రోజుల్లో జుట్టు రాలే సమస్య చాలా సాధారణమైపోయింది. దీనికి ఎన్నోకారణాలు ఉండి ఉండవచ్చు. వయో లింగ బేధాలు లేకుండా ఎవరికైనా జుట్టు రాలవచ్చు. అయితే స్త్రీలతో పోల్చుకున్నపుడు పురుషుల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలడం అనారోగ్యం వల్ల కూడా కావచ్చు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం జుట్టు సంరక్షణలో నిర్లక్ష్యం, సరైన లైఫ్ స్టయిల్ లేకపోవడం కారణం కావచ్చు. ఏది ఏమైనా జుట్టు రాలుతున్నపుడు దాని అసలు కారణాన్ని కనుగొని చికిత్స ప్రారంభించడం మంచిది.


జుట్టు రాలడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అత్యంత సాధారణంగా కనిపించేది ఆండ్రోజెనిక్ అలోపేషియా, దీనికి వంశపారంపర్యం, హార్మోన్ల తేడా కారణం కావచ్చు. థైరాయిడ్ సమస్యలు, అలోపేషియా ఎర్రటా, విపరీతమైన స్టయిలింగ్ లేదా జట్టును వేడి చెయ్యడం వల్ల కూడా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోవచ్చు. కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల వల్ల కూడా జుట్టు పూర్తిగా రాలిపోతుందని నిపుణులు కారణాలు వివరిస్తున్నారు. అది అనారోగ్యమే కాకపోవచ్చు, లైఫ్ స్టయిల్ సమస్యలు, జుట్లు పోషణ విషయంలో నిర్లక్ష్యం వంటివేవయినా కారణం కావచ్చు. అలాంటి కొన్ని కారణాల గురించి నిపుణులు ఎలాంటి జాగ్రత్తలు చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.




  • హీట్ స్టయిలింగ్




హీట్ ప్రొటెక్షన్ లేకుండా ఇంటెన్స్ హీట్ ట్రీట్మెంట్స్ తరచుగా తీసుకున్నపుడు కెరాటిన్ దెబ్బతినడం వల్ల జుట్టు పొడి బారి త్వరగా విరిగిపోవడం, ఊడి పోవడం  జరుగుతుంది. కనుక హీట్ స్టయిలింగ్ వల్ల కలిగే హానిని ఎదుర్కొనేందుకు హీట్ ఎక్స్పోజర్ ను తగ్గించాలి. హీట్ ప్రొటెక్షన్ ఉత్పత్తులను వాడడం, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జుట్టను స్టయిల్ చేసుకోవడం మంచిది. జుట్టును, స్కాల్ప్ ను తరచుగా డీప్ కండీషనింగ్ చెయ్యడం, జుట్టు స్ప్లిట్ ఎండ్స్ కత్తిరించడం తప్పనిసరి.




  • గమ్ నమలడం




చాలామందికి జిలటిన్ నమలడం, షుగర్ వాడకం జుట్టు రాలడానికి కారణం కావచ్చని చాలా మందికి తెలియదు. అయితే కొన్ని రకాల గమ్మీలలో పోషకాలు కూడా ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా పోషకాల సమతుల్యత మాత్రం కీలకం. అన్న పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం సప్లిమెంట్లపై ఆధారపడడం కంటే జుట్టు ఆరోగ్యానికి మరింత ప్రభావవంతంగా ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.




  • అతిగా బ్రష్షింగ్




జుట్టును ఎక్కువగా దువ్వడం లేదా బ్రష్ చెయ్యడం వల్ల స్కాల్ప్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా జుట్టు చిట్లడం, రాలిపోవడం జరగవచ్చు. జుట్టు దువ్వేందుకు లేదా బ్రష్ చేసేందుకు మృదువైన బ్రిసిల్స్ ఉన్న బ్రష్ లేదా వెడల్పయిన దంతాలున్న దువ్వెన వాడాలి. తరచుగా బ్రష్ లేదా దువ్వెన వాడకుండా చేతి వేళ్లను జుట్టు సవరించుకునేందుకు ఉపయోగించడం మంచిది. నిద్ర సమయంలో ఎక్కువ రాపిడి ఉండకుండా ఉండేందుకు శాటిన్ లేదా సిల్క్ స్కార్ఫ్ లో జుట్టు చుట్టి పెట్టుకోవడం లేదా శాటిన్ లేదా సిల్క్ పిల్లోకేసులను వాడడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.




  • బిగుతైన పోనీటెయిల్




హెయిర్ స్టయిలింగ్ చేసే సమయంలో జుట్టును మరీ బిగుతుగా కట్టి ఉంచే హెయిర్ స్టయిల్స్ ఎంచుకోకపోవడమే మంచిది. ఇలాంటి హెయిర్ స్టయిల్స్ నిరంతరాయంగా లాగడం వల్ల హెయిర్ లైన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది. గట్టిగా లాగి కట్టేందుకు బదులుగా వదులుగా ఉండేలా లో పోనీ టెయిల్ వేసుకోవడం మంచిది. టైట్ గా ఉండే ఎలాస్టిక్ బ్యాండ్ లకు బదులుగా సాఫ్ట్ గా ఉండే స్క్రాంచీలను ఉపయోగించాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో సాధారణ జుట్టు రాలే సమస్యను అధిగమించడం సాధ్యపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.