Dark Web: 


డార్క్‌వెబ్‌లో ఆర్డర్‌లు 


ఇంటర్నెట్ లేని ఇల్లు కనిపించడం లేదు. అంతలా అలవాటైపోయా అంతా. పెద్దలతో పాటు పిల్లలకూ ఇది అలవాటైంది. ఈ అలవాటు వ్యసనంగానూ మారుతోంది. కొంత మంది దారి తప్పుతున్నారు కూడా. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. 8 ఏళ్ల కొడుకు డార్క్‌వెబ్‌లో AK47 ఆర్డర్ చేశాడని ఓ తల్లి ఇచ్చిన కంప్లెయింట్‌ అందరినీ ఆశ్చర్యానికి, ఆందోళనకి గురి చేసింది. నెదర్లాండ్స్‌లోని బార్బరా జెమెన్ అనే మహిళ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కి ఈ విషయం చెప్పింది. సీక్రెట్‌గా డార్క్‌వెబ్‌లో ప్రమాదకరమైన వస్తువులెన్నో కొనుగోలు చేస్తున్నాడని, అందులో AK47 కూడా ఉందని చెప్పి షాక్ ఇచ్చింది.  Euronews వెల్లడించిన వివరాల ప్రకారం...ఆ బాలుడు చిన్నప్పటి నుంచే కంప్యూటర్‌కి అతుక్కుపోయేవాడు. అంత చిన్న వయసులోనే హ్యాకింగ్ కూడా నేర్చుకున్నాడు. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు పెట్టడమూ తెలుసుకున్నాడు. మొదట్లో పిజ్జా, బర్గర్‌లు ఆర్డర్ చేసుకునే వాడు. వీటి గురించి ఎవరికీ తెలియకుండా కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడేవాడు. పొరపాటున తల్లి తన రూమ్‌లోకి వస్తే వెంటనే అన్నీ క్లోజ్ చేసేవాడు. ఆన్‌లైన్‌లో ఎవరెవరితోనో మాట్లాడేవాడు. ఏవో గేమ్స్ ఆడుకుంటున్నాడులే అని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఓ రోజు ఉన్నట్టుండి తమ ఇంటికి AK47 గన్ డెలివరీ వచ్చింది. అప్పుడు కానీ అర్థం కాలేదు..తన కొడుకు ఏం చేస్తున్నాడో. ఎవరి కంటా పడకుండా ఇంటికి తీసుకొచ్చేందుకు పెద్ద ప్లాన్ వేశాడు ఆ బుడతడు. ఇదంతా విని షాక్ అయిన తల్లి వెంటనే లోకల్ పోలీసుల వద్దకు వెళ్లి గన్‌ని ఇచ్చేసింది. ప్రస్తుతానికైతే ఆ చిన్నారిపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు. 


తస్మాత్ జాగ్రత్త..


అయితే...చాలా రోజులుగా తన కొడుకు ప్రవర్తనలో మార్పు వచ్చిందని, పదేపదే యాంగ్జిటీకి గురవుతున్నాడని చెప్పింది బార్బరా జెమెన్. రాత్రంతా మేలుకుని ఉంటున్నాడని, ఇంటర్నేషనల్ హ్యాకర్స్‌తో మాట్లాడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. డచ్ పోలీసుల సాయంతో సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకుంటున్నానని, ఈ డార్క్‌వెబ్‌ నుంచి తన కొడుకుని బయట పడేస్తానని చెబుతోంది. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌ల కారణంగా పిల్లలు చాలా సులువుగా హ్యాకింగ్ నేర్చుకుంటున్నారని అంటోంది. వీలైనంత వరకూ వాటిని దూరంగా ఉంచాలని సూచిస్తోంది. సైబర్ క్రైమ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. తన కొడుకులా ఇంకే చిన్నారి మారకూడదని అంటోంది. 


సైబర్ నేరాలు..


మ్యాట్రిమోనీ సైట్లలో పెళ్లి కూతురు కావాలంటూ, పెళ్లి కొడుకు కావాలంటూ పోస్టులు పెట్టి.. ఆయా ప్రొఫైళ్లకు ఆకర్షితులైన వారి నుంచి డబ్బులు కాజేస్తున్న మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఓ ఘటన తాజాగా పుణెలో జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ఓ మహిళ ఏకంగా రూ. 91 లక్షల రూపాయలు కాజేసింది. పుణెకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి ఆన్‌లైన్‌ లో మహిళను కలుసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ నచ్చి తనను కాంటాక్ట్ అయ్యాడు. ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. కొన్ని రోజులుగా వీరి మధ్య ఫోన్లలో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మహిళకు పుణె టెకీకి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతూ వచ్చింది. అలా మాట్లాడుతూ బ్లెస్‌కోయిన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాలంటూ ఆ మహిళ పురుషుడితో మాట్లాడి ఒప్పించింది. ఆ మహిళ మాటలు నమ్మిన టెకీ.. పలు బ్యాంకులతో పాటు లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకుని దశల వారీగా రూ. 91.75 లక్షలను మహిళకు అందించి పెట్టుబడి పెట్టాడు. తను పెట్టిన పెట్టుబడి ఎంతకీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన అతడు ఆ మహిళను నిలదీశాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేహు రోడ్ లోని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.


Also Read: Indian Army: ఆర్మీ స్కూల్‌ విద్యార్థులే టార్గెట్‌- వాట్సాప్ గ్రూప్‌లతో వల వేస్తున్న పాకిస్థాన్