Gas Booking Trouble in Hyderabad : హైదరాబాద్​లో గ్యాస్ కష్టాలు.. పనిచేయని యాప్స్, బుకింగ్స్ కాకపోవడంతో పెరుగుతోన్న ఆందోళనదేశవ్యాప్తంగా ఉన్న LPG సంక్షోభం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కూడా తాకింది. ముఖ్యంగా హైదరాబాద్​లో గ్యాస్ బుక్ చేసుకునేందుకు తెగ కష్టపడాల్సి వస్తుంది. యాప్స్, గవర్నమెంట్ వెబ్​సైట్స్​ కూడా పనిచేయకపోవడంతో అందరిలోనూ కాస్త ఆందోళన పెరిగింది. ఇప్పటికే భాగ్యనగరంలో కొన్ని హోటల్స్ మూసేస్తున్నారు. మరికొందరు ఆన్​లైన్ సర్వీస్​లు ఆపేశారు. హాస్టల్స్​లో పరిమిత మెనూ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇంట్లో వండుకునేవారికి కూడా ఈ సమస్య తాకింది. 

Continues below advertisement

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వచ్చింది. ఈ నేపథ్యంలో యుద్ధంతో సంబంధం లేకపోయినా.. పలు దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియాపై కూడా ఈ యుద్ధం ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. మొదట్లో ఇది కమర్షియల్ పర్పస్ మాత్రమే ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వరస్ట్ కేస్​లో డొమెస్టిక్​పై కూడా పడడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. 

గ్యాస్ బుకింగ్ కష్టాలు

ముఖ్యంగా హైదరాబాద్​లో గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు ట్రై చేసినా.. యాప్స్ పనిచేయకపోవడం, వెబ్ సైట్ లోడ్ అవ్వకపోవడం, డీలర్స్ రెస్పాండ్ అవ్వకపోవడమే ఎక్కువగా ఉంది. దీంతో చాలామందిలో నిరాశ పెరుగుతుంది. ఊర్లలో ఉండేవారికి ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించకపోయినా.. ప్రధాన నగరాల్లో ఉండేవారిపై ఈ గ్యాస్ కొరత ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. దీంతో గ్యాస్​ లేకుండా లేదా తక్కువ ఖర్చుతో ఎలా వంటలు చేసుకునే పద్ధతులు తెలుసుకుంటున్నారు. 

Continues below advertisement

Also Read : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి

మరో రెండు నెలలు తప్పదా?

ఈ గ్యాస్ కష్టాలు రాబోయే రెండు నెలల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని గట్టెక్కించేందుకు మోదీ ప్రభుత్వం కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. మరి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.

గ్యాస్ సరఫరాలో అంతరాయం ఉంటే.. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మైక్రోవేవ్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా తాత్కాలికంగా వంట సమస్యను ఎదుర్కొవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.