నేను తెరిచిన పుస్తకం.. ఈ మాట ఎవరైనా చెబితే.. ఒక్కసారి కింద నుంచి మీది వరకు చూడండి. ఏం పర్లేదు.. ఏ ఒక్కరు తెరిచిన పుస్తకం అస్సలే కాదు. నీకంటే నాకు ఎక్కువ ఎవరూ, నీకు అన్నీ చెబుతాం అంటూ బిస్కెట్స్ వేస్తారంతే... అంతెందుకు మీరు చెబుతారా? ఎవరికీ తెలియోద్దు అని  మెయింటెన్ చేసే సిక్రెట్స్ ఎన్ని ఉంటాయో కదా. ఎన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేసినా.. ఒక్క ఫ్రెండ్ తో మనం చేసిన పనులు మాములుగా ఉండవు. అన్నింటిలో ఆ పర్సన్ ఉంటాడు. నువ్వెంటో ఆ వ్యక్తికే తెలుస్తుంది.



మనం ఎలాంటి వ్యక్తులు అనేది చిన్నప్పుటి స్నేహితులకే ఎక్కువ తెలుస్తుందట. మన మెంటలిటీ.. మనం చేసే పనులు చిన్నప్పటి నుంచి వాళ్లు చూస్తుంటారు. గొడవలైనా.. ఎక్కువ అర్థం చేసుకునేది కూడా వాళ్లే. మనం చేసిన పనిని.. ఇంట్లో ఏదో ఒకటి చెప్పి.. కవర్ చేసే వాళ్లు కూడా వారే. అంతెందుకు.. తెలిసో తెలియకో.. ఓ వయసులో మందు తాగి..  ఇంటికెళ్తాం. టేస్ట్ ఎలా ఉంటుందా అనే.. ఆశతో తాగేస్తాం. ఆ టైమ్ అమ్మా, నాన్న ఇద్దరు గుర్తుపడితే.. అప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆ చెడ్డీ దోస్తే. అప్పుడు తప్పును నెట్టేది వాడిపైకే. వాడే తీసుకెళ్లాడు. వాడే తాగించాడు. వద్దు అంటే అస్సలు వినలేదమ్మా.. అని చేసిన దొంగ పనిని వాడి మీదకే చెబుతాం. మనం ఇంత చెప్పినా.. మన అమ్మ ఎంత తిట్టినా.. మళ్లీ ఆ ఫ్రెండ్ వస్తాడు. అవన్నీ చల్తా.. అనుకుంటాడు. నా మీద ఎందుకు చెప్పావ్ అని ప్రశ్నించడు. ఇలా చెప్పా.. అనీ మనం కూడా ఆ విషయం తీసుకురాం.


చిన్నప్పటి నుంచి ఎంత గ్యాంగ్ మెయింటెన్ చేసినా... ఒక్కరు మాత్రం క్లోజ్ గా ఉంటారు. వాళ్లతోనే అన్నీ షేర్ చేసుకుంటాం. ఏం జరిగినా.. ముందు వాళ్లకే ఫోన్ వెళ్తుంది. పరిచయం లేని వ్యక్తి జీవితంలోకి వచ్చినా.. ముందు ఆ ఫ్రెండుకే పరిచయం చేస్తాం. మనం చేసే ప్రతి పనిని ఆ వ్యక్తికే చెబుతాం. రోజు మాట్లడకపోయినా.. మినిమమ్ వారానికోసారైనా ఏం జరిగిందనేదనేది ఫోన్ లో రివ్యూ మీటింగ్ ఉంటుంది. అమ్మాయిల ఫ్రెండ్ షిప్ లో ఇంకా ఇది ఎక్కువ.


అలాంటి క్లోజ్ ఫ్రెండ్ తో కూడా కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు షేర్ చేసుకోలేని పరిస్థితులు వస్తుంటాయి. నేనిలా చేశానని చెబితే.. నా మీద ఎలాంటి ఓపినియన్ క్రియేట్ అవుతుందోననే భయం. కానీ దాదాపు ఏదో ఒకరోజు ఆ విషయం చెప్పేస్తాం. చెప్పకుండా కూడా ఉంటాం. 
చిన్నప్పటి స్నేహితులే కాకుండా.. పై చదువులకు వెళ్తుంటే.. కూడా కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతుంటారు. ఎక్కడున్నా మాట్లాడుకుంటారు. వాళ్లకి కూడా మనం చేసే పనులేంటో తెలిసి ఉంటాయి. అలాంటి స్నేహాలు అరిచినా.. కొట్టుకున్నా.. కాసేపే. మళ్లీ ఎవరో ఒకరు వెళ్లి మాట్లాడితే... అంతా సెట్ అయిపోతుంది.


కష్టం, సుఖం... ఆనందం, బాధ.. ఉన్నప్పుడు మెుదట గుర్తొచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్