కొన్ని సంఘటనలు వినడానికే వింతగా ఉంటాయి, అలా ఎలా జరుగుతుందబ్బా అని జుట్టు పీక్కునేలా చేస్తాయి. అలాంటిదే ఈ కేసు కూడా. ఒక వ్యక్తి పొట్ట నొప్పి అంటూ ఆసుపత్రికి వెళ్లాడు. తీరా స్కాన్ చేసి చూస్తే పొట్టలో టీ గ్లాసు కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయారు వైద్యులు. ఆ వ్యక్తిది బీహార్లోని వైశాలి జిల్లాలోని మహువా గ్రామం. అతని ఊరు, పేరు బయటికి రానివ్వలేదు వైద్యులు.


అతడికి సర్జరీ చేసిన డాక్టర్ మక్బూల్ హక్ ఈ కేసుకు సంబంధించి వివరాలు అందించారు. డాక్టర్ మక్బూల్ వద్దకు 55 అయిదేళ్ల వయసుండే వ్యక్తి వచ్చాడు. పొట్టనొప్పి వస్తందనడంతో అల్ట్రాసౌండ్, ఎక్స్ రే తీశారు. అందులో  పొట్టలో గ్లాసులాంటి ఆకారం కనిపించింది. అది కూడా పెద్దపేగులో ఇరుక్కున్నట్టు కనిపించింది. ఆ విషయం గురించి రోగిని అడగ్గా టీ తాగుతూ గ్లాసు మింగేశానని చెప్పాడు. అయితే వైద్యుడు ఆ విషయాన్ని నమ్మలేదు. ఎందుకంటే మనిషి ఫుడ్ పైప్ అంత వెడల్పుగా ఉండదు, గ్లాసును మింగడం కుదరదని డాక్టర్ అభిప్రాయం. అందుకే ఆ రోగి నోటి ద్వారా గ్లాసును మింగాడంటే నమ్మశక్యంగా లేదని తెలిపారు. ఆ రోగి కుటుంబసభ్యులను అడిగినా కూడా వారు ఆ గ్లాసు గురించి తెలియదని చెప్పారు. 


  ఆ గ్లాసును తీసేందుకు ఎండోస్కోపిక్ ప్రక్రియలో పురీషనాళం ద్వారా ప్రయత్నించారు డాక్టర్ మక్బుల్. కానీ అది వీలు పడలేదు. దీంతో పొట్ట కోయక తప్పలేదు. పొత్తి కడుపు ప్రాంతంలో కోసి, పెద్ద పేగును తెరిచి మరీ గ్లాసును తీశారు. రోగి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స తరువాత పెద్ద పేగును తిరిగి కుట్టారు. ఈ కుట్టు మానడానికి చాలా సమయం పడుతుందని అంతవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వైద్యులు. 


ఆ గ్లాసు పొట్టలో ఎలా చేరిందో అంచనా వేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. అది నోటి ద్వారా మింగింది కాదని, అసాధ్యమని తేల్చి చెప్పారు. కేవలం మల విసర్జన మార్గం ద్వారానే అది లోపలికి చేరిందని, అసలేం జరిగిందో చెప్పేందుకు రోగి ఇష్టపడడం లేదని వైద్యులు వివరించారు. రోగి ప్రైవసీకి భంగం కలిగించడం ఇష్టం లేకే ఆ విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపలదేని తెలిపారు. 


Also read: శాకాహారుల కోసం టేస్టీ వెజ్ ఖీమా, రుచే కాదు పోషకాలు పుష్కలం


Also read: ఆపిళ్లు ఎన్నయినా తినండి, వాటిలోని గింజలు ఎక్కువ తింటే మాత్రం నేరుగా ఐసీయూకే