మీరు గొప్ప బ్యాట్స్‌మ్యానే కావచ్చు. కానీ, మొదటి బంతికే ఔటైపోతే.. అది ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇది ఆటకే కాదు, జీవితానికి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా పడక గదిలో. 


ఔనండి, ప్రపంచంలో ప్రతి మగాడికి బెడ్ రూమ్‌లో ఎదురయ్యే ప్రధాన సమస్య శీఘ్ర స్కలనం (అకాల స్ఖలనం). ఈ సమస్య నుంచి బయట పడేందుకు పురుషులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, అవన్నీ విఫల ప్రయత్నాలే అవుతాయి. అయితే, ఓ కొత్త అధ్యయనం మాత్రం ఓ ‘షాకింగ్’ గుడ్ న్యూస్ చెప్పింది. శృంగారం మొదలుపెట్టగానే జరిగిపోయే ఆకస్మిక స్కలన సమస్యకు ‘షాక్’తో సమాధానం చెప్పవచ్చట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. చూడండి. 


శీఘ్ర స్కలన సమస్య పరిష్కారం కోసం లెబనాన్‌లో వైద్యులు ఓ ప్రక్రియను పరీక్షించారు. ఎలక్ట్రిక్-కరెంట్ థెరపీ(జాపింత్ థెరపీ) చేయించుకున్న తర్వాత ఒక వ్యక్తికి ఏడు నిమిషాలపాటు స్కలనం కాలేదట. ఆసియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో ప్రచురించిన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. బీరూట్‌లోని వైద్యులు పురుషాంగం నుండి కదలికల సమాచారాన్ని సేకరించే నరాలలో ఒకటైన ‘డోర్సల్ పెనైల్’ నాడిని ఉత్తేజపరిచేందుకు పురుషాంగం ద్వారా విద్యుత్‌ను ప్రసరింపజేశారట.


ఈ కరెంట్ థెరపీ కోసం నిపుణులు 28 ఏళ్ల బాధితుడిపై పరీక్షలు జరిపారు. బాధితుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఒక సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. కేవలం 40 సెకన్లు కంటే ఎక్కువ సేపు శృంగారం చేయలేకపోయేవాడు. కారణం.. శీఘ్ర స్కలనం. ఈ సందర్భంగా పరిశోధకులు అతడికి మందుల ద్వారా శీఘ్ర స్కలన సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలించలేదు. ఆ తర్వాత ‘జాపింగ్ థెరపీ’ చికిత్స అందించారు. అతని పురుషాంగం ద్వారా తేలికపాటి విద్యుత్‌ను ప్రసరింపజేశారు.  


జాపింగ్ థెరపీలో భాగంగా బాధితుడి పురుషాంగం పై రెండు ఎలక్ట్రోడ్‌లను ఉంచారు. ఇలా ఆరు నెలలపాటు వారానికి 30 నిమిషాలపాటు అతడికి ఈ థెరపీ నిర్వహించారు. అయితే, ఈ కరెంట్ థెరపీ వల్ల బాధితుడు ఏ విధంగా ఫీలయ్యాడనేది అధ్యయనంలో వివరించలేదు. అతడు బాధకు గురయ్యాడా? లేదా సురక్షితమైనా విధానమేనా అనేది స్పష్టంగా చెప్పలేదు.  


థెరపీ తర్వాత బాధితుడిని శృంగారంలో పాల్గోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇంట్రావాజినల్ ఎజకులేషన్ లేటెన్సీ టైమ్ (intravaginal ejaculation latency time - IELT) కొలవడానికి అతడు శృంగార సమయంలో స్టాప్‌వాచ్‌ను ఉపయోగించాడు. పురుషాగం యోనిలోకి ప్రవేశించడం నుంచి స్ఖలనం జరిగే వరకు ఎంత సమయం అతడు శృంగారం చేయగలిగాడనేది లెక్కించారు. 


Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి


ఈ చికిత్సకు ముందు అతడి IELT కేవలం 40 సెకన్లు మాత్రమే. ఆరు నెలల తర్వాత అతడి సామర్థ్యం 3.54 నిమిషాలకు పెరిగింది. ఈ థెరపీ వెంటనే ఫలితం చూపిందని పరిశోధకులు వెల్లడించారు. అతడి మళ్లీ తన లైంగిక శక్తిని తిరిగి పొందాడని వివరించారు. థెరఫీ కొనసాగించిన 15 నెలల తర్వాత అతడు 4.9 నిమిషాల వరకు స్కలనం కాకుండా శృంగారం చేయగలిగాడు. అయితే, ఈ థెరపీ కేవలం వైద్యుల సమక్షంలోనే జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్వయంగా చేయడం సాధ్యం కాదు. పైగా, దీనికి ఇంకా అధికారిక అనుమతి కూడా లభించలేదు. కాబట్టి, ఈ విషయాన్ని మీరు కేవలం అవగాహన కోసమే తెలుసుకోండి. లేనిపోని ప్రయోగాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. 


Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..


గమనిక: అధ్యయనంలో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ కథనం వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యుడి సలహాలు, సూచనలను మాత్రమే పాటించాలి. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించవని గమనించగలరు.