Healthy Realtionships : ప్రస్తుతం విడాకుల ట్రెండ్(Divorce Trend) ఎక్కువగా నడుస్తోంది. ఒకప్పుడు బ్రేకప్లతోనే సరిపోట్టేవారు.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి.. పెళ్లి చేసుకుని.. విడాకుల బాట పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఆత్రం ఎంత అయితే ఉంటుందో.. విడిపోవాలనే కుతుహలం కూడా అంతే ఎక్కువైతుందనేది నిపుణుల వాదన. అయితే వైవాహిక జీవితం హ్యాపీగా ఉండాలంటే.. భర్త, భార్య కూడా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లైంగికంగానే కాదు.. మానసికంగా కూడా వారు దగ్గరగా ఉండేందుకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేంటంటే..
ఇద్దరు విడిపోవడానికి ఎన్ని ప్లానింగ్స్ వేస్తున్నారో.. ఇద్దరు కలిసి ఉండడానికి కూడా అన్ని ప్లానింగ్స్ వేయాలంటున్నారు. ఓ రిలేషన్ బాగుండాలంటే ఇద్దరు కచ్చితంగా ఎఫెర్ట్స్ పెట్టాలంటున్నారు. వారి మధ్య సంబంధం హెల్తీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా అని ఓ రిలేషన్లో గొడవలు ఉండవని కాదు అని.. అవి కామన్ అని.. కానీ ఆ సమయంలో ఎలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారో అదే మీరు బంధాన్ని కాపాడుకోవడానికి ఇచ్చే ఎఫర్ట్ అంటున్నారు.
రిలేషన్‌ని గౌరవించండి..
ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఆ జంటలా మనం ఉండట్లేదని పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. మీరు నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే.. ఇతరులతో మీ సంసారాన్ని పోల్చుకోకూడదని.. కష్టాల్లో, సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా మీ భాగస్వామిపై ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే.. మీరు కూడా వారితో కలిసి హేళన చేయకుండా.. అలా కామెంట్స్ చేసే వారిని కంట్రోల్ చేసి.. మీ భాగస్వామి రెస్పెక్ట్ పెంచాలి. దీనివల్ల మీ బంధం మరింత బలపడుతుంది.
సాన్నీహిత్యం..
క్లోజ్‌నెస్ అనేది లైంగికంగానే కాదు.. మానసికంగా కూడా ఉండాల్సిన ఓ అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే లైంగిక వాంఛ ఈరోజు ఉన్నా.. రేపు ఉండకపోవచ్చు. కానీ మీరు ఇద్దరు మానసికంగా హ్యాపీగా ఉంటే.. మీ రిలేషన్ చాలా బాగుంటుంది. అలా అని శారీరకంగా అనే దానిని నెగ్లెక్ట్ చేయాలని కాదు.. అది కూడా భార్య భర్తల రిలేషన్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మీరు మానసికంగా కూడా దగ్గరగా ఉంటే ఎలాంటి ఆందోళనలు, భయాలు ఉండవు. ఇది మీకు మంచి ఫ్యామిలీ వాతావరణాన్ని ఇస్తుంది.
కాంప్లిమెంట్స్ ఇచ్చుకోండి..
మీ పార్టనర్ అందంగా ముస్తాబైనప్పుడు.. లేదా న్యాచురల్‌గా బాగున్నప్పుడు.. ఏదైనా పనిచేస్తున్నప్పుడు మీకు నచ్చితే.. కచ్చితంగా వారికో కాంప్లిమెంట్ ఇవ్వండి. కాంప్లిమెంట్స్ అనేవి రిలేషన్‌కి బూస్టింగ్ ఇచ్చే మెడిసన్స్ లాంటివి. కాబట్టి అప్పుడప్పుడు మీ భాగస్వామికి ఓ కాంప్లిమెంట్ ఇచ్చేయండి.
ఈ విషయాల్లో కూడా
ఇవే కాకుండా కొన్ని విషయాల్లో దంపతులు కచ్చితంగా తమ రిలేషన్‌ని కాపాడుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీ భాగస్వామి ఏదైనా చెప్తే.. మీరు అంగీకరించాలి. మీ ఆలోచనల్ని వారిపై రుద్దే ముందు.. వారు చెప్పేది కూడా మీరు పూర్తిగా విని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా మీ ఇద్దరూ బిజీగా ఉండేవారు అయితే.. కచ్చితంగా మీ పార్టనర్‌తో కలిసి ఉండేందుకు ప్లానింగ్స్ చేస్తూ ఉండాలి. ఆ సమయంలో మీ వర్క్, ఇతర వ్యవహారాలు ఉండకుండా చూసుకోవాలి. మీరు తప్పు చేశారనిపిస్తే కచ్చితంగా మీ పార్టనర్‌కి సారీ చెప్పండి. కాంప్లీమెంట్స్ ఇవ్వడం ఎంత అవసరమో.. క్షమాపణ చెప్పడం కూడా అంతే అవసరం. మీ భాగస్వామి దగ్గర కాస్త తగ్గితే.. వారి కోపమూ తగ్గుతుంది.. మీ బంధము నిలబడుతుంది.
Also Read : వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త ఇలా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువట