Father's Day 2024 Gift Ideas: నాన్న.. చూడటానికి గంభీరంగా కనిపిస్తాడు. కానీ మనస్సు మాత్రం వెన్న. నాన్న.. కోపంగా కనిపిస్తాడు.. కానీ ఆయనలో చిన్నపిల్లాడు కనిపిస్తాడు. నాన్న.. మన బాధ్యతలను మోస్తాడు. నాన్న లేకుంటే ప్రపంచమే లేదు. నాన్న ఉంటే ప్రపంచం మన ముందుంటుంది. నాన్న.. ఈ రెండు అక్షరాలు మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. కిందపడిన ప్రతిసారి పైకి లేపుతాడు. నేనున్నాంటూ వెన్నుతట్టి నడిపిస్తాడు. కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అలాంటి నాన్నను గౌరవించుకునేందుకు ఒక ప్రత్యేక సందర్భం ఉంది. అదే ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే ను నిర్వహిస్తారు.
మన జీవితంలో.. మనం ఎంతో అభిమానించే, గౌరవించే వ్యక్తికి మనకు తన నిస్వార్థమైన ప్రేమను పంచుతూ కంటికి రెప్పలా మనల్ని కాపాడుతుంటాడు. ఏటా నాన్న కోసం ఫాదర్స్ డేను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నాన్న కూడా ఈ ఫాదర్స్ డే రోజు తమ పిల్లల ముఖంలో ఆనందం చూసేందుకు పిల్లలకు రిటర్న్ గిఫ్టులు ఇస్తుంటాడు. మీకు కూడా అలా మీ చిన్నారులను సర్‌ప్రైజ్ చెయ్యాలని ఉంటే.. ఈ కింది గిఫ్ట్‌లను ప్రయత్నించండి.
1. స్టడీ యాప్‌లు లేదా సబ్‌స్క్రిప్షన్‌లు:
కోడింగ్, సైన్స్ లేదా భాషాభ్యాసం వంటి స్టడీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌లను బహుమతిగా ఇవ్వండి. పిల్లల ఆసక్తిని బట్టి వాటిని వారికి బహుమతిగా అందించండి.
2. DIY ఎలక్ట్రానిక్స్ కిట్‌లు:
DIY ఎలక్ట్రానిక్స్ కిట్‌లు మీ పిల్లలకు ఇచ్చేందుకు బెస్ట్ గిఫ్ట్ ఐడియా. ఈ కిట్‌లు తరచుగా సాధారణ సర్క్యూట్‌లు, రోబోట్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ డివైజులను అమర్చడానికి అవసరమైన విడి భాగాలతో లభిస్తాయి.
3. స్మార్ట్ బొమ్మలు:
పిల్లలు ఆటల ద్వారా నేర్చుకుంటారు. మీ పిల్లలు చిన్నవారైతే వారికి స్మార్ట్ బొమ్మలను బహుమతిగా ఇవ్వండి. గేమింగ్ లేదా లెర్నింగ్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు యాప్స్ తో ఇంటరాక్టివ్ అయ్యే స్మార్ట్ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి.
4. పిల్లలకి అనుకూలమైన హెడ్‌ఫోన్‌లు:
నేటికాలం పిల్లలకు మ్యూజిక్ వినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారికోసం మంచి హెడ్ ఫోన్స్ గిఫ్టుగా ఇవ్వండి. వాల్యూమ్ ను పెంచడం, తగ్గించడం వంటి ఫీచర్లు ఉన్న హెడ్ ఫోన్స్ అయితే బెటర్ .
5. కోడింగ్ గేమ్‌లు:
ఇంటరాక్టివ్ కోడింగ్ గేమ్‌లతో కోడింగ్ ప్రపంచానికి మీ పిల్లలను పరిచయం చేయండి. ఈ గేమ్‌లు కోడ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
6. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) పుస్తకాలు:
AR పుస్తకాలు లేటెస్టు టెక్నాలజీతో పలు లెర్నింగ్ స్కిల్స్‌ను డెవలప్ చేస్తాయి. మొబైల్ ద్వారా పాత్రలు, సన్నివేశాలకు జీవం పోసిన అనుభవాన్ని పొందుతారు.
7. టాబ్లెట్ లేదా ఇ-రీడర్:
మీ పిల్లలకి అనుకూలమైన టాబ్లెట్ లేదా వయస్సుకి తగిన కంటెంట్‌తో ఉన్న ఇ-రీడర్ వంటి విలువైన బహుమతిని కూడా ఇవ్వవచ్చు.
8. రోబోటిక్స్ కిట్లు:
రోబోటిక్స్ కిట్‌లు మీ పిల్లలకు ఇవ్వడానికి బెస్ట్ గిఫ్ట్స్. పిల్లలు తమ సొంత రోబోట్‌లను నిర్మించుకోవడానికి ప్రోగ్రామ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. వారి వయస్సు, స్కిల్స్ కు తగిన కిట్స్ ఇవ్వడం బెస్ట్.
9. 3D ప్రింటింగ్ పెన్:
3D ప్రింటింగ్ పెన్ వారి క్రియేటివ్ థింక్స్ కు జీవం పోయడానికి ఒక మనోహరమైన సాధనం. దీనిని బహుమతిగా ఇవ్వవచ్చు.
10. డిజిటల్ ఆర్ట్ సామాగ్రి:
మీ పిల్లల్లో ఉన్న కళాత్మక ప్రతిభను గుర్తించి వారికి డిజిటల్‌గా అన్వేషించడం కోసం కంప్యూటర్ లేదా టాబ్లెట్‌కి కనెక్ట్ చేయగల డ్రాయింగ్ టాబ్లెట్ లేదా స్టైలస్ వంటి డిజిటల్ ఆర్ట్ టూల్స్ వారికి బహుమతిగా ఇవ్వండి.