రెండు వారాల క్రితం వరకు చికాకు పెట్టిన వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు వచ్చేసిన వర్షాలు చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. అయితే ఈ సీజన్ లో అనారోగ్యాలకు సరైన చికిత్స తీసుకోకపోతే ఈ జ్వరాలు ఎక్కువకాలం పాటు కొనసాగి శరీరాన్ని బలహీనపరుస్తాయి. ఈ అన్ని వ్యాధుల్లో ప్రతి ఒక్కదానికి ప్రత్యేక చికిత్స అందించేందుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి లక్షణాల మీద దృష్టి నిలపాలి.


వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు సర్వసాధారణం. డెంగ్యూ, మలేరియా లేదా చికున్ గున్యా వంటివి పొంచి ఉంటాయి. డెంగ్యూలో జ్వరంతో పాటు కండరాల నొప్పులు ఉంటాయి. మలేరియాలో తలనొప్పి, చలితో జ్వరం ఉంటుంది. చికున్ గున్యాలో విపరీతమైన కీళ్ల నొప్పితో పాటు జ్వరం ఉంటుంది. క్రమంగా జ్వరం పెరుగుతుంది. నీరసం, తలనొప్పి, కడుపునొప్పి, పొడి దగ్గు కూడా ఉండొచ్చు. కోవిడ్ -19 కాకుండా వర్షాకాలంలో ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించే 5 రకాల జ్వరాల గురించి వైద్య నిపుణులు వివరిస్తున్నారు.


డెంగ్యూ


ఈ దోమల ద్వారా వ్యాపించే జబ్బుల్లో డేంగ్యూ ఒక్కటి. డెంగ్యూలో తీవ్రమైన జ్వరంతో పాటు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మైకము, మూర్చ, చలి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ జ్వరానికి ప్రత్యేకమైన మందులు ఇప్పటివరకు అందుబాటులో లేవు. డేంగ్యూతో బాధపడుతున్న వారు తప్పకుండా హైడ్రేటెడ్ గా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. డేంగ్యూ జ్వరాలు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు. త్వరగా జబ్బును గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలకు ప్రమాదం లేకుండా నివారించవచ్చు.


మలేరియా


మలేరియాకు కారణమయ్యే సూక్ష్మజీవి కలిగిన దోమ కుట్టినందువల్ల వ్యాప్తిచెందే విష జ్వరం ఇది. తీవ్రమైన చలి, వణుకు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లక్షణాలుగా ఉంటాయి. కోవిడ్ మాదిరిగానే మలేరియా కూడా ప్రాణాంతకం కావచ్చు. మెదడు దెబ్బతినడం, శ్వాసలో సమస్యలు, అవయవ వైకల్యం, హైపోగ్లైసీమియా వంటి సమస్యలు కూడా మలేరియా వల్ల రావచ్చు.


చికున్ గున్యా


ఇది కూడా ఇన్ఫెక్టెడ్ దోమ వల్ల వ్యాపించే మరోరకమైన వైరల్ ఫీవర్. ఇందులో కొద్దిగా జ్వరంతో పాటు విపరీతమైన కీళ్ల నొప్పులు ఉంటాయి. ప్రస్తుతం చికున్ గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ ను నిరోధించేందుకు టీకా కానీ, చికిత్సకు ప్రత్యేక మందులు కానీ అందుబాటులో లేవు.


టైఫాయిడ్


కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాపించే జ్వరం ఇది. దీనిలో జ్వరం, వికారం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు ఉంటాయి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫక్షన్. సమస్యలు తీవ్రతరం కాకముందే చికిత్స ప్రారంభించడం అవసరం. టైఫాయిడ్ కు ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక్కోసారి హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించాల్సి కూడా రావచ్చు.


వైరల్ ఫీవర్స్


నాన్ కోవిడ్ జ్వరాలు సాధారణం. జ్వరం, దగ్గు, జలుబు, ఫ్లూవంటి లక్షణాలు కనిపిస్తాయి.


లెప్టోస్పిరోసిస్


ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులకు కూడా సోకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ లో అధిక జ్వరం, తలనొప్పి, చలి, వాంతులు, కామెర్లు, కడుపునొప్పి, దద్దుర్ల వంటి లక్షణాలు ఉంటాయి. కలుషితమైన వర్షపు నీటిలో నడవడం వల్ల భారీ వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. వైద్య సలహాతో యాంటీబయాటిక్ మందులు వాడడం అవసరం.


వర్షాకాలంలో కొన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించేందుకు అవకాశం ఉంటుంది.



  • వర్షంలో తడిస్తే ఇంటికి చేరిన వెంటనే బట్టులు మార్చుకోవాలి.

  • ఏదైనా యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ శరీరానికి రాసుకోవాలి.

  • వర్షంలో తడిస్తే వీలైనంత వెంటనే తల తుడుచుకోవాలి.

  • ఒక కప్పు వేడి టీ లేదా కాఫీ డికాక్షన్ తీసుకోవాలి. ఇది శరీరంలో తిరిగి శక్తి సంతరించుకోవడానికి సహాయపడుతుంది


Also read : నిద్రలేవగానే బెడ్‌షీట్, తలగడలు ఇలా మారుతున్నాయా? అది క్యాన్సర్‌కు సంకేతం!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial