హ్యుండాయ్ కొత్త క్రెటా కారును గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్ చేసింది. దీనికి 3-స్టార్ రేటింగ్ ఇవ్వడం విశేషం. రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న క్రెటా బేసిక్ వెర్షన్‌ను ఈ టెస్టింగ్‌లో ఉపయోగించారు. ఫ్రంటల్ క్రాష్ ప్రొటెక్షన్‌ను గ్లోబల్ ఎన్‌సీఏపీ టెస్ట్ చేసింది.


ఈ టెస్టులో మూడు స్టార్ల రేటింగ్ రావడం అంటే ఇందులో డీసెంట్ సేఫ్టీ ఉన్నాయనే చెప్పవచ్చు. క్రెటా టాప్ స్పెసిఫికేషన్ల వేరియంట్లో వెనకవైపు మిడిల్ సీట్ బెల్టు, ఆరు ఎయిర్ బ్యాగ్స్ సహా మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కానీ ఈ టెస్టులో క్రెట్ బేస్ మోడల్‌నే ఉపయోగించారు.


హ్యుండాయ్ ఇటీవలే తన క్రెటా కారులో కొత్త గేర్ బాక్స్ వేరియంట్‌ను తీసుకువచ్చింది. ఇది క్లచ్‌లెస్ మాన్యువల్ మోడల్ కావడం విశేషం. ఈ ఐఎంటీ వేరియంట్ ఇప్పటికే వెన్యూ, ఐ20ల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు క్రెటాలో కూడా ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం క్రెటాలో మాన్యువల్, సీవీటీ, డీసీటీ, టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


క్రెటా డీసీటీ లేదా సీవీటీ పెట్రోల్ ఆప్షన్ కొనాలనుకునేవారికి వెయిటింగ్ పీరియడ్ కొంచెం ఎక్కువగా ఉంది. వారికి మరో ఆప్షన్‌గా ఈ ఐఎంటీ వేరియంట్ లాంచ్ అయింది. ఇందులో టర్బో 1.4 లీటర్ పెట్రోల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.


దీంతో కొనుగోలుదారులు క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌లో సీవీటీ, ఐఎంటీ గేర్ బాక్స్ వేరియంట్లు ఉండనున్నాయి. ఐఎంటీ వెర్షన్ కేవలం ట్రిమ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర రూ.12.68 లక్షలుగా నిర్ణయించారు. మాన్యువల్ వేరియంట్ కంటే ఇది రూ.20 వేలు మాత్రమే ఎక్కువ.


ఐఎంటీ వేరియంట్లో కారును మాన్యువల్ మోడల్ తరహాలోనే డ్రైవ్ చేస్తాం. కానీ క్లచ్ అవసరం ఉండదు. దీంతోపాటు క్రెటా నైట్ ఎడిషన్ కూడా ఉంది. ఇది పూర్తిగా బ్లాక్ లుక్‌లో ఉంది. స్టాండర్డ్ క్రెటా తరహాలో కాకుండా... ఇది పూర్తిగా బ్లాక్ కలర్‌లో రానుంది. చివరికి దీని అలోయ్స్ కూడా బ్లాక్ కలర్‌లోనే డిజైన్ చేశారు.


ఈ కారు లోపలి భాగంలో ఇంటీరియర్ కూడా గ్లాస్ బ్లాక్ లుక్‌లోనే లాంచ్ అయింది. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 1.4 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌లో దీన్ని అందించలేదు. కియా సెల్టోస్‌లో ఐఎంటీ వేరియంట్ అందుబాటులో ఉంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?