తిన్న తర్వాత అసౌకర్యంగా ఉండడం లేదా నొప్పి గా ఉండడం క్యాన్సర్ కు సంకేతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధితో బాధ పడుతున్న వారిలో చాలా మంది అజీర్ణం వంటి లక్షణాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి.


తరచుగా గుండెలో మంటగా అనిపించడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, వికారంగా ఉండడం, వాంతులు అవుతుండడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రాణాంతక వ్యాధి కావచ్చని అనుమానించాల్సి ఉంటుంది. ఏ కాస్త తిన్నా సరే కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఇవన్నీ కూడా అజీర్తిలో కూడా కనిపించే లక్షణాలే. ఒకవేళ అజీర్తి వల్ల కలిగిన లక్షణాలయితే చిన్నచిన్న చిట్కాలతో కూడా తగ్గిపోతాయి. పెద్దగా ప్రమాదం కూడా ఉండదు. కానీ కాలేయ క్యాన్సర్ గుర్తించడంలో అచ్చంగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల పొరపాటు పడుతుంటారు.


జీర్ణక్రియ మీద ప్రభావం చూపే లక్షణాలను గుర్తించడం చాలా సులభం.



  • అనారోగ్యంగా ఉన్న భావన కలుగుతుంది. నిజంగానే అనారోగ్యంగా ఉంటారు కూడా

  • పొట్ట కుడి దిక్కున పై వైపు నొప్పిగా ఉండడం లేదా కుడి భుజంలో నొప్పి ఏం తిన్నా కూడా కాస్త తినగానే కడుపు నిండిన భావన కలగడం అజీర్తి లక్షణం

  • ఏం తింటున్నామనే దానితో సంబంధం లేకుండా కడుపు ఉబ్బరంగా అనిపించడం

  • అకారణంగా బరువు తగ్గడం (6 నుంచి 12 నెలల్లో సాధారణ బరువులో 5 శాతానికి మించి బరువు తగ్గిపోవడం)

  • చర్మం, కళ్లలోని తెల్లని భాగం పసుపు రంగులోకి మారడం దీన్ని కామెర్ల లక్షణంగా చెప్పవచ్చు.

  • జ్వరంగా ఉండడం

  • చర్మం మీద దురదలు రావడం

  • మల విసర్జన ముదురు రంగు లేదా లేత రంగులో ఉండడం

  • ఎల్లప్పుడూ అలసటగా ఉండడం

  • కడుపులో కుడివైపు లంప్ ఉండడం

  • ఫ్లూవంటి లక్షణాలు ఉండడం


కేవలం పైలక్షణాలు కనిపించినంత మాత్రాన క్యాన్సర్ ఉందేమో అని కంగారు పడాల్సిన పనిలేదు. కానీ ఈ లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే మాత్రం తప్పక వైద్య సలహా తీసుకోవాలి. ఒకవేళ క్యాన్సర్ వల్ల అయితే మాత్రం వీలైనంత సత్వరం చికిత్స ప్రారంభించడం వల్ల పూర్తి స్థాయిలో నయం చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణుల సలహా.


కాలేయ క్యాన్సర్ సాధారణంగా స్త్రీలతో పోల్చినపుడు పురుషుల్లో ఎక్కువ. కాలేయం శరీరంలో రెండవ అతి పెద్ద అవయవం. ఊపిరితిత్తుల కింద కుడి వైపున ఉంటుంది. కాలేయ కణజాలాల్లో అనియంత్రిత విభజన క్యాన్సర్ గా చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో ఇతర భాగాలకు వ్యాపించిన తర్వాత గానీ గుర్తించడం వీలుకాదు.


చాలా రకాల ప్రైమరీ లివర్ క్యాన్సర్లు ఉంటాయి



  • హెపాటోసెల్లర్ కార్సినోమా (HCC) - అత్యంత సాధారణమైనది

  • ఫైబ్రోలామెల్లర్ క్యాన్సర్ - అరుదైన HCC రకం

  • పిత్త వాహిక క్యాన్సర్ (కోలాంగియోకార్సినోమా అని కూడా పిలుస్తారు - కాలేయం లోపల లేదా వెలుపల పిత్త వాహికలలో ప్రారంభమవుతుంది)

  • యాంజియోసార్కోమా (లేదా హేమాంజియోసార్కోమా) - కాలేయం రక్త నాళాలలో మొదలవుతుంది మరియు ఇది చాలా అరుదు.

  • హెపటోబ్లాస్టోమా – చాలా అరుదుగా పిల్లల్లో కనిపించే క్యాన్సర్


క్యాన్సర్ బారిన పడిన 10 మందిలో ఒకరు క్యాన్సర్ తర్వాత కూడా పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం జీవించినట్టు లెక్కుల చెబుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం, పెద్దగా లక్షణాలు కనిపించని క్యాన్సర్ గా చెప్పవచ్చు.


 Also read : సరిగ్గా ఈ వయస్సు రాగానే ఆలోచనలు, శరీరంలో మార్పులు వస్తాయట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial