Foods to Avoid for Early Puberty : ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం చాలా కామన్. ఓ వయసు వచ్చాక పీరియడ్స్ అవి కొన్నాళ్లు కంటిన్యూ అవ్వడం.. తర్వాత ఆగిపోవడం ఆడవారిలో సహజంగా జరిగే ప్రక్రియ. పుట్టుకతోనే ఆడపిల్లలు ఎగ్స్​తో పుడతారట. ఓ వయసుకు వచ్చాక అవి రిలీజ్ అవ్వడం ప్రారంభమవుతాయి. అలా పీరియడ్స్ సైకిల్ మొదలవుతుంది. గతంలో 12 నుంచి 15 ఏళ్ల సమయంలో ఆడపిల్లల్లో ఎగ్స్ రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు పదేళ్లలోపే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. దాని వెనుక చాలా కారణాలే ఉన్నాయి.  

ఈ మధ్యకాలంలో అమ్మాయిలు 7 నుంచి 10 సంవత్సరాల లోపే పీరియడ్స్​ పొందుతున్నారు. లైఫ్​స్టైల్​లో మార్పులతో పాటు.. తీసుకునే ఆహారం కూడా త్వరగా పీరియడ్స్ వచ్చేలా చేస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ MB శృతి. ఆమె ఇస్తోన్న సూచనలు ఏంటో.. తినకూడని ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్లాస్టిక్ బాక్స్​

చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే పిల్లలను స్కూల్​కి పంపేప్పుడు ప్లాస్టిక్ బాక్స్​లు, బాటిల్స్​లో ఫుడ్, నీళ్లు పెట్టి పంపిస్తారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని చెప్తున్నారు డాక్టర్ శృతి. 

షుగర్ ఫుడ్స్

షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్స్, చాక్లెట్స్, కూల్​డ్రింక్స్ వంటివాటికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలోని షుగర్స్, కార్బ్స్, ఎక్కువ కేలరీలు ఊబకాయ ప్రమాదాన్ని పెంచి.. పీరియడ్స్ త్వరగా వచ్చేలా చేస్తాయని చెప్తున్నారు. 

డీప్ ఫ్రై ఫుడ్స్

ఇన్​స్టాంట్​గా దొరికే ఫుడ్స్​కి కూడా ఆడపిల్లలను దూరంగా ఉంచాలంటున్నారు. డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, న్యూడిల్స్, చిప్స్ వంటి స్నాక్స్​ని అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. హెల్తీ ఫుడ్స్ తీసుకునేలా చూసుకోవాలని చెప్తున్నారు. 

పాలు

పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ.. పీరియడ్స్ మొదలుకానీ ఆడపిల్లలకు పాలు ఇవ్వకపోవడమే మంచిదని చెప్తున్నారు. అలాగే గుడ్లు కూడా ఎక్కువగా ఇవ్వకపోవడమే మంచిదని.. నాటుకోడి గుడ్లు అయినా కాస్త బెటరేనని చెప్తున్నారు.

మరిన్ని జాగ్రత్తలు

ఫుడ్స్ విషయంలోనే కాకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో పీరియడ్స్​ త్వరగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. ఎర్లీ పీరియడ్స్ అంత మంచివి కాదని చెప్తున్నారు. దీనిలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

కాస్మోటిక్స్ 

పిల్లలు తల్లులు ఉపయోగించే కాస్మోటిక్స్​ ఉపయోగించడం సరైనది కాదని చెప్తున్నారు. ముఖ్యంగా లిప్​స్టిక్, పర్​ఫ్యూమ్స్​ని ఎలా ఉపయోగిస్తున్నారో చూసి.. వాటిని ఉపయోగిస్తూ ఉంటారని.. అలా జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు శృతి.  

స్క్రీన్ టైమ్

పిల్లలకు స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్​దేనని చెప్తున్నారు. స్క్రీన్ టైమ్ గంట కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని చెప్తున్నారు. 

భార్య భర్తలు కూడా అన్యోన్యంగా ఉండాలని.. లేదంటే పిల్లలపై స్ట్రైస్ పడి త్వరగా పీరియడ్స్ పొందుతారని తెలిపారు. చిన్ననాటి నుంచే వ్యాయామం చేయించడం, చురుగ్గా ఉండేలా చూసుకోవడం వంటివి చేయడం వల్ల ఎర్లీగా పీరియడ్స్ రాకుండా ఉంటాయని తెలిపారు. సరైన ఆహారం, వ్యాయామం, పేరెంట్స్‌ కేర్ ఉంటే పిల్లల్లో ఎర్లీ పీరియడ్స్ దూరమవుతాయి చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.