కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సీసీఐఎల్) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 93 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.


వివరాలు..


* ఖాళీల సంఖ్య: 93


➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ(మార్కెటింగ్‌): 06


➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ(అకౌంట్స్‌): 06


➥ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 81 


అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీత భత్యాలు: నెలకు మేనేజ్‌మెంట్ ట్రైనీకి రూ.30,000- 1,20,000; జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.22000-90000.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 13.08.2023.


Notification


Website



ALSO READ:


రైట్స్‌ లిమిటెడ్‌లో 111 వివిధ పోస్టులు, అర్హతలివే!
గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) వివిధ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 07వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 132 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 132 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు
ముంబయిలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఐఏసీఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్‌ శాఖల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్-1) పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకి ఆగస్టు1వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..