వివాదాలు వచ్చాయి. అయితే ఇవన్నీ అన్ని కాలేజీల్లో సహజంగానే ఉంటాయని.. . ప్రత్యేకంగా మల్లారెడ్డి కాలేజీలోనే ఉండవని యాజమాన్యం వాదిస్తూ వస్తోంది. 


డీఏవీ స్కూల్ తరహాలో ఘటన, అనాథ మైనర్‌ బాలికపై అత్యాచారం!