మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. తరచుగా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకోవాలి. ఆ రిపోర్టుల ఆధారంగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. షుగర్ అదుపులో లేకపోతే గుండె జబ్బులు, కిడ్నీసమస్యల నుంచి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. అయితే పర్సనల్ కేర్ తో డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడం సులభమే. డయాబెటిస్ తో బాధపడేవారు చాలా మంది దశాబ్దాల కాలం పాటు ఆరోగ్యకరమైన ఆనంద జీవితం గడపవచ్చు.


మధుమేహులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని మార్గాలను గురించి ఎక్స్పర్ట్స్ ద్వారా ఇక్కడ తెలుసుకుందాం. రోజంతా డయాబెటిక్ ఫ్రెండ్లీగా గడిపినప్పటికీ పడుకునే ముందు తప్పనిసరిగా చెయ్యాల్సిన కొన్ని పనులను గురించి ఇక్కడ చర్చిద్దాం.


చామంతి టీ


ఎండిన చామంతి పువ్వులతో తయారు చేసిన టీ. ఇది ఆయుర్వేదంలో చాలా ప్రాచూర్యంలో ఉన్న టీ. చాలా వ్యాధులకు నివారణగా అనాదిగా ఉపయోగంలో ఉంది. డయాబెటిక్స్ రాత్రి నిద్రకు ముందు ఒక కప్పు చామంతి టీ తాగితే చాలా మంచిది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని చక్కగా నియంత్రిస్తుంది కూడా.


నానబెట్టిన బాదం


బాదంలో పోషకాలు పుష్కలం. రాత్రి పడుకునే ముందు 7 నాన బెట్టిన బాదం పప్పులు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బాదంలో మెగ్నీషియం, ప్రొటీన్లు ఉంటాయి. ఫలితంగా మంచి నిద్రకు దోహదపడుతుంది. ఇవి తింటే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.


నానబెట్టిన మెంతులు


మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెంతులు హైపోగ్లైసిమిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. మెంతులు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. నానబెట్టిన మెంతులు రాత్రి నిద్రకు ముందు తింటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.


వజ్రాసనం


యోగాలో వజ్రాసనం డయాబెటిస్ నిర్వహణలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. నిద్ర పోయే ముందు వజ్రాసనం వెయ్యడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి రెండూ కూడా అదుపులో ఉంటాయి. అంతే కాదు రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. 5 నుంచి 10 నిమిషాల వజ్రాసన సాధన మంచి ఫలితాలను ఇస్తుంది.


సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం, శరీర బరువు నియంత్రణలో పెట్టుకోవడం, పొగాకు మానెయ్యడం, ఒత్తిడి తగ్గించుకోవడం వంటివన్నీంటితో డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవడం సులభమవుతుంది.


Also read : Viagra: వృద్ధులకు వరం వయాగ్రా, 80 ఏళ్ల తర్వాత దీన్ని తీసుకుంటే జరిగేది ఇదే!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial