డక గదిలో ఆలుమగల ఏకాంత చర్యను చాలా విలువైనదిగా భావిస్తారు. స్త్రీ పురుషులిద్దరిలో సహజంగా జరిగే ప్రాకృతిక చర్య ఆ వాంఛ. ఈ కలయిక జంట మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. తనువులు కలిసినపుడు మనసులు వికసిస్తాయి. అయితే జీవితంలో యవ్వనంలో ఉన్నపుడు ఆ చర్య సహజంగానే జరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో పటుత్వం తగ్గితే, స్త్రీలలో ఆసక్తి తగ్గుతుంది. అందుకే నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ అని కవులు రాస్తుంటారు. అలా జరుగుతున్నపుడు కొంత మంది డిప్రెషన్‌కు లోనవుతారు. ముఖ్యంగా పురుషులు అలాంటి వారి పాలిట వరం వయాగ్రా.


కానీ వయాగ్రా వాడాలని చాలా మంది పురుషులు అనుకున్నా సరే వీటి వాడకం గురించి రకరకాల వాదనలు, అభిప్రాయాలు చెలామణిలో ఉన్నాయి. అందువల్ల చాలా మంది వాడేందుకు జంకుతారు. అయితే ఈ మధ్య కాలంలో వయాగ్రా వాడుతున్న పెద్దవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. 70, 80 సంవత్సరాల తర్వాత కూడా లైంగికంగా చురుకుగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.


పోయిన సంవత్సరం కంటే ఈ ఏడాది 80 సంవత్సరాలు పైబడిన పురుషులకు వయగ్రా మందులు దాదాపుగా రెండు లక్షల పైగా ప్రిస్క్రిప్షన్లు వెలువడ్డాయట. ఆశ్చర్యకరంగా పశ్చిమదేశాల్లో 99, 102 సంవత్సరాల పురుషులు కూడా ఇంకా ఆ విషయంలో చురుకుగా ఉండాలని ఆశిస్తున్నారు. 2016లో 127,448 నుంచి గత సంవత్సరం 196,867 కి పెరిగాయని లెక్కలు చూపుతున్నారు అక్కడి వైద్య నిపుణులు.


వృద్ధులకు వరంగా మారుతున్న వయాగ్రా


60 సంవత్సరాల పైబడిన వారు వయాగ్ర వాడుతున్న వారిలో ఎక్కువగా ఉన్నారట. ప్రతి 40 మంది పురుషుల్లో ఒకరు ఈ మందు వాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వయాగ్రా గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని భావించేవారు. కానీ ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా గుండె ఆరోగ్యానికి మంచిదని లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ కు చెందిన యూరాలజిస్ట్ గోర్డాన్ ముయిర్ చెబుతున్నారు. ఈ మందులు వాడుతున్న పెద్ద వయసు పురుషుల్లో గుండె సమస్యల ప్రమాదం చాలా తగ్గిందని రక్తనాళాలు ఆరోగ్యంగా ఉన్నాయి, డిప్రెషన్ లేకపోవడం, ఒత్తిడి తక్కువగా ఉండడం కూడా గమనించారట.


వయాగ్రా ఎలా పనిచేస్తుంది?


వయాగ్ర మందు పురుషుల్లో పటుత్వానికి లేదా ఎక్కువ సమయం పాటు భాగస్వామిని సుఖపెట్టేందుకు ఉపయోగిస్తారు. వయాగ్ర పురుషాంగానికి రక్త ప్రసరణ పెంచడం వల్ల ఎక్కువ సేపు గట్టిగా ఉంటుంది. కేవలం పురుషుడిని లైంగికంగా ప్రేరేపించబడినపుడు మాత్రమే ఈ మందు పనిచేస్తుంది. లేకపోతే పని చెయ్యదు. వయాగ్రా వాడాలని అనుకునే వారు తప్పకుండా డాక్టర్ సలహా మేరకు మాత్రమే వాడాలి. ఆన్ కౌంటర్ వయగ్రా వాడకూడదు.


కచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.



  • తలనొప్పి రావచ్చు

  • దృష్టిలో స్పష్టత లోపించవచ్చు.

  • తల తిరగవచ్చు

  • కండరాల నొప్పులు రావచ్చు

  • దగ్గు కూడా రావచ్చు

  • కొంత మందిలో దద్దుర్లు కూడా రావచ్చు.


అయితే గుండె జబ్బుల్లాంటి పెద్ద ప్రమాదాలేమీ లేవని నిపుణులు చెబుతున్నారు కనుక వయగ్రా వాడి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలని అనుకునే వారు డాక్టర్ సలహా మేరకు నిర్దేషించిన మోతాదులో నిరభ్యంతరంగా వాడుకోవచ్చట.


Also read : తరచుగా అజీర్తి చేస్తోందా? పొట్టలో అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుందా? ఈ వ్యాధే కారణం కావచ్చు!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial