Waking Up in the Middle of the Night : రాత్రుళ్లు అతికష్టం మీద నిద్రపోయిన తర్వాత ఏదైనా కారణం వల్ల మెలకువ రావడం కామన్. కానీ ఆ మెలకువ వచ్చిన తర్వాత నిద్ర రాకపోతే అది నరకం. ఈ సమస్య వల్ల చాలామంది మెరుగైన నిద్రను కోల్పోతున్నారు. నిద్ర మధ్యలో మెలకువ రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఏదైనా సౌండ్ రావడం లేదా పీడకల, ఇంకేదైనా రీజన్​తో నిద్రలో మెలకువ వచ్చినా.. సింపుల్ టిప్స్​తో మళ్లీ నిద్రలోకి జారుకోవచ్చట. ఇంతకీ నిద్రను ప్రోత్సాహించే ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


స్క్రీన్ వద్దు


ఎలాగో నిద్రరావట్లేదు కదా అని కొందరు ఫోన్ చూస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. రావాల్సిన నిద్ర కూడా మొబైల్స్ చూడడం వల్ల దూరమైపోతుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గించి.. సిర్కాడియన్ రిథమ్​ను దెబ్బతీస్తుంది. 


టైమ్ చూడకండి.. 


నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ టైమ్ చూడకండి. ఎందుకంటే దానిని చూసినప్పుడు మీరు ఎక్కువసేపు పడుకోలేదని ఫీలింగ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా నిద్ర దూరమవుతుంది. లేదా మీరు లేవాల్సిన టైమ్ దగ్గర్లో ఉన్నా కూడా నిద్ర రాదు. కాబట్టి మెలకువ వస్తే టైమ్​ని చూడడం మానేయండి.


శబ్ధం వల్ల మెలకువ వస్తే.. 


ఏదైనా శబ్ధం వల్ల మీకు మెలకువ వస్తే మీరు ఇయర్ ప్లగ్స్​ ఉపయోగించవచ్చు. లేదంటే ఫ్యాన్ స్పీడ్ పెంచడం వల్ల కూడా శబ్ధం తగ్గుతుంది. లేదంటే మీరు white noise వినొచ్చు. ఓ పరిశోధనలో ఈ white noise నిద్రను మెరుగుపరుస్తుందని తేలింది. 


ప్లేస్ మార్చండి.. 


మధ్యరాత్రిలో మెలకువ వచ్చాక.. 15 నిమిషాల్లో మీకు నిద్రరాకపోతే.. మీరు పడుకొన్న ప్లేస్​ మార్చేయండి. లేదా వేరే రూమ్​కి మారండి. తర్వాత రిలాక్సింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే మళ్లీ నిద్రపోవడం సులభం అవుతుంది. 


ధ్యానం చేయండి.. 


బ్రీతింగ్ వ్యాయామాలు, ధ్యానం చేయడం వల్ల కూడా మెలకువ తర్వాత నిద్ర రావడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్న కాదనుకుంటే 4-7-8 రూల్​ని ఫాలో అవ్వండి. 4 సెకన్లు గాలి పీల్చుకోవడం 7 సెకన్లు దానిని హోల్డ్ చేయండి.. 8 సెకన్లు బయటకి వదలడం. 


కండరాలకు విశ్రాంతి.. 


మీకు నిద్ర రాకుంటే మీరు కండరాలను రిలాక్స్ చేసేందుకు ట్రై చేయండి. కండరాలను బిగబట్టి మళ్లీ రిలీజ్ చేయడం. దీనివల్ల కూడా మంచి నిద్ర మీ సొంతమవుతుంది. 


చీకటిగా ఉంటే బెటర్ 


వెలుగు ఉంటే నిద్ర వచ్చే అవకాశం తక్కువ కాబట్టి మీరు లైట్స్ ఆఫ్ చేయండి. మరింత బెనిఫిట్ కోసం బ్లైండ్స్ ఉపయోగించవచ్చు. దీనివల్ల మీరు త్వరగా నిద్రపోగలుగుతారు. 


మ్యూజిక్ 


మనసును ప్రశాంతంగా ఉంచే మ్యూజిక్ వినండి. ఇది నిద్రకు అంతరాయం కలిగించే శబ్ధాలు రాకుండా చేయడంతో పాటు.. మంచి నిద్రను అదించడంలో హెల్ప్ చేస్తుంది. 


ఈ టెక్నిక్స్ అన్ని మెలకువ వచ్చిన తర్వాత మళ్లీ వెంటనే నిద్రపోవడం హెల్ప్ చేస్తాయి. ఇవేమి మీకు వర్క్ అవ్వట్లేదనుకుంటే వైద్య సహాయం తీసుకోండి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిపుణుల సలహాలతో మీరు ఈ సమస్యను ఓవర్​కామ్ చేయొచ్చు.