వంట చేయడం సులువుగా కనిపిస్తుంది, కానీ అజాగ్రత్తగా ఉంటే భారీ ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. యూట్యూబ్ లో వంటల వీడియోలు తెగ క్రేజీగా మారాక వంటలక్కల సంఖ్య పెరిగిపోయింది. యూట్యూబ్ లో ఛానలె తెరవడం చిటికెలో అయిపోతుంది. ఛానెల్ తెరిచాక రకరకాల వంటలు అప్ లోడ్ చేస్తూ, లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ వంటలక్కలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఓ విదేశీ వంటలక్క చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దాదాపు ఆమె కిచెన్ కాలిపోయేంత పరిస్థితి వచ్చింది. 


కెల్లీ కారన్ అనే ఇల్లాలు పొగలు కక్కేలా వంట చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ పెట్టింది. స్టవ్ మీద స్టీక్ (మాంసాహార వంటకం) వండుతూ ఎలా చేయాలో తన ఫాలోవర్లకు వివరిస్తోంది. ఇంతలో నల్లటి పొగలు కక్కింది వంటకం. తరువాత అగ్గి రాజుకుంది. కళాయిని తీసి సింకులో వేసే సరికి మరింతగా మంట రాజుకుంది. భయంతో ఆ యూట్యూబర్ కంగారు పడుతూ కళాయిని తీసి మళ్లీ స్టవ్ మీద పెట్టింది. అయినా మంటలు తగ్గలేదు. నాకేం చేయాలో తోచడం లేదు అంటూ ఆమె తెగ కంగారు పడింది, అసలే చిన్న కిచెన్ అంటుకుంటే మంటలు ఆపడం కూడా చాలా కష్టమయ్యేది. చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం అప్పటితో ఆగిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ట్విట్ర్లో ట్రెండవుతోంది. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత కెల్లీ కారన్ మళ్లీ లాగిన్ అయి తాను క్షేమంగా ఉన్నానని అభిమానులకు తెలియ జేసింది. చేయి కొద్దిగా కాలిందని, అగ్నిమాపక శాఖ వారు వచ్చి సాయం చేశారని చెప్పుకొచ్చింది. తన ఇన్ స్టా ఖాతాలో అప్ డేట్ లను పోస్టు చేసింది. 






 



Also read: ఇక ఆ దేశంలో మహిళల కోసం నెలల ఆ మూడు రోజులు పీరియడ్స్ లీవ్



Also read: ఫోన్‌తో అధిక సమయం గడుపుతున్నారా? ఈ వయసు వారిలో ఆత్మహత్యా ఆలోచనలు కలిగే అవకాశం


Also read: టమాటోలను పొడి చేసుకుని దాచుకోవచ్చు, ఎన్నాళ్లయినా చెక్కుచెదరదు