మనిషి ఆయుష్షును పెంచేందుకు ఎప్పట్నించో పరిశోధనలు జరుగుతున్నాయి.ఆయుష్షును పెంచే శక్తి ఏ ఆహారాల్లో ఉందో కూడా పరిశోధ్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఒక తాజా అధ్యయనంలో ద్రాక్ష పండ్లలో మనిషి ఆయుష్షును పెంచే గుణాలు ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. ‘ఫుడ్స్’ అనే జర్నల్ ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురించారు. దాన్ని బట్టి ద్రాక్షను తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, తద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగుతుందని రుజువైంది. కాలేయంలో కొవ్వు పట్టకుండా ద్రాక్షలోని గుణాలు అడ్డుకుంటాయి. 


వెస్ట్రన్ న్యూ ఇంగ్లండ్ యూనివర్శిటీలో డాక్టర్ జాన్ పెజ్జుటో  తన టీమ్‌తో కలిసి అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో ద్రాక్ష తినడం వల్ల చాలా అబ్బురపరిచే ప్రభావాలను కనుగొన్నారు. అది ఆరోగ్యంపై తద్వారా జీవితకాలాన్ని పెంచడంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకున్నారు. రోజుకు ఒక కప్పు నిండా ద్రాక్ష పండ్లు తిన్నా చాలు... కాలేయంలోని కొవ్వును కరిగించడం ద్వారా జీవితకాలాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు 600కి పైగా శాస్త్రీయ అధ్యయనాలు రాసిన పెజ్జుటో ద్రాక్షను అద్భుతమైన ఆహారంగా పేర్కొన్నారు. ద్రాక్షలు తినడం వల్ల యాంటీఆక్సిడెంట్ జన్యువుల స్థాయిలు పెరుగుతాయి. అధిక కొవ్వును కరిగింది సహజమరణాన్ని వాయిదా పడేలా చేయగలదు ఈ అద్భుతమైన పండు. ద్రాక్సలు తరచూ తినేవారిలో సహజ మరణం నాలుగు నుంచి అయిదేళ్ల పాటూ వాయిదా పడే అవకాశం ఉందని పెజ్జుటో అంచనా వేశారు.


ద్రాక్ష వినియోగం మెదడులో జన్యువులను ప్రవర్తనను మార్చి, మనిషి ప్రవర్తన కూడా బావుండేలా చేస్తుంది. మెదడులోని జన్యువుల పనితీరు అధిక కొవ్వు ఆహారం వల్ల దెబ్బతింటుంది. కాబట్టి ద్రాక్షలు తినడం వల్ల అధిక కొవ్వు కరిగిపోతుంది. ఇది జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి పిల్లలకు, పెద్దలకు కూడా ద్రాక్షలను రోజూ కనీసం ఓ పది పండ్లయినా తినడం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకున్నవారవుతారు.  ఆరోగ్యం బాగుంటే 70 ఏళ్లకు రావాల్సిన సహజమరణం నాలుగైదేళ్లు వాయిదా పడి 74 లేదా 75 ఏళ్లకు చేరుతుందన్నమాట. 


Also read: లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి


Also read: ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు, ప్రాచీన వైద్యంలో వీటిదే ప్రథమ స్థానం










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.