సైమండ్స్ తన కెరీర్‌లో చాలా ఎత్తు పల్లాలు చూశాడు. ఎన్నో అద్భుతమైన విజయాల్లో పాలుపంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇన్ని విజయాలు అందించి అద్భుతమైన రికార్డులు సాధించిన ఆండ్రూసైమండ్స్‌ను ఓ వివాదం మాత్రం పీడలా పట్టి జీవితాంతం వెంటాడింది.
సైమండ్స్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే సంఘటన మంకీగేట్ వివాదం. ఇదే తన కెరీర్‌ను చాలా వరకు నాశనం చేసిందని తరచూ చెప్పేవాడు సైమండ్స్. అంటే అంతలా ఆయన్ని అన్‌పాపులర్ చేసిందీ వివాదం.
2008లో టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు మంకీ గేట్ వివాదం పెద్ద దుమారం రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వివాదం చెలరేగింది. హర్భజన తనను కోతితో పోల్చారని అప్పట్లో సైమండ్స్ ఆరోపించారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది.
హర్భజన తనపై జాత్యహంకార కామెంట్స్ చేశాడని తీవ్ర ఆరోపణలు చేశాడు సైమండ్స్. దీంతో వివాదంలో జోక్యం చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు హర్భజనపై చర్యలు తీసుకుంది. హర్భజన్‌ను మూడు మ్యాచ్‌ల్లో ఆడకుండా చర్యలకు ప్రతిపాదించింది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు తీసుకున్న చర్యలను తీవ్రంగా తప్పుపట్టింది బీసీసీఐ. భజ్జీపై నిషేధం ఎత్తివేయకపోతే మొత్తం సిరీస్‌నే బహిస్కరిస్తామని ప్రకటించారు అప్పట్లో భారత్ క్రికెటర్లు. వివాదం కొత్త టర్న్ తీసుకుంటుందని... ఆస్ట్రేలియా నుంచి ఓ పెద్ద దేశం జట్టు వెళ్లిపోతే తమకే తలవొంపులని గ్రహించిన ఆస్ట్రేలియా వెనక్కి తగ్గింది. భజ్జీపై చర్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మంగీ గేట్ వివాదంపై స్పందించిన ఆండ్రూ సైమండ్స్... తన కేరీర్‌ను నాశనం చేసిన వివాదంగా అభివర్ణిచంాడు. అప్పట్లో భజ్జీ తనను మంకీ అన్నాడని... ఆ కామెంట్స్ తను ఎంతగానో బాధపెట్టాయని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో తన జట్టు పెద్దదిగా చేసిందని వాపోయాడు. ఈ వివాదం తర్వాతే తన ప్రవర్త మారిపోయిందని... ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం ప్రారంభించినట్టు తెలిపాడు సైమండ్స్.