కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కురాగానే శుభ్రం చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ఫ్రెష్‌గా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. కానీ, కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి.
ఈ పదార్థాలను మాత్రం ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటి? ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం.
టమాటాలు
ఒకవేళ మీరు టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే వాటి యొక్క రిచ్, ఫ్లేవర్ పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచి ఉండదు. కాబట్టి ఈ సారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచండి.
అరటికాయలు
అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను తినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి.
ఆవకాడో
ఎంతో ఖరీదు పెట్టి ఆవకాడో కొన్నాం కదా అని ఫ్రిజ్‌లో పెట్టొద్దు. ఫ్రిజ్‌లో పెడితే ఆవకాడో టేస్టు మారుతోంది. తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది.
పుచ్చకాయ
ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం.
వంకాయలు
వంకాయలను 10 ° C వద్ద ఫ్రిజ్‌లో పెడితే అవి కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. అంతేకాదు వంకాయలను భద్రపరిచేటప్పుడు వాటిని ఏ ఇతర కూరగాయలు, పండ్లతో కలపొద్దు.
వెల్లుల్లి
వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది.
చాక్లెట్లు
ఫ్రిజ్‌లో చాక్లెట్లు పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి లాగించేస్తుంటాం. కానీ, అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం. ఫ్రిజ్ లో పెడితే చాక్లెట్ రియల్ ఫ్లేవర్ పోతుంది. కాంతి కిరణాలకు దూరంగా వీటిని ఉంచాలి.
గుడ్లు
సూపర్ మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. అలాంటిది మనం ఇంటికి తెస్తే మాత్రం వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. వాటిని బయట ఉంచితేనే మంచిది.
బ్రెడ్
మీరు గమనించారో లేదో గానీ బ్రెడ్ ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది.
బత్తాయి పండ్లు
సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. తొక్క వాడిపోయి చూడ్డానికి కూడా బాగోవు. దీంతో అవి పాడైపోయాయి అనుకుని చెత్త బుట్టలో పారేస్తాం.
తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్, ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత తీసి వాడొద్దు. కాబట్టి, మీరు ఎప్పుడైనా సరే వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకుని ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకోండి. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అనారోగ్యాలు మీ దరి చేరవు.