యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఎనర్జీ తగ్గిపోతుంది. ఎముకలు అరుగుదల, డయాబెటిస్, ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలు వంటివి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మందికి డయాబెటిస్ వచ్చేస్తుంది, దీని వల్ల ఇష్టమైనది తినే అవకాశం ఉండదు. కనుక పోషకాలు అన్ని సక్రమంగా అందకపోవడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారవచ్చు అందుకే వైద్యులు సప్లిమెంట్స్ రూపంలో వారికి పోషకాలు అందే విధంగా ట్యాబ్లెట్స్ ఇస్తారు. డైటరీ సప్లిమెంట్లు ట్యాబ్లెట్స్, పౌడర్, జెల్ క్యాప్సూల్స్, లిక్విడ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. యాభై ఏళ్లు దాటిన వారు కచ్చితంగా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవిగో..
కాల్షియం
కాల్షియం విటమిన్ డి తో కలిసి అన్ని వయసుల వారికి ఎముకల్ని ధృడంగా ఉంచేందుకు సహాయపడుతుంది. శరీరానికి తగినంత కాల్షియం అందకపోతే ఎముకలు క్షీణత సంభవించే అవకాశం ఉంది. తరచుగా ఇటువంటి సమస్యలు స్త్రీలలో కనిపిస్తాయి. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, తృణ ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఈ ఆహారాన్ని తప్పనిసరిగా వీటిని తమ డైట్ లో భాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
విటమిన్ డి
విటమిన్ డి ఫోర్టీఫైడ్ పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, కొవ్వు చేపల ద్వారా పొందవచ్చు. అలాగే వైద్యులని సంప్రదించి విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
విటమిన్ బి 6
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. బంగాళాదుంపలు, అరటి పండ్లు, చికెన్ బ్రెస్ట్, బలవర్ధకమైన తృణధాన్యాల్లో లభిస్తుంది. శరీరానికి రక్తం చాలా అవసరం. ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గితే అది ఇతర అనారోగ్యాలకి దారి తీసే అవకాశం ఉంది. అందుకే సప్లిమెంట్స్ ద్వారా అయినా విటమిన్ డి పొందేందుకు ప్రయత్నించాలి.
విటమిన్ బి 12
ఈ విటమిన్ ఎర్ర రక్త కణాలు, న్యూరాన్ల ఆరోగ్యానికి చాలా అవసరం. వృద్ధులకు సాధారణ పెద్దల మాదిరిగానే విటమిన్ B12 అవసరం అయితే కొంతమందికి ఆహారం ద్వారా విటమిన్ ను గ్రహించడంలో ఇబ్బంది ఉంటుంది. అటువంటి పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళు సప్లిమెంట్స్ ద్వారా పొందవచ్చు. ఆర్గానిక్ వితం బి 12 జంతు ఆహారాలకు మాత్రమే పరిమితం చెయ్యడం వల్ల శాఖాహారులు దీన్ని పొందలేరు. తద్వారా విటమిన్ లోపానికి గురికావాల్సి వస్తుంది. సప్లిమెంట్స్ ద్వారా విటమిన్ బి 12 తీసుకోవచ్చో లేదో వైద్యుల సలహా తీసుకున్నాకే వాటిని ఉపయోగించాలి.
ఆహార సప్లిమెంట్‌లు ఏ వయసులోనైనా ఉపయోగపడతాయి అయితే వాటిని హానికరమైన మందుల కలయికతో కలిపి తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తీసుకునే సప్లిమెంట్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేదంటే అవి ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: జుట్టు చివర్లు చిట్లిపోయి ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే అద్భుత ఫలితం
Also Read: పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే, మీరు కూడా ట్రై చేయండి