Fruits For Weight Loss : కొత్త సంవత్సరంలో బరువు తగ్గడాన్ని చాలామంది టార్గెట్​గా పెట్టుకుంటారు. మీరు కూడా ఫిట్​గా ఉండాలని అనుకుంటుంటే.. మీ డైట్​లో కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే శారీరకంగా మార్పు కోరుకుంటే.. జిమ్​ కంటే.. డైట్​పైనే ఎక్కువ ఫోకస్ చేయాలి. డైట్​ బరువు తగ్గడంంలోనూ.. పెరగడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. జిమ్ ఎంత చేసినా.. ఫుడ్ విషయంలో మార్పులు లేకుంటే బరువు తగ్గలేరు. 


బరువు తగ్గాలనే యోచనలో ఉన్నవారు తమ డైట్​లో కొన్ని ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలంటున్నారు డైటీషియన్లు. వాటిని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్తున్నారు. మరి డైట్​లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఫ్రూట్స్​తో బరువు ఎలా తగ్గవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 


సిట్రస్ ఫ్రూట్స్..


ఆరెంజ్ : బరువు తగ్గడంలో సిట్రస్ ఫ్రూట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటిలో భాగంగా మీరు ఆరెంజ్​లు తీసుకోవచ్చు. వీటిలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీల్ వస్తుంది. ఎక్కువ కాలం నిండుగా ఉంటారు. 


ద్రాక్ష : ద్రాక్షల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇవి ఇమ్యూనిటినీ కూడా పెంచుతుంది. హెల్తీ స్నాక్​గా ఇవి బెస్ట్ ఆప్షన్. 


నిమ్మకాయలు : నిమ్మకాయలను మీరు తాగే నీటిలో లేదా హెర్బల్ డ్రింక్స్​లో కలిపి తీసుకోవచ్చు. వీటివల్ల మెటబాలీజం పెరిగి శరీరంలో కొవ్వు తగ్గుతుంది. యాక్టివ్​గా కూడా ఉంటారు. 


బెర్రీలు 


బ్లూబెర్రీలు : బ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మంటను తగ్గించి.. కడుపు నిండిన ఫీలింగ్​ని పెంచుతాయి. 


రాస్ప్​బెర్రీస్ : వీటిలో కేలరీలు తక్కువగా ఉంయాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. హెల్తీ స్నాక్​కి ఇది మంచి ఆప్షన్. 


స్ట్రాబెర్రీలు : స్ట్రాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో వాటర్​ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. పోషకాలు పుష్కలంగానే ఉంటాయి. ఇవి కడుపును నిండుగా ఉంచుతాయి.


మరిన్ని


పైనాపిల్ : పైనాపిల్​లో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తుంది. కడుపు నిండుగా ఉంచి.. ఆకలిని కంట్రోల్ చేస్తుంది. 


బొప్పాయి :  బొప్పాయిలో ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో పాపైన్ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రొటీన్స్​ని బ్రేక్ డౌన్ చేసి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 


మామిడి పండ్లు :  మామిడిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్, పోషకాలతో నిండిన మ్యాంగోలు హెల్తీ స్నాక్​గా హెల్ప్ చేస్తాయి. బరువును తగ్గేలా చేస్తాయి. 


యాపిల్స్ : యాపిల్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఆకలిని తగ్గించి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 


పుచ్చకాయ : పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారి ఇవి బెస్ట్ ఛాయిస్. ఇది డీహైడ్రేట్ కాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. 



ఈ ఫ్రూట్స్​ని డైట్​లో చేర్చుకుంటే.. హెల్తీగా బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని మీరు రోటీన్​లో తీసుకునే ముందు ఆహార నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్​ ఉండకపోయినా.. కొందరిలో ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశముంది. కాబట్టి ముందుగా నిపుణుల సలహా తీసుకుని వీటిని డైట్​లో చేర్చుకోవాలి. 


Also Read : పొట్ట తగ్గించుకోవడానికి మగవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. ఈ మార్పులు చేస్తే 30 రోజుల్లో ఫ్లాట్ బెల్లీ మీ సొంతం