✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి

Geddam Vijaya Madhuri   |  12 Mar 2026 11:40 AM (IST)

LPG Shortage : గ్యాస్ అయిపోయిందా? ప్రస్తుతమున్న కొరతలో గ్యాస్, ఇండక్షన్ లేకపోయినా వంట చేయడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి

గ్యాస్ అయిపోయిందా? ఇండక్షన్ లేకపోయినా వంట చేసే 5 సులభ మార్గాలు

Quick Read

Key points generated by AI, verified by newsroom
  • గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ వంట పద్ధతులు పరిశీలిస్తున్నారు.
  • ఎలక్ట్రిక్ కెటిల్, మైక్రోవేవ్, రైస్ కుక్కర్ సులభమైన వంట పద్ధతులు.
  • బొగ్గు, చెక్క పొయ్యి, సోలార్ స్టవ్ వంటివి కూడా ప్రత్యామ్నాయాలు.

Cooking Without Gas Useful Alternatives : దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్‌పీజీ సరఫరాపై ఆందోళన పెరుగుతోంది. గ్యాస్ లభ్యత ప్రభావితమైతే, సామాన్యుల నుంచి రెస్టారెంట్లు, హోటళ్ల వరకు చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో.. ఎక్కడైతే రోజువారీ పనుల్లో ఎల్‌పీజీపై ఎక్కువ ఆధారపడతారో.. అక్కడ ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. గ్యాస్ అయిపోతే.. వంట చేయడానికి ఇండక్షన్ మాత్రమే ఏకైక మార్గమని చాలా మంది భావిస్తారు. కానీ ఇది అవసరం లేకుండానే వివిధ మార్గాల్లో వంట చేసుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అందుకే ఈ సమయంలో గ్యాస్ కొరత గురించిన చర్చతో పాటు.. ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి గ్యాస్ లేనప్పుడు.. ఇండక్షన్ మాత్రమే కాకుండా.. మరెలా వంట చేసుకోవచ్చో చూసేద్దాం.

ఎలక్ట్రిక్ కెటిల్

ఎలక్ట్రిక్ కెటిల్ కేవలం నీరు మరిగించడానికి మాత్రమే కాదు.. అనేక చిన్న చిన్న పనులకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో నూడుల్స్, గుడ్లు, సూప్, ఓట్స్ వంటి తేలికపాటి ఆహారాలను త్వరగా తయారు చేసుకోవచ్చు. గ్యాస్ లేని పరిస్థితిలో ఇది వేగవంతమైన, సులభమైన ఎంపికగా మారుతుంది.

మైక్రోవేవ్ ఓవెన్

మైక్రోవేవ్ కూడా వంట చేయడానికి, వంటను వేడి చేయడానికి మంచి మార్గం. ఇందులో కూరగాయలు, అన్నం, పాస్తా లేదా రెడీ టు ఈట్ ఫుడ్ సులభంగా తయారు చేసుకోవచ్చు. చాలా మంది మైక్రోవేవ్‌లో ఆవిరి వంట లేదా బేకింగ్ ద్వారా కూడా వంట చేస్తారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్

రైస్ కుక్కర్ కేవలం అన్నం వండటానికి మాత్రమే కాదు. ఇందులో పప్పు, కిచిడి, సూప్, కొన్ని కూరగాయలు కూడా ఉడికించవచ్చు. గ్యాస్ అయిపోయినప్పుడు.. ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో వంట చేయడం సులభం. వేగంగా చేసుకోవచ్చు.

బొగ్గు లేదా చెక్క పొయ్యి

చాలా చోట్ల గ్యాస్ లేని పరిస్థితిలో బొగ్గు లేదా చెక్క పొయ్యిని కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా హోటళ్లు, ధాబాలలో ఈ పద్ధతిని ముందే ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి బహిరంగ ప్రదేశం అవసరం.

సోలార్ స్టవ్

సోలార్ స్టవ్ కూడా వంట చేయడానికి ఒక మంచి ఎంపిక కావచ్చు. ఈ స్టవ్ లో సూర్యరశ్మిని ఉపయోగించి వంట చేయవచ్చు. సోలార్ స్టవ్ సోలార్ ప్లేట్ నుంచి వచ్చే శక్తి ద్వారా పనిచేస్తుంది. పొయ్యిని వంటగదిలో ఉంచవచ్చు. కేబుల్ ద్వారా ఇది పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్‌కు అనుసంధానమై ఉంటుంది. ఒకసారి దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. గ్యాస్ లేకుండా కూడా వంట చేయవచ్చు.

Published at: 12 Mar 2026 11:39 AM (IST)
Tags:LPG shortagecooking without gascooking without LPG gasinduction cooking optionelectric kettle cookingmicrowave cooking methodrice cooker recipessolar stove cookingwood fire cookinggas alternative cookingLPG crisis solutionelectric cooking devices
  • హోమ్
  • లైఫ్‌స్టైల్‌
  • Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.