Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: దీప శౌర్యకి పాట నేర్పిస్తూ ఉంటుంది. బయట నిల్చొని కార్తీక్ పాట వింటూ ఉంటాడు. సడెన్‌గా శౌర్య కార్తీక్‌ని చూసి పాట ఆపేస్తుంది. కార్తీక్ లోపలికి వచ్చి నన్ను చూసి ఎందుకు పాట ఆపేశావ్ రౌడీ అని అడిగితే నువ్వు నవ్వుతావు అని అంటుంది. ఇక దీప కార్తీక్‌తో ఎందుకు ఇలా వచ్చారు అని అడిగితే ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు. స్కూల్‌లో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందని అంటాడు. అంటే ఏంటి అని దీప అడిగితే కార్తీక్ మొత్తం వివరిస్తాడు. తన ఫోన్‌కి మెసేజ్ వచ్చిందని అంటాడు. 


ఇక కార్తీక్ మీ దగ్గర ఫోన్ ఉంది కదా మీ అమ్మ నెంబరు ప్రిన్సిపల్‌కి ఇవ్వు అప్పుడు మీకు మెసేజ్‌లు వస్తాయని అంటుంది. ఇక దానికి శౌర్య నవ్వి మా అమ్మకు ఇంగ్లీష్ రాదని అంటుంది. ఇక పేరెంట్స్ మీటింగ్‌కి కార్తీక్‌ని కూడా రమ్మని శౌర్య పిలుస్తుంది. ఇక దీప, కార్తీక్‌లు శౌర్య మాటలకు తను స్కూల్‌కి వెళ్తే నర్శింహ మాటలు నిజం అవుతాయని అనుకుంటారు. దీప శౌర్యతో తానే స్కూల్‌కి వస్తాను అంటుంది. కార్తీక్ వెళ్లిపోతాను అనుకుంటే దీప బాబు మీతో మాట్లాడాలి అంటుంది.


కార్తీక్: విచిత్రం కాకపోతే దీప నాతో మాట్లాడుతా అనడం ఏంటి. నాకు తెలిసి మళ్లీ ఏదో తప్పు చేసి ఉంటాను. అందుకే క్లాస్ ఇవ్వడానికి మాట్లాడాలి అనుంటుంది. 
దీప: బాబు మీతో రెండు విషయాలు మాట్లాడాలి. స్వప్నకి ఇప్పుడు ఎలా ఉంది. మనసులో.. స్వప్న మీ చెల్లి బాబు ఏదో ఒకరోజు ఆ నిజం బయట పడితే నా కూతుర్ని తన తండ్రి వదిలేసినట్లే మీ నాన్న కూడా స్వప్నని వదిలేస్తాడు. ఆ రోజు స్వప్న ఆనాథలా మిగిలి పోకూడదు అంటే మీరే చూసుకోవాలి.
కార్తీక్: తను నాకు మెసేజ్ చేయలేదు. దీప నేనే ఇంటికి వెళ్లి తనకి కాల్ చేస్తాను.
దీప: చేయండి బాబు అప్పుడప్పుడు యోగక్షేమాలు తెలుసుకోండి. రెండో విషయం మీ సొంత విషయం బాబు నేను అడగకూడదు. కానీ ఒక రకంగా తెలుసుకోవడం నాకు ఎంతో అవసరం. జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా.  మీరు కాబోయే భార్యాభర్తలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎందుకో ఈ ఇంట్లో వాళ్ల మాటలకు మీరు చేస్తున్న పనులకు సంబంధం లేకుండా ఉంది. నేను అనుకునేది తప్పు అయితే క్షమించండి. అది నిజం అయితే ఏదో ఓ మూల కొంత నింద నేనూ మోయాల్సి ఉంటుంది. నేను అంతా కళ్లారా చూశాను. మీరు ఎందుకో చేతిలో చేయి వేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు. 
కార్తీక్: మనసులో.. అంత మందిలో ఎవరికీ రాని అనుమానం దీపకు వచ్చింది. దీపకు నా మనసు అర్థం అవుతుంది. ఇంతకీ దీప నాతో ఏం చెప్పాలి అనుకుంటుంది.
దీప: ఇదంతా మీ సొంత విషయం బాబు దీనికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ సమాధానం మీ దగ్గర ఉందా లేదా అని నా అనుమానం ఇలా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే బాబు మీరు శౌర్య గురించి ఆలోచించి నాకు ఫోన్ ఇచ్చారు. నేను అది ఊరికే తీసుకోలేదు. శౌర్య దగ్గర ఫోన్ జ్యోత్స్న చూసింది. మాటలు వినింది. మీరు వాళ్లని ఎంత దూరం పెడితే ఆ దూరానికి ఇంకెవరో కారణం ఉన్నారు అని వేరే వాళ్లు నిందలు మోయాల్సి వస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమైంది అని నాకు తెలుసు. మనసులో లేకపోతే మాటల్లో చెప్పండి. అంతే కాని మనుషుల్ని దూరం పెట్టకండి. ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి. 
కార్తీక్: పారు నిజం చెప్పదు. పైగా జ్యోత్స్న మనసు కూడా మార్చేస్తుంది. ఒక సారి జ్యోత్స్నతో మాట్లాడాలి. ఎవరి కారణంగా దీప బాధ పడకూడదు.


ఉదయం శౌర్యని దీప స్కూల్‌కి రెడీ చేస్తుంది. శౌర్య తల్లిని చీర మార్చుకోమని ఆ చీరతో స్కూల్‌కి రావొద్దని అంటుంది. మరోవైపు శ్రీధర్ తన రెండో ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలీకుండా చూడమని దేవుడిని కోరుకుంటాడు. హారతి తీసుకెళ్లి కాంచనకు ఇస్తాడు. కాంచన ఎమోషనల్ అవుతూ మీరు ఎన్ని పూజలు చేసినా నాకు కాళ్లు రావు అని చెప్తుంది. శ్రీధర్ మాత్రం ఇంకో ఇరవై ఏళ్లు అయినా నేను ఇలాగే నీ కోసం పూజలు చేస్తాను అంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి మీ ప్రేమ చూస్తే నాకు అసూయగా ఉంది అంటాడు. నా కంటే ఎక్కువ అమ్మని ప్రేమిస్తున్నారు అని కార్తీక్‌ అంటాడు. కాంచన మాత్రం మీ నాన్న అలాగే అంటారు తనకు మాత్రం నువ్వే ఇష్టం అని అంటుంది. ఇక కాంచన స్వప్న గురించి అడుగుతుంది. కార్తీక్ బాగుందని చెప్తాడు. ఇక కాంచన వీడియో కాల్ చేయమని అంటుంది. శ్రీధర్ సీరియస్ అయిపోతాడు. కార్తీక్ ప్రశ్నించడంతో కవర్ చేస్తాడు. 


కార్తీక్ జ్యోత్స్నని తీసుకొని రెస్టారెంట్‌కి వెళ్తున్నా అని చెప్తాడు. కాంచన చాలా సంతోషిస్తుంది. ఇక శ్రీధర్ కూడా స్వప్నని చూడటానికి కావేరి ఇంటికి వెళ్లాలి అని బయల్దేరుతాడు. కాంచన మాత్రం తన భర్త గురించి భార్య ఆఫీస్ తప్ప వేరే ఏం తెలీదు అని ఒకసారి తన భర్తకు తెలీకుండా ఆఫీస్‌కి వెళ్లి షాక్ ఇవ్వాలి అనుకుంటుంది. ఇక జ్యోత్స్న జాగింగ్ చేసి వస్తుంటే శౌర్య హాయ్ చెప్తుంది. జ్యోత్స్న కూడా హాయ్ చెప్తుంది. ఇక పేరెంట్స్ మీటింగ్ ఉందని శౌర్య చెప్తే మీ నాన్న కూడా వస్తారా అని జ్యోత్స్న అడుగుతుంది. రారు అని శౌర్య అంటే కార్తీక్‌ని ఉద్దేశించి ఇంకా ఎవరైనా వస్తారా అని అడిగితే దీప మాకు ఎవరూ లేరు అని ఎవరూ రారు అని అంటుంది. దీప వల్ల తాను చాలా ఏడ్చాను అని ఇంకోసారి ఏడ్వను అని నిన్నే ఏడిపించి తన ఇంటి నుంచి వెళ్లిగొడతాను అని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్ జ్యోత్స్నకి కాల్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దామని అడుగుతాడు. జ్యోత్స్న చాలా సంతోషిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్నుని మిత్ర దగ్గరకు చేర్చుతానన్న లక్ష్మి.. లక్కీ తన కూతురు అని తెలుసుకుంటుందా!